పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి
అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీలో పోసిన మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ స్వప్న సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్ల తల్లులు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివ్వాలి ఆకుకూరలు పప్పు అంగన్వాడి నుండి వచ్చే ఫుడ్డును పిల్లలకు అందివ్వాలి భోజనానికి ముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఈగలు రాకుండా ఇంటి ఆవరణ చుట్టుపక్కల శుభ్రంగా చేసుకోవాలి లా చేయడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు