దోమ చిన్నదే కానీ ప్రమాదం పెద్దది
డెంగీ జ్వరంపై డి ఎం హెచ్ ఓ అప్పయ్య సూచనలు
నడికూడ,నేటిధాత్రి:
ఈరోజు స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా కంఠాత్మకూర్ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభహోత్సవం అనంతరం
హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు
ఈరోజు పి హెచ్ సి రాయపర్తి సిబ్బంది నడికూడ మండలం కంఠత్మకూర్ గ్రామము లో డోర్ టూ డోర్ విస్తృత స్థాయి ఫీవర్ సర్వే ను
చేపట్టడం జరిగింది.ఈ సర్వే ను డి ఎం ఎచ్ ఓ పరిశీలన చేశారు గ్రామం లో సిబ్బంది నిర్వహించిన సర్వే ను కొన్ని ఇండ్లకు వెళ్లి చూసారు. ప్రజలతో మాట్లాడుతూ డెంగీ ఫీవర్ భారిన పడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
డెంగీ జ్వరం వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వ్యాధి.ఇది ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.ఈ దోమలు ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కుడుతాయి. డెంగీకి ప్రత్యేకమైన మందు లేకపోవడంతో నివారణే ప్రధాన ఆయుధం అన్నారు.
ఇంటి చుట్టూ వుండే పిచ్చి మొక్కలు,గడ్డి పొదలు
ఇళ్ల చుట్టూ నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచాలి
వారానికి రెండుమాడుసార్లు మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించి, కూలర్లు,డబ్బాలు,కొబ్బరి చిప్పలు,ట్యాంకులు,టైర్లు శుభ్రం చేయాలి.నీరు నిలువ ఉండకుండ చూసుకోవాలి. దీనితో దోమలు పుట్టకుండా చేయవచ్చు.
పిల్లలు,పెద్దలు పూర్తి బట్టలు వేసుకోవాలి.
దోమలు కుట్టకుండ
దోమ తెరలు,కాయిల్స్, లిక్విడ్స్,కాళ్లకు చేతులకు పూత మందులు వాడాలి.
డెంగీ వ్యాధిని నివారించడం మన చేతుల్లోనే ఉంది.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, తమ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచితే దోమలు కుట్టకుండా నివారించినవారం అవుతామని అన్నారు.నీటి గుంతలు,వాటిలో ఆయిల్ బాల్స్ వేయాలి అన్నారు. మన గ్రామం డెంగీ రహితంగా ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమం లో స్థానిక పి హెచ్ సి వైద్యధికారిని డాక్టర్ దివ్య మరియు హెల్త్ ఎక్స్టెంషన్ ఆఫీసర్,సూపర్ వైజర్స్,ఏ ఎన్ ఎం లు,హెల్త్ అసిస్టెంట్ లు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.