శిశువు మృతదేహం లభ్యం.
కేసు నమోదు చేసిన పోలీసులు.
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి భవాని మాత దేవాలయ సమీపంలోని మురికి కాలువలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. పెళ్లి కానీ యువతికి పుట్టిన శిశువు అయి ఉండొచ్చని, శిశువుకు అవయవాల లోపంతోనే చనిపోయి ఉండొచ్చని స్థానికులు అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు.
