లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించవద్దు
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
టపాసులు విక్రయించాలనుకునేవారు తెలంగాణ ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ 1884, రూల్స్ 2008 ప్రకారం సరైన లైసెన్స్ పొందడం తప్పనిసరని, లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శనివారం జిల్లా కేంద్రంలోని టపాసుల విక్రయదారుల షాపులను పర్యవేక్షించి ప్రజలకు, విక్రయదారులకు ముఖ్య సూచనలు చేశారు
సందర్భంగా వారు మాట్లాడుతూ టపాసుల షాపులు జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ బిజీ ఏరియా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పక్కలో, పెట్రోల్ బంకుల సమీపంలో ఏర్పాటుచేయకూడదన్నారు. సురక్షిత, అనుమతించబడిన ప్రాంతాల్లోనే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసిల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరని, భద్రతా నియమాలు పాటించి, ఈ దీపావళిని ఆనందంగా, ప్రమాద రహితంగా జరుపుకుందామన్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
