ఝరాసంగంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్….!
◆:- నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
◆:- జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, గ్రామాలలో చికిత్స అంది స్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటా మని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల హెచ్చరిం చారు. ఝరాసంగం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ల్యాబ్, దస్త్రాలు, పరిసరాలను పరిశీలించారు. సమయపాలన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఝరాసంగం లోని ఓ ప్రైవేట్ క్లినిక్ ను ఆక స్మికంగా తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా రోగు
లకు చికిత్సలు అందించడం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసి క్లినిక్ ను సీజ్ చేశారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలు, నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.