వైభవంగా చండీయాగం
రాయికల్ అక్టోబర్ 1: నేటి ధాత్రి:
రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.