సీఎం సహాయ నిధి: దేవి బాయ్కు రూ. 60,000 చెక్కు పంపిణీ…

సీఎం సహాయ నిధి: దేవి బాయ్కు రూ. 60,000 చెక్కు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం మోతిమాత మందిరం దగ్గర నివాసముంటున్న దేవి బాయ్ ధన్సింగ్ రాథోడ్ కు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.60,000 విలువైన చెక్కును AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ పవర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కాపాడటం, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి వరప్రసాదమని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version