మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా…

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా?

◆:- అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్ల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్న తల్లిదండ్రులు – ఫోన్లలో వచ్చే ఆటలు, రీల కు ఆకర్షితులౌతున్న చిన్నారులు – పజ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆటలతో లోకాన్నే మరచిపోతున్న చిన్నారులు

కొన్నేళ్లుగా యువత, చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్నారు. వాటిలో వచ్చే చిత్రాలు, వీడియోలు అవి ఇచ్చే సందేశాలకు పసితనంలోనే వాటికి ఆకర్షితులై మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కొందరు బడి ఈడు పిల్లలను గతంలో కరోనా సమయంలో వచ్చిన ఆన్​లైన్ తరగతులు ఫోన్లకు కట్టిపడేశాయి. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ పేరిట వివిధ అంశాల పరిశోధనకు ఫోన్లనే వాడుతున్నారు. కాగా తమ పిల్లలు ఫోన్​తో ఏం చేస్తున్నారని గమనించకపోవడంతో చిన్నారులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటిలో పబ్జీ, ఫ్రీఫైర్ ఆటలు ఎదుటి వారిని ఓడించడంలో వచ్చే పాయింట్ల వేటలో పొందే ఆనందంలో వారు లోకాన్నే మరిచిపోతున్నారు.

కొన్ని సంఘటనలు : 

 

 

 

 

తాజాగా భైంసా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న హైదరాబాద్​కు చెందిన సంతోశ్, సాయిసుప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర (13) పబ్జీ ఆటకు బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఆకలి, నిద్ర మరిచి గంటలు తరబడి ఆటలో నిమగ్నమవ్వడంతో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. తల్లిదండ్రులు వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లోకుండా పోయింది. మూడ్రోజుల నుంచి కుటుంబీకులు వారించిగా జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

 

 

గతంలో కుభీరు మండల పార్టీ గ్రామానికి చెందిన ఒకరు ఆన్​లైన్​లో వచ్చే ఆటలు ఆడుతూ పెట్టుబడులు పెట్టాడు. రూ.లక్షల్లో సొమ్ము కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు గమనించాలి :

చిన్నారులు, యువత ఫోన్లను వినియోగిస్తున్నప్పుడు పెద్దలు గమనిస్తుండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

◆:- పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టు వర్కుల సాకుతో వాడుతున్న ఫోన్​లను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారో గమనిస్తూ ఉండాలి.

◆:-ఫోన్​ల వినియోగంతో ఎదురయ్యే దుష్ప్రభావాలను వారికి తెలియజేయాలి.

◆:- స్మార్ట్ ఫోన్​ వినియోగిస్తున్న పిల్లలు సరిగ్గా తినరు, నద్రపోరు. చిన్న చిన్న మాటలకు కుంగిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటే ఓ కంట కనిపెట్టాలి. అలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలి.

సముదాయించి నచ్చజెప్పండి : 

 

 

 

 

ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు డా.సురేశ్‌ అల్లాడి తెలిపారు. ఆ ఆనందంలో లోకాన్ని మర్చిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

“ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆనందంలో లోకాన్ని మరచిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version