వీధి కుక్కలకు వింత రోగం….. భయాందోళనలో స్థానికులు
పట్టించుకోని అధికారులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో మరియు పలు గ్రామాల్లో వీధి కుక్కలకు వింత రోగం సోకిం దని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ వీధికి వెళ్లిన కుక్కలకు చర్మము ఊడి నల్లటి మచ్చలతో దర్శనమి స్తున్నాయి దద్దుర్లు లేచి దుర దతో కుక్కలకు పుండ్లు నీరు కారడంతో ఈగలు దోమలు వాలి ఇండ్లలోకి వస్తున్నాయని కుక్కలకు సోకిన ఎలర్జీ చర్మ రోగం మనుషులకు సోకే ప్రమా దం ఉందని ప్రజలు భయభ్రాం తులకు గురవు తున్నారు.
గ్రామపంచాయతీ పరిధిలో అధిక శాతం వీధి కుక్కలకు చర్మవ్యాధి సోకింది, పలు గ్రామాల్లో గుంపులు గుంపులు గా స్వేరవిహారం చేస్తున్నాయి. తీవ్రమైన చర్మ వ్యాధికి సోకి కుక్కలు మృత్యువాత పడు తున్నాయి వ్యాధిన బారిన పడిన కుక్కలు, మరొక్క కుక్కలు కలిసి ఆహారాన్ని తిన్న, వేరొక ద్రవపదార్థాలను తీసుకుంటే వాటికి కూడా వ్యాధి సోకుతున్నట్లు స్థానికు లు చెబుతున్నారు. అవి సంచ రించే ప్రాంతాల్లో దమ్ము, ధూళి గాలి తాకిన జనాలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని కొందరు భయపడు తున్నారు.పరిస్థితి విష మిం చిన పశు వైద్యాధి కారులు, పంచాయతీ అధికా రులు ప్రజాప్రతినిధులు పట్టిం చుకున్న దాఖనాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ అధికారులు, పారిశుద్ధ్యం, శానిటైజర్ పై ప్రత్యేక చొరవ చూపాలని కుక్కలకు పశు వైద్య అధికారులు సూచనలు సలహాలతో నివారణ చర్యలు చేపట్టి, ప్రజల ఆరోగ్యం కాపా డాలని మండల ప్రజలు కోరు తున్నారు.
