బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం.
చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్
గుర్రం తిరుపతి.
చిట్యాల, నేటిదాత్రి :
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూచన మేరకు
చిట్యాల మండలంలోని చల్లగరిగా ప్రభుత్వ పాఠశాలలో డీసీపీయూ,చైల్డ్ హెల్ప్ లైన్, డి హెచ్ ఈ డబ్ల్యూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగాల సమన్వయంతో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగిందని తిరుపతి తెలిపారు.అలాగే బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 గూర్చి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, బాల్యవివాహాలు ఎవరైనా జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలుపుతూ ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,181,1930 పైన అవగాహన కల్పించడం జరిగింది.నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని బాల్యంలో చదువుకోవాల్సిన విద్యార్థులు పనులకు గాని పెళ్లిళ్లకు గాని ఆసక్తి చూపకూడదని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డి సి పి యు సోషల్ కుమార్, డి హెచ్ ఈ డబ్ల్యూ మమత,తెలంగాణ సాంస్కృతిక సారథి ఎర్రన్న బృందం మరియు సహాయఎన్జీవో,ప్రభులత, కోమల,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఝాన్సీ, శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.
