ఘనంగా నాగుల చవితి….

ఘనంగా నాగుల చవితి.

#ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితుడు శ్రీనివాస్ శర్మ.

#భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి చేరుకొని పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామికి పూజలు గ్రామ ప్రజలతోపాటు మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లుతూ. ఇలాంటి దోషాలు లేకుండా కాపాడాలని పలువురు మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ గుప్తా , కోటగిరి నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు…

హన్మకొండ జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు:-
ముఖ్య అతిథిలు గా హాజరైన ఇరు జిల్లా ప్రధాన న్యాయమూర్తులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి, (న్యాయ విభాగం):-

 

హన్మకొండ జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలు గురువారం నాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మహిళా  న్యాయవాద జాయింట్ సెక్రెటరీ ఆర్.నాగేంద్ర, ఈసి మెంబెర్స్ ఎస్.ఇందిరా వేద కుమారి, కె.స్వాతి  ఆధ్వర్యంలో బతుకమ్మను మహిళా న్యాయవాద హాల్లో పేర్చి, బతుకమ్మను టెన్ కోర్టు భవనం ఆవరణలో పెట్టీ పూజలు చేసి  అనంతరం న్యాయవాదులు తమ ఆటా, పాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి  హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా .కె.పట్టాభి రామరావు మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి. బి నిర్మలా గీతాంబ  బతుకమ్మ సంబరాలను ప్రారంబించారు. వరంగల్ జిల్లా జడ్జి మహిళా న్యాయవాదులతో కలిసి బతుకమ్మను ఆడారు. ఇట్టి కార్యక్రమానికి హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ కె.రవి, ఇతర కమిటీ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు, అనంతరం హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం…

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి,రేణుల ఏళ్ళమ్మతల్లి బోనాల ఉత్సవాలు వచ్చే అక్టోబర్ 4 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నామని దీనికి ప్రతి ఒక్క గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలిరావాలని పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ నేపథ్యంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.అలాగే బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ దాత సోల్తి సారయ్య గౌడ్ కు, నర్సంపేట డివిజన్ గౌడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ కు ఆహ్వాన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇదేండ్లకోసారి కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు నర్సంపేట పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనిలో భాగంగా పట్టణంలోని ప్రతి గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలి రావాలని కోరారు. దీనికోసం ప్రజలందరినీ సమాయత్తం కోసం సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కమిషనర్ భాస్కర్ ను కోరారు. అనంతరం కమిషనర్ భాస్కర్ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి సౌకర్యాల ఏర్పాటుపై పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, నాతి సదానందం గౌడ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్ సురేష్ గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్, మండ వీరన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version