ఆన్లైన్ ఆఫర్లు, ఏపీకే ఫైల్స్ లాంటి నకిలీ లింక్స్ ఓపెన్ చేయవద్దు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు,
◆:- సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధం
◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలైన ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్ పంపి ఖాతాలను ఖాళీ చేయడం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా నకిలీ APK ఫైల్స్ పంపించడం వంటి పద్ధతులు మోసగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తం
1. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్/డిస్కౌంట్ లింక్స్ ఎప్పటికీ ఓపెన్ చేయవద్దు.
2. ఇలాంటి లింక్స్ లేదా ఫైల్స్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
3. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే ఏవైనా APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి.
⚠️ మోసపూరిత APK ఫైల్స్ ఉదాహరణలు
Traffic challan.APK, Aadhar.APK, SBI.APK, SBI Rewards. APK, PM Kisan.APK, Union Bank.APK, CSE.APK, Statebank.APK, eKYC.APK లేదా ఏ ఇతర APK ఫైల్, ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ పూర్తిగా మోసగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. ఫోన్‌లో ఉన్న డేటా, ఫోటోలు, కాంటాక్ట్స్ దొంగిలించబడతాయి.
మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దోచుకుంటారు.
ఎవరైనా మోసపూరిత లింక్స్ లేదా APK ఫైల్స్ గమనించినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) కు కాల్ చేయండి,లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఇలాంటి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త.