వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.

టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version