గణనాథునికి వీడ్కోలు: భక్తులకు అశ్విన్ పటేల్ శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అశ్విన్ పటేల్ , వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదకొండవ రోజుల పాటు ఆనందం, ఉత్సాహం, ఐక్యతను నింపిన గణనాథుడికి నిమజ్జనోత్సవం ద్వారా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నామని, ఆయన జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఝరాసంగం మండల ఆయా గ్రామ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరిగాయి.
