కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121958.700-1.wav?_=1

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.

సిరిసిల్లలో గణేష్ నిమజ్జనకు జిల్లా ఎస్పీ సూచనలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T144040.353.wav?_=2

 

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని

శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపిఎస్

 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి నిబంధనలు పాటించాలని,నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈరోజు పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

SP Mahesh B.Gite.IPS

జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని.జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు.వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవలన్నారు.నిమజ్జనం రోజున.ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు ఏర్పాటు చేసిన డి.జే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వహకులు నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలని, పోలీస్ వారి సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఏలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తిన, అవాంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందింవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో,డి.ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

 

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T140105.821.wav?_=3

 

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం.

కల్వకుర్తి / నేటి దాత్రి:

కల్వకుర్తి నియోజకవర్గం లోని గుండూర్ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయము భక్తి శ్రద్ధలతో గణపతి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నము అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రము గణేష్ నిమజ్జనంలో మొదటి లడ్డు వేలంలో రూ 2,50,116 ఆజాద్ యువజన సంఘం తీసుకోవడం జరిగింది. రెండవ లడ్డు రూ 30,000 భుజాల పర్వత్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పర్వత్ రెడ్డి, నర్మదా, గ్రామ పెద్దలు, హనుమాన్ గణేష భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.

ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ము .వినాయక చవితి సందర్భంగా భక్తులు వినాయక విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు కొలిచి చెరువులలో నిమజ్జనం చేసే విషయం మనందరికి తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామల్లో, పట్టణాలలో దాదాపుగా ప్రతి విధులలో వినాయక మండపాలను భక్తులు ఏర్పరిచారు, కానీ ఎత్తైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాణించడం వల్ల విద్యుత్ తీగలు సాగి ,తక్కువ ఎత్తులో ఉండటం వల్ల మరియు ఇంటర్నెట్ మరియు ఇతర కేబుల్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల విగ్రహాలు తీయగాలకు తగిలి కరెంట్ షాక్ తో భక్తులు మరణించే సంఘటనలు చాలా జరుగుతున్నాయి, గత వారం కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ ఘాతం వల్ల సికింద్రాబాద్లో ఐదుగురు చనిపోగా, నిన్న కరీంనగర్లో వినాయక విగ్రహానికి విద్యుత్ వైర్లు తగడం వల్ల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కావున జిల్లా వ్యాప్తంగా వివిధ రోజు లలో జరిగే వినాయక నిమజ్జనము సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది మరియు వినాయక మండప నిర్వహకులకు సమన్వయం పరుచుకొని విద్యుత్ వైర్లు సరైన ఎత్తులో ఉండేటట్లు పాత తీగలను సరి చేసేటట్టు కేబుల్ వైర్లను తొలగించేట్లు నిమజ్జన యాత్ర వెళ్లే దారుల ముందుగానే పరిశీలించి పోలీసు అధికారులు నిమజ్జనం సందర్భంగా ఇలాంటి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి పునుకోవలని జహీరాబాద్ డి యస్ పి కి శివశంకర్ పాటిల్ వినతిపత్రం న్నీ అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాస్,మణిదర్ పాల్గొన్నారు.

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T123222.024-1.wav?_=4

 

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ శాసన పరిధిలోని ఝరాసంగం మండలం జీర్ణపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బీసీ కాలనీలోని చిన్నారులు ఘనంగా చోట గణేష్ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసాదాలు పంచుతూ,నిమజ్జనం చేసి, చూపరులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రజలందరినీ ఆనందపరిచింది అందరూ చూసి ఆనందించారు.

వినాయక చవితి నీ అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి…

వినాయక చవితి నీ అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటిధాత్రి 23:

 

 

కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ జగన్ అధ్యక్షతన గణేష్ నిమర్జనోత్సవ కార్యక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తలెత్తబోయే సమస్యలు మరియూ చేయవలసిన ఏర్పాట్ల విషయమై జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్లో జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్,అండ్, బి, ఆరోగ్య శాఖ మరియు టి జి ఎస్ పి డి సి ఎల్ సభ్యులతో మరియుగణేష్ ఉత్సవ కమిటీ మరియు వివిధ కాలనీల అసోసియేషన్ వారిచే సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సలహాలు సూచనలు స్వీకరించి సమస్యలకు పరిష్కరించవలసిన వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు, సమావేశంలో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ఇతర సభ్యులు, 14 రోజులు జరిగే గణేష్ నిమర్జన కార్యక్రమం కాప్రా చెరువు చర్లపల్లి చెరువు ప్రాంతాల్లో నిమర్జనం ఏర్పాట్లు ,

 

 

హైటెన్షన్ రోడ్లలో గుంతలు లేకుండా పూడ్చడం, పనులు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు, ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ ప్రభుదాస్,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి ,వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version