శ్రావణ్ కుమార్ బౌతిక ఖాయాన్నీ సందర్శించిన…

శ్రావణ్ కుమార్ బౌతిక ఖాయాన్నీ సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి ఏరియా KK 5 గనిలో నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ లో సైడ్ ఫాల్ కూలీ మృతి చెందిన యాక్టింగ్ ఎస్డియల్ కార్మికుడు రాసపెల్లి శ్రావణ్ కుమార్ బౌతిక ఖాయాన్నీ రామక్రిష్ణపూర్ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి నివాళులర్పించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

వివేక్ సర్ కామెంట్స్

మృతి చెందిన కార్మికుని కుటుంబాన్నీ పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించిన మంత్రి..

కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా తో పాటుగా సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తామని హామీ

kk5 గని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును…గనిలోపల రక్షణ ఏర్పాట్ల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్న మంత్రి.

సింగరేణి జిఎం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

కార్మికుల రక్షణ తో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి అధికారులకు ఆదేశాలు
సింగరేణి సంస్థకు లాభాలే కాదు సింగరేణి కార్మికులు ప్రాణాలే ముఖ్యం.

గని పైన సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి అధికారులతో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం.

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన..

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామంలో పలు పంటలను వ్యవసాయ అధికారి వెంకటేశ్ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో నాణ్యమైన విత్తనాలు సంబంధించిన పెసర పంటను సందర్శించడం జరిగింది ప్రస్తుతం పెసర పంట 60 రోజుల దశ లో ఉంది దీనికి పోతదశలో ముఖ్యంగా పోషకాల లోపం లేకుండా 19:19:19 ఒక కిలో ఎకరానికి మరియు పత్తి. పంటను సందర్శించడం పంటల దిగుబడికి విడతల వారిగా కాంప్లెక్స్ ఎరువులు
మరియు ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించాలి నానో యూరియా స్ప్రే చేసుకోవాలి ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారి హరి కృష్ణ, రైతులు రమేష్, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మ‌రాంభ అమ్మ‌వారిని ఎన్నిసార్లు చూసినా త‌నివి తీర‌దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు శ్రీశైలం లో ఆల్ ఇండియా వెలమ సంక్షేమ భవన్ ను మంత్రితో కలిసి ప్రారంభించి, అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

మృతిరాలి కుటుంబమును పరామర్శించిన..

మృతిరాలి కుటుంబమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల మాజీ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సతీమణి కృష్ణవేణి తల్లి మంతెన వెంకట లక్ష్మీ ఇటీవల మరణించగా హుస్నాబాద్ లోని వారి నివాసంలో వెంకటలక్ష్మీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించినారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

హుజురాబాద్ ఏసిపి కుటుంబాన్ని పరామర్శ..

హుజురాబాద్ ఏసిపి కుటుంబాన్ని పరామర్శ

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

హుజరాబాద్ ఏసీబీ వాసంశెట్టి మాధవి భర్త జిదుల మహేష్ కుమార్ ఆకస్మికoగా గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం కరీంనగర్ వారి నివాసంలో మహేష్ కుమార్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవునూరి శ్రీనివాస్,దీటి సుధాకర్ రావు, దాసరపు చందు, కురుమిండ్ల సుకేష్ పాల్గొన్నారు.

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన.

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన నల్లబెల్లి దేవేందర్రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు తదితరున్నారు

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన..

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ,నేటి దాత్రి ;

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని మాజీ ఉపసర్పంచ్ కోడెల రాజయ్య కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నేడు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు,
వారి వెంట మండల అధ్యక్షులు అల్లం రవీందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల యూత్ అధ్యక్షుడు తవటంనవీన్ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ పెరుమాండ్ల రవీందర్ పసుపుల శీను కోడేలరాజమల్లు సదానందం రవి రాంబాబు నరేందర్ తాటిపల్లి శీను రజినికాంత్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు

రాయికల్: జూలై 19: నేటి ధాత్రి:

పట్టణం లోని విజ్డం హై స్కూల్ విద్యార్థులు మూడవ శనివారం నో బ్యాగ్ డే స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి వరి నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకొని, రైతులతో పాటు నాటు వేశారు, పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి పిల్లలతో పాటు పొలంలో దిగి నాటు వేసి, చిన్ననాటి జ్ఞాపకాలను, రైతుల యొక్క కష్టాన్ని, రైతు విలువను విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే, మనకు అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,వరి పంట చేతికి రావాలంటే 120 రోజుల శ్రమ, కష్టం ఉంటుందని, వాటిని గుర్తుంచుకుని ఆహారాన్ని వృధా చేయకుండా, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు తద్వారా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
(జమ్మికుంట: నేటిధాత్రి)
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి సందర్శించారు ఆస్పత్రులోని రికార్డ్స్ పరిశీలించారు అన్ని వార్డులను సందర్శించి రోగులతో సమస్యలపై మాట్లాడారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పనితీరును రోగులతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు భరోసా కల్పించే విధంగా వైద్యం అందించాలని జవాబుదారితనంగా పనిచేయాలని ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించే విధంగా వైద్యులు అలాగే సిబ్బంది మెదులుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ కు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాల మొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి.

గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి

అనంతరం మృతిచెందిన శ్రీవాణి కుటుంబ పరామర్శ

పరకాల నేటిధాత్రి

 

 

 

ఏకు శ్రీవాణి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

మండలంలోని మల్లక్కపేట గ్రామపరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం రోజున సందర్శించారు.

గత మూడు రోజుల క్రితం బాలికల వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి మృతి గల కారణాలను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకోని సంఘటన జరగడం బాధాకరమని,పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి లోపాలని గుర్తించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ,ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

MLA Revuuri

 

 

అనంతరం శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కన్నం.

నారాయణ,ఏసీపీ సతీష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

 

 

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాలమొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన.

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జే.జే.కన్స్ ట్రక్షన్స్ అధినేత జావిద్ గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన.

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు నియోజకవర్గంలోని చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలల్లో పర్యటించారు. ఆయా గ్రామాలల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, మండలంలో.
తిరుమలాపూర్ గ్రామంలో కంచర్ల పోషాలు, చిట్యాల మండల కేంద్రంలో చింతకింది రాజమణి, నవాబుపేట గ్రామంలో మహమ్మద్ హకీమ్, కైలాపూర్ గ్రామంలో సకినాల కుమారస్వామి ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మధు వంశీకృష్ణ మాజీ ఎంపీటీసీ దబ్బటఆనిలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._

రామ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన.

రామ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన
శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామాన్ని చెందిన ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఒద్దుల రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి.
ఈ కార్యక్రమంలో బీ. ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరాగాని కుమారస్వామి,రత్నం రవి,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి మల్లారెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి,కంచరకుంట్ల రవీందర్ రెడ్డి.ఎక్కటి శ్యామల దేవి,మొగిలి శ్రీనివాస్.

నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప.

నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప

మందమర్రి నేటి ధాత్రి:

మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని పరామర్శించిన మాజీ సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేడు మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని కలిసి ఆరోగ్య స్థితి ని తెలుసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యం తో ఇబ్బందిపడుతు ఇటీవలే కోలుకున్న నల్లాల ఓదెలు.

కురవి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకున్న.

కురవి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకున్న టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్

మరిపెడ/కూరవి నేటిదాత్రి

shine junior college

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని పవిత్ర పుణ్యక్షేత్రమైన కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,మాజీ పార్లమెంట్ సభ్యులు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మధుయాష్కి గౌడ్,ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్,కలసి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ వీరభద్ర స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు,రాష్ట్రంలోని ప్రజా పాలన అద్భుతంగా సాగుతుందని రేవంత్ రెడ్డిగారి పాలనలో రైతులు సబండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ముందు ముందు ఇంకా మంచి పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని వచ్చే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్రుని వేడుకోవడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, కోరవి మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రo గౌడ్, ఓబీసీ సెల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్,ప్రధాన కార్యదర్శి ఆవిరె మోహన్ రావు,మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగ్య నాయక్,శ్యామల శ్రీనివాస్,దైద భద్రయ్య,కురవి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయ్యాల శ్రీధర్,నల్లెల్ల గ్రామపార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గ్రామ పంచాయతీలను సందర్శించిన.

గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,

గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.

రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.

గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.

సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.

వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.

అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.

గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version