గణేషునికి ఘన వీడ్కోలు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణంలోని అన్ని గణపతులకు ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలు .శుక్రవారం మధ్యాహ్నం నిమజ్జన వేడుకలను ప్రారంభించి స్థానిక బెల్లంపల్లి బస్తి చెరువులో నిమజ్జనం చేశారు. గత 9 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
అనంతరం. బెల్లంపల్లి లో గల బాబు క్యాంపు బస్తీకి చెందిన సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో
విగ్రహ దాతలు.దేవ సత్యనారాయణ రజితలను సన్మానించారు.అనంతరం నిమజ్జన శోభయాత్రలో చిన్నా పెద్ద బేధాలు లేకుండా నృత్యాలు చేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ అంగరంగ వైభవంగా గణపతికి వీడ్కోలు పలికారు.నవరాత్రి వేడుకలు విజయవంతం చేశారు. పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్స్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.