మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య…

మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా,జహీరాబాద్ నియోజకవర్గ (ఎం పి పి ఎస్) రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా భాగ్యసాములుగా పాల్గొన్నారు,

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం..

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మర్రిపల్లి సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మర్రిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ పాల్గొని ఘన
నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి త్యాగం, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడి ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని చూపారాన్నారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గాజు శివాజీ,కుక్కమూడి కవిత,డ్యాగం రాణి నర్సింగం,రాజేందర్ అపర్ణ,మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాపరెడ్డి,మహిళా సంఘం సీసీ వేల్పుల సుజాత,గ్రామ పెద్దలు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,కుక్కమూడి సాంబయ్య,గ్రామ మహిళలు కశివొజ్జువుల రాజేశ్వరి,కుక్కమూడి కర్ణ,తలారి రజిత,మైదం స్రవంతి,ఆశా వర్కర్ మైదం సరోజన,యూత్ సభ్యులు డ్యాగం శివాజీ,పొన్నాల మైపాల్,కుక్కమూడి గోవర్ధన్,చిరంజీవి,మైదం దిలీప్,కుక్కమూడి స్వామి,శ్రీనివాస్,ప్రదీప్,సిద్దు,ఇల్లందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా…

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి ని పురస్కరించుకొని,గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు,ప్రతి జిల్లాలో 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో,జిల్లాలోని 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,డిఇఓ వెంకటేశ్వర్లు ,నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా,ఎం పి పి ఎస్ రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా తమ విద్యా సేవలకు గాను,జిల్లా కలెక్టర్ డిఇఓ నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం జరిగింది.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం…

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం

నేటి ధాత్రి అయినవోలు:-

 

సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షర ద స్కూల్ ,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల విద్యకోసం ఎనలేని కృషి చేసారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జయంతిని మహిళా టీచర్స్ డే గా నిర్వహించడం చాలా గొప్పన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ,సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆర్.జ్యోతి గౌడ్,జి. భవాని,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

శనివారం కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మధ్య యుగపు చీకటి రోజులలో సమాజం అందాకారంలో బంధించబడి పరిస్థితులు ఉన్న రోజులవి అన్నారు. మూడవిశ్వాసాలతో, సాంఘిక దురాచారాలతో వెలుగొందితూ.. స్త్రీలకు చదువుకునే అవకాశం లేక, స్త్రీలు అనగదొక్కబడుతున్న కాలంలో… భర్త జ్యోతిబాపూలే సహకారంతో చదువుకొని భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాయించిందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మొదటి బాలిక పాఠశాలలను స్థాపించింది. స్త్రీ విద్యకు పునాది వేయడం జరిగింది. పుస్తకం పట్టిన చేతులు భవిష్యత్తును మార్చగలరని, అందాకారాన్ని చీల్చన విద్యా దీపం అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి నీలంతా బాగా చదువుకొని సమాజ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులైన కే పార్వతి, రాధాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, రాగి బిక్షపతి, మహంకాళి యాకాంబరం, వి రాజేంద్ర చారి, బి బాలాషోరెడ్డి, కే రాములు, ఎం శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ ఏ కొప్పుల శంకర్, కె పార్వతి, ఎండి జుబేర్ అలీ, ఓడపల్లి రాము, జి నాగరాజు, ఏ లింగయ్య, ఎస్ సునీల్, ఎస్ రాధాదేవి మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి.. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ…

సావిత్రిబాయి పూలే జయంతి.. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శప్రాయమని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఝరాసంగం ఎంపీడీవో మంజుల, ఎంపీవో స్వాతి, జ్యోతిబా పూలే కళాశాల, ఆదర్శ కళాశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు ప్రిసిల్లా, తేనవతి, నిర్మల పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రి బాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

 

ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని PM SHRI MPPS చందుర్తి పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయినిలైన
వేముల సుజాత, జ్యోతి, స్వప్న, హేమలత ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేముల సుజాత మాట్లాడుతూ,

“సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆమె చేసిన పోరాటాలు, సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. బాలికల విద్యను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది”
అని పేర్కొన్నారు.

ఆమె మహిళా సాధికారత, సమానత్వం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతను వివరించారు. సావిత్రిబాయి పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రసాద్, గుఱ్ఱం బాలకిషన్, కొత్తూరి శ్రీధర్, రాకం రవి, మరియు కాపిల్ల నరేష్ లు పాల్గొని, సన్మానం పొందిన ఉపాధ్యాయినిలను అభినందించారు. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా ముగిసింది.

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు…

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
* మహిళ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 3 :

 

ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్యకు ఆద్యురాలైన మహనీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమీడి జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహా రెడ్డిలు ఉపాధ్యాయులతో కలసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అపూర్వమని, ఆమె స్థాపించిన మొదటి మహిళా పాఠశాల దేశంలో మహిళా విద్యకు బాటలు వేసిందని అన్నారు. సమాజాభివృద్ధికి మహిళా విద్య అత్యంత కీలకమని, ప్రతి బాలిక విద్య పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గత సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు యమ్ శశిరేఖ, బి హేమలత, ఎల్ మంజులత, పి నిర్మల, పివియస్ నాగలక్ష్మి, వి జ్యోతి, వైష్ణవి, లలిత, శివలక్ష్మి, రాఖీ, మమత గార్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ చంద్ర, ప్రశాంత్ నాయక్, రవీందర్ చారి గార్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version