అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం సనుగుల గ్రామస్తురాలైన గొట్టే పరిమళ వయసు 36 సంవత్సరాలు, ప్రస్తుతం దేవుని తండా గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు మరియు భర్త ఆర్టీసీ హయర్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పరిమళ గత 8 నెలల నుండి గర్భసంచిలో గడ్డలు అయినవని పలు హాస్పిటల్లో తిరిగి ఎన్ని మందులు వాడినా కూడా కడుపునొప్పి తగ్గడం లేదని బాధపడుతుండేది. ఇట్టి విషయంలో మనస్థాపానికి గురై ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.

అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్య….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T123410.071.wav?_=1

 

అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్య

◆:- మహిళ ప్రాణం తీసిన అప్పు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్, అప్పుగా తీసుకున్న వ్యక్తి డబ్బులను తిరిగి ఇవ్వననడంతో అప్పు ఇచ్చిన మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని అల్లిపూర్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్ పట్టణ ఎస్త్ర వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షేరి నగర్ అల్లీపూర్ లో నివాసం ఉంటున్న కొత్త గొల్ల స్వప్న(34) గుర్జువా డకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత స్వప్న శంకర్ ను డబ్బులు అడగగా ఇవ్వనని ఖరాకండిగా చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్లు తెలిపారు. స్వప్న భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ వినయ్కుమార్ తెలిపారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T132740.736.wav?_=2

 

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రానికి చెందిన విభూతి జ్యోతి (40) గత రెండు రోజుల క్రితం మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబమైన వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆయన సన్నిహితుల ద్వారా మృతు రాలి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్,సామల మహేష్, పెద్ద పైడి రాజిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్..

జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు
ప్రెస్ క్లబ్ లోని మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (గవాయ్) దళితడి ఫై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ నేత లాయర్ రాకేష్ కిషోర్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అని అంతేకాకుండా మన తెలుగువాడైన దళిత బిడ్డ ఏ.డి.జీ.పి పురణ్ కుమార్ అధికారల ఒత్తిడితో తాను ఎనిమిది పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక దళిత అధికారిని హింసించి పైన ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలు అనగదొక్కడానికి చూస్తున్నాయని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక ఐపీఎస్ అధికారిని అగ్రకుల వర్ణ అధికారులు హింసించడం ద్వారా ఒక దళిత తెలుగు బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం వీరిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుడే బాబు, సిరిసిల్ల జిల్లా దళితనియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ కుమార్, దళిత నాయకులు రామచందర్, పండుగ శేఖర్, బాలరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్…

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్దింటి ప్రభాకర్(64)అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వారు సేకరించిన వివరణ ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని మందలించారని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి భార్య రాజేశ్వర్ తో పాటు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా…

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా?

◆:- అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్ల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్న తల్లిదండ్రులు – ఫోన్లలో వచ్చే ఆటలు, రీల కు ఆకర్షితులౌతున్న చిన్నారులు – పజ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆటలతో లోకాన్నే మరచిపోతున్న చిన్నారులు

కొన్నేళ్లుగా యువత, చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్నారు. వాటిలో వచ్చే చిత్రాలు, వీడియోలు అవి ఇచ్చే సందేశాలకు పసితనంలోనే వాటికి ఆకర్షితులై మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కొందరు బడి ఈడు పిల్లలను గతంలో కరోనా సమయంలో వచ్చిన ఆన్​లైన్ తరగతులు ఫోన్లకు కట్టిపడేశాయి. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ పేరిట వివిధ అంశాల పరిశోధనకు ఫోన్లనే వాడుతున్నారు. కాగా తమ పిల్లలు ఫోన్​తో ఏం చేస్తున్నారని గమనించకపోవడంతో చిన్నారులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటిలో పబ్జీ, ఫ్రీఫైర్ ఆటలు ఎదుటి వారిని ఓడించడంలో వచ్చే పాయింట్ల వేటలో పొందే ఆనందంలో వారు లోకాన్నే మరిచిపోతున్నారు.

కొన్ని సంఘటనలు : 

 

 

 

 

తాజాగా భైంసా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న హైదరాబాద్​కు చెందిన సంతోశ్, సాయిసుప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర (13) పబ్జీ ఆటకు బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఆకలి, నిద్ర మరిచి గంటలు తరబడి ఆటలో నిమగ్నమవ్వడంతో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. తల్లిదండ్రులు వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లోకుండా పోయింది. మూడ్రోజుల నుంచి కుటుంబీకులు వారించిగా జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

 

 

గతంలో కుభీరు మండల పార్టీ గ్రామానికి చెందిన ఒకరు ఆన్​లైన్​లో వచ్చే ఆటలు ఆడుతూ పెట్టుబడులు పెట్టాడు. రూ.లక్షల్లో సొమ్ము కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు గమనించాలి :

చిన్నారులు, యువత ఫోన్లను వినియోగిస్తున్నప్పుడు పెద్దలు గమనిస్తుండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

◆:- పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టు వర్కుల సాకుతో వాడుతున్న ఫోన్​లను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారో గమనిస్తూ ఉండాలి.

◆:-ఫోన్​ల వినియోగంతో ఎదురయ్యే దుష్ప్రభావాలను వారికి తెలియజేయాలి.

◆:- స్మార్ట్ ఫోన్​ వినియోగిస్తున్న పిల్లలు సరిగ్గా తినరు, నద్రపోరు. చిన్న చిన్న మాటలకు కుంగిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటే ఓ కంట కనిపెట్టాలి. అలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలి.

సముదాయించి నచ్చజెప్పండి : 

 

 

 

 

ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు డా.సురేశ్‌ అల్లాడి తెలిపారు. ఆ ఆనందంలో లోకాన్ని మర్చిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

“ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆనందంలో లోకాన్ని మరచిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలి.

ఉరివేసుకొని వ్యక్తి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T154900.138-1.wav?_=3

 

ఉరివేసుకొని వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ టౌన్ / ఝారసంగం మండలం
గుర్తు తెలియని మగ వ్యక్తి సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు అందాజు 30 నుండి 35 సంవత్సరాలు, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కుప్పానగర్ గ్రామ శివారులో ఒక పురాతన పాడుబడిన డాబా యందు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు ఇతని యొక్క వివరాలు తెలిసినచో క్రింది నంబరుకు ఎస్ ఐ
8712656771జహీరాబాద్ రూరల్ సిఐ 8712656732. సంప్రదించగలరని తెలిపారు,

సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య.

సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య

మంచిర్యాల, నేటి ధాత్రి:

మంచిర్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న అక్షయ్ (20) హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటఫణి శనివారం తెలిపారు.అక్షయ్ రెండు నెలల కిందట పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.ఇటీవల పరీక్షల ఫలితాలు విడుదల కాగా అందులో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు.కొద్ది రోజుల నుంచి మానసిక ఆందోళనకు గురైన అక్షయ్ ఓ గదిలో ఫ్యానుకు ఉరేవేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్.

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్…

 

ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు.

Anchor Swetcha Votarkar Case: ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు.
పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్‌ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్‌ నిర్దోషి, అమాయకుడని స్వప్న సంచలన చేశారు.

కాగా, స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే నిందితుడు పూర్ణచందర్‌ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేచ్ఛ, నేను స్నేహితులుగా ఉండేవాళ్లం. ఐదేళ్లుగా ఆమె మానసికంగా ఆందోళన చెందుతూ చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యతో నాకు ఏలాంటి సంబంధం లేదని లేఖలో పూర్ణచందర్‌ పేర్కొన్నారు.

అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు ఆత్మ హత్య.

అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు ఆత్మ హత్య

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ కు చెందిన వలస రమేష్(48) అనే నేతకార్మికుడు అప్పుల బాధలు తట్టుకోలేక కార్గిల్ లేక్ చెరువులో దూకి ఆత్మ హత్య చేసుకోని మృతి చెందాడని జరిగినది. నేత కార్మికుడైన రమేష్ పవర్ లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.గత ఏడాది నుండి సరైన ఉపాధి లేక చేసిన అప్పులు 5 లక్షలు ఇక ఎలా తీర్చాలో తెలియక కార్గిల్ లేక్ చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నాడని మృతుని బంధువులు తెలిపారు.మృతుని భార్య లావణ్య, సాయి చరణ్, సచిన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగినది.

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం.

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య ప్రయత్నం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

shine junior college

అంకుసాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కుంటయ్య ఈరోజు ఆత్మ హత్యాయత్నంచేసుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి కుంటయ్యనుసిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తద్వారా మెరుగైనవైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు దీనిపై తెలిసిన సమాచారం ప్రకారం. తనకు సంబంధించినపది లక్షల భూమిని సదరు కృష్ణారెడ్డి
నా ప్లాట్ ని కబ్జా చేశారని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తిరిగి తనపై కేసులు నమోదు చేశారని బాధితుడూ ఆరోపించాడు దీంతో నా చావుకి కారణం గంగా కృష్ణారెడ్డి అని 10 లక్షల విలువైన భూమిని కబ్జ చేశాడు అంటూ కుంటయ్య స్టేటస్ పెట్టాడు స్టేటస్ చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన.పోలీసులకు సమాచారం అందించడంతో దీంతో సంబంధిత పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఘటన స్థలానికి చేరుకొని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న కుంటయ్యను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థలంకి సంబంధించి పైసలు అడగడానికి వెళితే ఇవ్వడానికి నిరాకరించడంతో. కొన్ని రోజులుగా డబ్బుల పంచాయతీ నడుస్తుందని దీనిపై గతంలో కూడా పోలీస్ స్టేషన్లో పలు సందర్భాల్లో పలువురు మధ్యలో ఫిర్యాదు చేయడం జరిగిందని దీనికి సంబంధించి పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో. మనస్థాపం చెంది. ఈరోజు ఉదయం ఆత్మహత్యానికి పాల్పడినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకి. తరలించారు అని సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. గత సంబంధిత పోలీసు అధికారులు దీనిపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా నిజా నిజాలు తెలియాల్సి ఉన్నది. ఆత్మహత్య చేసుకునేదాకా. అవసరం ఏమొచ్చింది అని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. మిగతా సమాచారం కోసం ఏమి జరిగింది అనే కోణాలపై ఆలోచించిన విషయం ఆసన్నమైనది. ముందుగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుంటయ్య ఆరోగ్యం బాగుపడి బయటకు వస్తేనే పలు విషయాలపై నిజా నిజాలు బయటకు వస్తాయని ఆలోచన దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉండే వెంకటరమణ (19) అనే ఆర్ ఎల్ ఆర్ కళాశాల విద్యార్థి, ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ లో ఫేయిల్ అయినందుకు మనస్థాపం చెంది తమ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కె. వినయ్ కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

◆ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవడంతో అఘాయిత్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

జహీరాబాద్: ఇంటర్మీడియట్లో ఫెయిల్అయి
నందుకు మనస్థాపానికి గురై వెంకట రమణ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టనంలో నివాసం ఉంటున్న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) డాక్టర్ ఆర్ఎల్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మృతుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాశాడు. సోమవారం మధ్యానం 12 గంటలకు ఇంటర్ సప్లి రిజల్ట్స్ రావడంతో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట రమణ తల్లి వెంకటరమ ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్చేయడంలేదని స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పింది.దీంతో తన స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసు కుని ఉన్నారు. స్నేహితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీ క్షించిన వైద్యులు వెంకట రమణ మృతిచెందినట్లు ధృవీకరించారు. వెంకట్ రమణ మృతిపై తండ్రి కృష్ణ జహీరాబాద్ టౌన్ పీఎస్ లో ఎలాంటి అను మానాలు లేవని పేర్కొన్నట్లు ఎస్ఐ. కె. వినయ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే మహిళ ఒక మేకను కోయటానికి జెల్ల శ్రీకాంత్ (14) పత్రి అశోక్ లను పిలవగా మేకను కోసిన తర్వాత శ్రీకాంత్ అతని చేతులకు అంటిన రక్తాన్ని నీళ్ల తొట్టిలోని నీటితో శుభ్రపరుస్తుండగా తొట్టిలోని నీటితో చేతులను ఎందుకు కడుగుతున్నావని ఆగ్రహించిన కొమురమ్మ కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కర్రతో కొట్టడంతో బాధ భరించలేక మనస్థాపం చెంది సమీపాన ఉన్న గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండడంతో ఇది గమనించిన స్థానికులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు బాలుడు మృతి చెందడంతో గ్రామంలోని విషాద ఛాయల అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడి చిరుప్రాయంలోనే తండ్రి మృతి చెందాడు. మృతునికి తల్లి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మృతుడి తల్లి జెల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కోల కొమరమ్మపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు.

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ.

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ అవగాహన సదస్సు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ సదస్సు కార్యక్రమం శనివారం చేపట్టారు.ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్, డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ ని గుర్తించి తెలంగాణ నేత్ర అవయవాల శరీర దాతల అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ పరికిపండ్ల అశోక్ నియమించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్,అదేవిధంగా బెటాలియన్ అధికారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గా ఎన్నిక చేసినందుకు డాక్టర్ పరికిపండ్ల అశోక్,రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజలలో నేత్రదానము,అవయవాల దానము శరీర దానం పైన మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తృతంగా ప్రజలకి అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య.

— మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

ఆర్థిక భారం తో మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘన నిజాంపేట మండలం చల్మెడ లో చోటుచేసుకుంది. పోలీస్ ల వివరాలు.. గ్రామానికి చెందిన కంపే పరుశురాములు (34) అను వ్యక్తి ట్రాక్టర్ కొని దానికి కిస్తీలు బాకీ పడి మనస్తాపంతో ఇంట్లోనే దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట ఇంచార్జ్ ఎస్సై సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2 లో కేసీఆర్ నగర్ లో తాడూరు రాము కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మిత్రునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version