మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు…

మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ నుండి చించోలి వయా మొగుడంపల్లి మండల మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అంతర్ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు గత రెండు నెలల క్రితం హోతి బి గ్రామం గోవింద్ పూర్ గ్రామం మద్యన కల్వర్టు పూర్తిగా ద్వంసం అయిపోయింది, దింతో వాహనదారులకు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీళ్లు ఎక్కడిక్కడనే ఆగిపోవడం జరిగింది కల్వర్టు పాడైపోయినందున నీరంత రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఆర్.అండ్.బి డీఈఈ కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి.అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.

దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మిస్తే బాగుటుంది,

ఆర్.అండ్.బి అధికారుల నిర్లక్ష్యం…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

ఆర్.అండ్.బి డీఈఈ కి అక్కడి నుండే సమస్యను వివరించగా కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు అని నరోత్తం అన్నారు.పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి

వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మించాలని డిమాండ్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం అన్నారు.,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version