కొత్తపేటలో భూభారతి సదస్సు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్..

నేటిధాత్రి, కొత్తపేట, వరంగల్

 

 

 

వరంగల్ మండలం పరిధిలో గత మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిన్న పైడిపల్లిలో దరఖాస్తులు స్వీకరించిన వరంగల్ మండల రెవెన్యూ అధికారులు. వాటిలో బాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో ఎన్నో ఏండ్లగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామ దరఖాస్తులను కూడా భూభారతిలో పరిశీలించి పట్టా చేయుటకు వరంగల్ తహసిల్దార్ కు దరఖాస్తు అందచేశారు కొత్తపేట రైతులు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రైతులు నేరెళ్ల రాజు, లంక రాజగోపాల్, బల్లని ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు.

ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ 6 వేల మంది సర్వేయర్లను నియమించి ప్రజల భూ సమస్యలను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎంపీఓ తిరుపతి బాపూరావు, ఎస్సై జాడి శ్రీధర్, పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇతర సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 3న పెద్దాయపల్లి మరియు కేతిరెడ్డిపల్లి, 4న బాలానగర్ మరియు బోడ జానంపేట, 5న చిన్న రేవల్లి మరియు పెద్ద రేవల్లి, 6న నేరళ్ల పల్లి మరియు మోతి ఘనపూర్, 9న గుండేడ్ మరియు ఉడిత్యాల, 10న హేమాజీ పూర్ మరియు తిరుమలగిరి, 11న మొదంపల్లి మరియు సూరారం, 12న నందారం, నామ్యతాండ, లింగారం, సేరిగూడ, 13న గౌతాపూర్ మరియు అప్పాజీపల్లి, 16న మాచారం గ్రామాలలో.. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version