అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ…

అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని డబ్బా గ్రామంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ పుప్పల లక్ష్మి మహేష్, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్ కు అంగన్వాడి టీచర్లు ఘనంగా స్వాగతం పలుకుతూ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరం లోపు పిల్లలకు బాలమృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రా పెళ్లి రవళి ప్రధానోపాధ్యాయులు తగుకుల రమేష్,, యువ నాయకుడు కోటి అరుణ్, అంగన్వాడీ టీచర్లు సుందరగిరి గంగామణి, వై సంజీవరాణి ,ఆశ కార్యకర్తలు రజిత, జ్యోతి అంగన్వాడి ఆయా గుండు శ్యామల, విమల, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు,

ఘనంగా పోషణ మాస కార్యక్రమం…

ఘనంగా పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ దేవిక కల్పన విజయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు ఆకుకూరలు పప్పు కూరలు తినిపించాలి అంగన్వాడి నుండి వచ్చే కోడిగుడ్లు బాలమృతం వాటిని పిల్లలకు తరచుగా తినిపియ్యాలి అని సూచించారు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పిల్లలకు గంట తర్వాత తల్లిపాలు పట్టించాలి దాని ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వారు అన్నారు

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం….

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు కమిటీ

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో ఏడాదిపాటు కోడి గుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.కోడిగుడ్ల సరఫరా టెండర్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ లో ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ వసతి గృహాల నుండి కోడిగుడ్డుల ఇండెంట్ వివరాలు జిల్లా కలెక్టరేట్ కు సమర్పించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి నేరుగా సప్లయర్ కు అవసరమైన కోడిగుడ్ల ఇండెంట్ ను సమర్పించడం జరుగుతుందని, గత సంవత్సరం అడ్మిషన్లకు అదనముగా 10% విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోడిగుడ్డు బరువు 45 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉండాలని, ప్రతి మాసము రెండుసార్లు సప్లై చేయాలని, అర్హత, అనుభవం వారికి నిబంధనల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులు అందజేస్తామని, కోడిగుడ్ల సరఫరాలో ఆలస్యం చేస్తే పెనాల్టీలు విధిస్తామని కలెక్టర్ తెలిపారు. టెండర్ల విధానం, టెండర్లు ఆహ్వానం, తెరవడం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఆయా విద్యాలయాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version