ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని నడికూడ మండ‌లంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి అన్నారు. గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి అడ్మిషన్లు ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగిన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు,ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,యూనిఫాం ప్ర‌భుత్వం అందిస్తోందని, అంతేకాకుండా 2026-27 ఈ నూతన విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు,విద్యార్థులకు 21 రకాల చదువుకు కిట్టు అందిస్తంది అని అన్నారు,పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ప్రైవేట్ పాఠశాల మోజులో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు.
స్పోర్ట్స్ కోటాలో వచ్చిన నూతన బీరువను,అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు శశిరేఖ మరి కొన్ని రోజులలో రిటైర్మెంట్ అవుతుండగా పాఠశాలకు బీరువాను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రెండు బీరువాలను సర్పంచ్ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు ఆర్ ప్రణిత,ఏ.శ్రీనివాస్,బి. శంకర్,వి.శ్రీదేవి,షబానా అజూమ్,ఎన్.ఉదయ్ కుమార్,ఎస్.సురేఖ పిఈటి ప్రేమానందం పాల్గొన్నారు.

కాశీబుగ్గలో ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం ఏర్పాట్లు…

కాశీబుగ్గలో ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం ఏర్పాట్లు

కాశీబుగ్గ, నేటిధాత్రి:

కాశీబుగ్గలో హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ స్వామి ఆలయం ఎదుట “హిందూ ధర్మ సమ్మేళనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి అధ్యక్షులు కాంచనపల్లి కృష్ణాకర్ రాజు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మేళనానికి బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ (శ్రీ జగద్గురు గీతా ఆశ్రమం), తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది కశింశెట్టి కరుణా సాగర్, ఢిల్లీ మెహరౌలి ప్రాంతానికి చెందిన మాతృశక్తి సంయోజిక నీలం నిర్మల హాజరై జాతీయ సమైక్యత, ధార్మిక విలువలు, దేశభక్తి అంశాలపై ప్రసంగాలు చేయనున్నట్లు తెలిపారు.

సమితి గౌరవ అధ్యక్షులు గోనె జగదీశ్వర్ మాట్లాడుతూ, సనాతన ధర్మ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ, సామాజిక ఐక్యత పెంపొందించడం లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్రధాన కార్యదర్శి ములుకుంట్ల విష్ణు మాట్లాడుతూ, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, వేలాది భక్తులతో కలిసి భారతమాత హారతి నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సమితి గౌరవ సలహాదారు సముద్రాల పరమేశ్వర్ మాట్లాడుతూ, మహిళలకు జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి తీసుకువచ్చిన గాజులు, కుంకుమలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అలాగే, ఏప్రిల్ 17న శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు సమితి వెల్లడించింది.

ఈ ప్రెస్ మీట్‌లో కోశాధికారి మండల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాపెల్లి బాలరాజు, కార్యవర్గ సభ్యులు గోగికార్ శ్రావణ్, మార్త సందీప్, గోగికార్ క్రాంతి, మడిపల్లి నాగరాజు గౌడ్ తదితరులు, అలాగే మహిళా సభ్యులు పాల్గొన్నారు.

2ఏప్రిల్ న ఆంజనేయస్వామి కల్యాణమహోత్సవం..

2ఏప్రిల్ న ఆంజనేయస్వామి కల్యాణమహోత్సవం

భక్తులు పాల్గొని దైవాశిస్సులు పొందండి

పరకాల,నేటిధాత్రి

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఉన్న శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 2న ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు,కల్యాణోత్సవ కార్యక్రమాలు బండ్లు తిరుగుట భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఉదయం నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని,అనంతరం ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని భక్తులకు పిలుపునిచ్చారు.భక్తుల కోసం తాగునీరు,ప్రసాదం,అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.

లైలతుల్ ఖాదర్ రాత్రిను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు….

లైలతుల్ ఖాదర్ రాత్రిను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలోని అలంగిరి జామియా మసీదులో రంజాన్ మాసం 27వ తేదీని లైలతుల్ ఖద్ర్ అంటారు. అదే రోజు, వారు ఖురాన్ పారాయణం పూర్తి చేసిన రోజున మసీదు నాయకులను పూలమాలలు మరియు శాలువాలతో సత్కరించి ఘనంగా జరుపుకున్నారు.వారు రాత్రంతా మేల్కొని దేవుడిని ప్రార్థిస్తూ, దేశంలో మరియు గ్రామంలోని ప్రజలందరి ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పవిత్ర రంజాన్ మాసంలో ఒక నెల పాటు కఠినమైన ఉపవాసాలు పాటించిన తర్వాత, గ్రామ పెద్దలు ఈ రోజు పండుగ జరుపుకునే ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు గ్రామస్తులు మరియు మసీదు పెద్దలు పేర్కొన్నారు. ముస్లింలు తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఈద్-ఉల్-ఫితర్‌ను సంతోషంగా జరుపుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

శక్తిగల సువార్త స్వస్థత పండుగలు: భక్తితో ఆధ్యాత్మిక ఉత్సాహం…

శక్తిగల సువార్త స్వస్థత పండుగలు: భక్తితో ఆధ్యాత్మిక ఉత్సాహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఎంయుఎం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎం. అనిల్ కుమార్ నిర్వహించిన ‘శక్తిగల సువార్త స్వస్థత పండుగలు’ రెండు రోజుల పాటు భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ ప్రత్యేక సభలకు గ్రామంతో పాటు సమీప ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రవచకుడు రెవ. గెరాల్డ్ జెర్రీ రౌస్, యేసు క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సేవా తత్వాన్ని వివరించి విశ్వాసులను ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం కీర్తనలు, ఆరాధన గీతాలు, ప్రత్యేక ప్రార్థనలతో భక్తులను ఆకట్టుకుంది. ఫాస్టర్లు ప్రసాద్, వినయ్, సామిల్, కోర్నేల్ తదితరులు ప్రార్థనలు

బోడగమ్మలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు…

బోడగమ్మలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలం బోడగమ్మ (బోరేగావ్) గ్రామంలో ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోరేగావ్ క్రైస్తవ సహోదరుల ఆధ్వర్యంలో జరిగే ఈ 11వ వార్షిక మహాసభలు 40 రోజుల సంపూర్ణ ఉపవాస ప్రార్థనల ముగింపు సందర్భంగా ఆత్మల రక్షణార్థం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి దైవ సందేశాలు ఉంటాయి. ఏలూరు జిల్లా పెదలంక హోలీ చర్చి దైవజనులు కె. జాన్ మంగాచార్యులు, హైదరాబాద్ రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రాజా హేబెల్, హైదరాబాద్ బ్రిమ్-ట్రూ వర్డ్ సెంటర్ దైవజనులు కె.ఆర్. జాన్ ముఖ్య వక్తలుగా పాల్గొంటారు. బ్రదర్ కె. ప్రశాంత్, సిస్టర్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు గ్రామ విశ్వాసులు, పెద్దలు, యువజన సంఘం సభ్యులను ఆహ్వానించారు. భక్తుల కోసం ప్రేమవిందు భోజన సదుపాయం కల్పించనున్నారు

వినోద్ స్వామి పడి పూజ: భక్తిశ్రద్ధలతో వేడుకలు…

వినోద్ స్వామి పడి పూజ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ గ్రామంలోని వెంకటరమణ కాలనీలో వినోద్ స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు, శివ స్వాములు భజనలతో, ఉత్సాహంగా పాల్గొని, సంతోషంగా పూజ నిర్వహించారు. గురు స్వాములు జి. నగేష్, బి. ప్రశాంత్, బి. సాయి కుమార్, ఎం. గణేష్ (పంతులు), శరత్, బంగారప్ప, మరియు శానిదానం అందరికీ వినోదం కుమార్ తన నమస్కారాలు తెలియజేశారు. ఈ వేడుకలో అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మార్కండేయ జయంతి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ టెంపుల్ లో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగ భక్త మార్కండేయ జయంతి వేడుకల్లో సందర్భంగా గ్రామంలో పలువురు తంగళ్ళపల్లి మానేరు వాగునుండి మానేరు జే ల్లాలతో మార్కండేయ అభిషేకానికి. భక్తులు ప్రజలు వారి ఆధ్వర్యంలో మార్కండేయునికి అభిషేకం చేయడానికి మానేరు వాగు నుండి మానేరు జిల్లాలు తీసుకువచ్చి మార్కండేయనికి అభిషేకం చేయించారు.పలువురు భక్తులు. మార్కండేయ జయంతి సందర్భంగా పలువురుయాగం సందర్భంగా గ్రామంలోని భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారు యాగంలో పాల్గొని స్వామివారికి ముక్కులు చెల్లించుకుని. తీర్థప్రసాదాలు స్వీకరించి ఘనంగా దర్శనాలు చేసుకున్నారు. ఇట్టి సందర్భంగా దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి పూజలు నిర్వహించి తదనంతరం. మార్కండేయ జయంతికి వచ్చిన భక్తులందరికీ గ్రామ ప్రజలకి టెంపుల్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టించారు. ఇట్టి కార్యక్రమానికి తంగళ్ళపల్లి గ్రామ ప్రజలు నాయకులు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామంలోని ఏకతాటిపై అందరిని కలుపుకుంటూ పోయి గ్రామంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డును ప్రదానం చేశారు.

2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డును ప్రదానం చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ 437వ ఉర్స్ షరీఫ్ సందర్భంగా, 2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డు వేడుక జనవరి 3న జహీరాబాద్‌లో ఇషా ప్రార్థనల తర్వాత దర్గా షరీఫ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా, తెలంగాణ మరియు దర్గా అసోసియేషన్ చీఫ్ ట్రస్టీ మౌలానా హఫీజ్ సయ్యద్ షాద్ కలీముల్లా హుస్సేని అలియాస్ కాషిఫ్ పాషా, ఆయన ఆదర్శప్రాయమైన సామాజిక, విద్యా, మేధో, మత మరియు సన్యాసుల సేవలకు గుర్తింపుగా మొదటి వార్షిక అవార్డు తిరా బండా నవాజ్ గేసో దార్‌ను ప్రదానం చేశారు. ఈ అవార్డును సజ్జాద్ మరియు నాషిన్ హజ్రత్ సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ సాహిబ్ ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవానికి ముందు, గొప్ప సాధువుల సమావేశం జరిగింది, దీనిలో మౌలానా సయ్యద్ షా కాషిఫ్ పాషా బండా నవాజ్ మరియు స్థానిక పండితులు ప్రసంగించారు.
సభకు సజ్జాదా నాషిన్ మామ హఫీజ్ అల్-హజ్ సయ్యద్ షా అఫ్సీర్ పాషా ఖాద్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మౌలానా సయ్యద్ మొహిబుద్దీన్ ఖాద్రీ సోదరుడు సజ్జాదే నేషిన్, సయ్యద్ షా ఫర్హాన్ ఖాదేరీ బాగ్దాదీ, సయ్యద్ బ్రదర్ సజ్జాదే నేషిన్, సయ్యద్ బద్రుద్దీన్ ఖాదేరీ, సయ్యద్ ఫరాజ్ ఖాదేరీ, మౌలానా ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఖతీబ్ ఈద్గా జహీరాబాద్, మౌలానా యూసుఫ్ సూఫీ ఖాద్రీ, గోర్ మియాన్ సికందర్ మరియు ఖాద్రీ కుటుంబం శిష్యులు, విశ్వాసులు మరియు ప్రజలతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మహా లక్ష్మి అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్..

మహా లక్ష్మి అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల జె.కె కన్స్ట్రక్షన్ లో శ్రీ లక్ష్మీ అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న శాసనసభ్యులు సభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి ఆత్మ చైర్మన్ విజయకుమార్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ లు వెంకటేశం నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్ తదితరులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version