ఘనంగా గణపతి నిమజ్జనం
మరిపెడ నేటిధాత్రి
భక్తులతో నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం తోపాటు ఊరూరా గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ ప్లాజా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.మహిళల కోలాటాలు,డప్పు చప్పుల్లతో భక్తులు బారీగా హాజరై పట్టణ వీధుల్లో ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ గణపతి నీ భక్తి శ్రద్దలతో పూజించి కోరిన కోర్కెలు తీర్చాలని, అందరూ ఆరోగ్యంగా, సుభిక్షముగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామనన్నరు,మాకుల చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు,అంతకుముందు గణేషుడి లడ్డు వేలంపాట నిర్వహించగా 61 వేల రూపాయలకు కరుణాకర్ రెడ్డి ఝాన్సీ దంపతులు,51 వేల రూపాయలకు రావుల సుమంత్ రెడ్డి లావణ్య దంపతులు, దక్కించుకున్నారు. లక్కీ డ్రా ద్వారా గందసిరి సునీత రమేష్ గౌడ్ దంపతులు దక్కించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్లాజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్ సత్తి రెడ్డి, నీరంజన్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,దోమల సత్య శ్రీనివాస్, ఉడుగుల శ్రీను,కృష్ణ,భద్రీ,సాగర్,కార్తీక్,ఉపేందర్,సురేష్,సోమిరెడ్డి, రామ చంద్రయ్య,రేపల యాదయ్య, ఉపేందర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.