సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరువు తూములను వెంటనే మరమ్మతు చేసి రైతులకు నీటి సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు తక్షణ చర్యలు తీసుకొని చెరువు తూములను పునరుద్ధరించి సాగునీటి సమస్యను పరిష్కరించాలనరు

నేటి నుంచి సంక్రాంతి పండగ సెలవులు..

పిల్లలు జాగ్రత్త..

◆-: నేటి నుంచి సంక్రాంతి పండగ సెలవులు

◆-: విద్యార్థులంతా స్వగ్రామాలకు పయనం

◆-: చెరువుల్లో దిగాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలి

◆-: బైక్‌ రైడింగ్‌ వైపు మొగ్గు చూపొద్దు

◆-: అమ్మమ్మ, తాతయ్యతో గడిపితే ఎంతో ఆనందం

 

 

విద్యార్థుల్లో సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. శనివారం నుంచి పండగ సెలవులు ఇచ్చేయడంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చునని, స్నేహితులతో ఆటలు ఆడుకోవచ్చునని సంబరపడుతున్నారు.అయితే ఆ ఆనందంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మానసిక వేత్తలు చెబుతున్నారు. పెద్దవారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చునని, మానసిక ఎదుగుదల ఉంటుందని సూచిస్తున్నారు. సంక్రాంతి ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిదంటున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది పల్లెలు. పండగ సంప్రదాయాలు గ్రామాల్లోనే తొణికిసలాడతాయి. వాటిని కనుల విందుగా చూడాలని పిల్లలూ ఉవిళ్లూరుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. గ్రామాల్లో ఉంటున్న పిల్లలకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంటుంది కానీ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారికి ఉండదు. అలా ప్రమాదాల బారిన పడుతుండడం ఏటా చూస్తున్నాం. అందుకే సంక్రాంతి సమయాల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలవులు అనగానే పిల్లలకు పట్టలేని ఆనందం వస్తుంది. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారుచేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి కన్నవారికి కడుపుకోతను మిగులుస్తాయి. పాఠశాలలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు. పైగా తరగతులు, సిలబస్‌ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉంటారు. సంక్రాంతి సెలవులు అనేసరికి అధిక సమయం ఖాళీగా దొరుకుతుంది. అప్పుడే పిల్లలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు,

ఈత సరదా ఉంటే..

 

సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎక్కువగా ఈతపై దృష్టి పెడుతుంటారు. చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్తుంటారు. ప్రస్తుతం అన్నింటా నీరు పుష్కలంగా ఉంది. మారిన జీవన విధానంతో గ్రామీణ ప్రాంత పిల్లలకే ఈత వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఈత తెలియదు. అటువంటి వారు గ్రామాలకు వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఈతకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఈతరాక ప్రమాదాలకు గురవుతుంటారు. అటువంటి వారి విషయంలో తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. అందుకే సెలవులకు వచ్చే పిల్లలకు ప్రమాదకరమైన చెరువులు, కాలువలు, కుంటల గురించి చెప్పాలి. అటువైపుగా వెళ్లినప్పుడు పెద్దవారిని తోడు తీసుకువెళ్లాలని చెప్పాలి.

వాహన రైడింగ్‌కు దూరంగా ఉంచాలి..

 

ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం ఉంటోంది. మధ్యతరగతి కుటుంబాల్లో సైతం కారు అందుబాటులోకి వచ్చింది. సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావమో కానీ..పిల్లలు రైడింగ్‌ ట్రెండింగ్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో ఉన్న వాహనాలను తీసుకొని రోడ్లపైకి వస్తున్నారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రత పాటించడం లేదు. అతి వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ఒక్కోసారి వీరి కారణంగా ఎదుటి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. అందుకే పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ వాహనం నడిపే అర్హత ఉంటే పూర్తిగా అవగాహన, అవసరం మేరకు మాత్రమే వారి చేతికి వాహనం ఇవ్వాలి.

సెల్‌ఫోన్ల వినియోగం మించొద్దు….

పిల్లలకు సెల్‌ఫోన్లపై విపరీతమైన అవగాహన ఉంటోంది. అందులో ఉండే యాప్స్‌ గురించి వారికి ఇట్టే తెలిసిపోతోంది. ఆన్‌లైన్‌ తరగతులు, అదనపు పరిజ్ఞానం కోసమంటూ చాలా మంది తమ పిల్లల చేతిలో సెల్‌ఫోన్లు పెడుతుంటారు. అయితే దాంతో ఎంత ప్రయోజనమో చెప్పలేం కానీ అనర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫొటోల యాప్స్‌ మొదలు ఆన్‌లైన్‌ గేమ్స్‌ వరకూ అన్ని యాప్‌ల గురించి తెలుసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో అకౌంట్లు తెరుస్తున్నారు. వారు నేర్చుకునే విషయాలు ఎటువైపునకు దారితీస్తాయో అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. అందుకే పిల్లలకు ఈ సెలవుల్లో అవసరానికి మేరకు మాత్రమే సెల్‌ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

మత్తుతో చిత్తు..

జిల్లాలో మైనర్లు, విద్యార్థులు మత్తు బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్‌ అలవాటు ఉంటే మిగతా వారు ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారే ఏమీకాదులే అనే ప్రోత్సాహం మత్తులోకి బలంగా దించుతోంది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో సైతం ఇప్పుడు పార్టీ కల్చర్‌ నడుస్తోంది. సరదాగా ఒకసారి అనే మాటతో మొదలై.. మత్తు అనే మాయలో పడేస్తోంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రులూ అప్రమత్తం…..

సంక్రాంతి సెలవుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఎన్నో విషాద ఘటనలు జరిగాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వారిపై ఒక కన్నేసి ఉంచాలి. బైక్‌లతో పాటు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిదే. వారికి ఆడుకోవడానికి స్వేచ్ఛనివ్వడమే కాకుండా.. వారిని కుటుంబసభ్యులు కనిపెట్టుకొని ఉండాలి.

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా…

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా?

◆:- అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్ల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్న తల్లిదండ్రులు – ఫోన్లలో వచ్చే ఆటలు, రీల కు ఆకర్షితులౌతున్న చిన్నారులు – పజ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆటలతో లోకాన్నే మరచిపోతున్న చిన్నారులు

కొన్నేళ్లుగా యువత, చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్నారు. వాటిలో వచ్చే చిత్రాలు, వీడియోలు అవి ఇచ్చే సందేశాలకు పసితనంలోనే వాటికి ఆకర్షితులై మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కొందరు బడి ఈడు పిల్లలను గతంలో కరోనా సమయంలో వచ్చిన ఆన్​లైన్ తరగతులు ఫోన్లకు కట్టిపడేశాయి. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ పేరిట వివిధ అంశాల పరిశోధనకు ఫోన్లనే వాడుతున్నారు. కాగా తమ పిల్లలు ఫోన్​తో ఏం చేస్తున్నారని గమనించకపోవడంతో చిన్నారులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటిలో పబ్జీ, ఫ్రీఫైర్ ఆటలు ఎదుటి వారిని ఓడించడంలో వచ్చే పాయింట్ల వేటలో పొందే ఆనందంలో వారు లోకాన్నే మరిచిపోతున్నారు.

కొన్ని సంఘటనలు : 

 

 

 

 

తాజాగా భైంసా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న హైదరాబాద్​కు చెందిన సంతోశ్, సాయిసుప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర (13) పబ్జీ ఆటకు బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఆకలి, నిద్ర మరిచి గంటలు తరబడి ఆటలో నిమగ్నమవ్వడంతో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. తల్లిదండ్రులు వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లోకుండా పోయింది. మూడ్రోజుల నుంచి కుటుంబీకులు వారించిగా జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

 

 

గతంలో కుభీరు మండల పార్టీ గ్రామానికి చెందిన ఒకరు ఆన్​లైన్​లో వచ్చే ఆటలు ఆడుతూ పెట్టుబడులు పెట్టాడు. రూ.లక్షల్లో సొమ్ము కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు గమనించాలి :

చిన్నారులు, యువత ఫోన్లను వినియోగిస్తున్నప్పుడు పెద్దలు గమనిస్తుండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

◆:- పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టు వర్కుల సాకుతో వాడుతున్న ఫోన్​లను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారో గమనిస్తూ ఉండాలి.

◆:-ఫోన్​ల వినియోగంతో ఎదురయ్యే దుష్ప్రభావాలను వారికి తెలియజేయాలి.

◆:- స్మార్ట్ ఫోన్​ వినియోగిస్తున్న పిల్లలు సరిగ్గా తినరు, నద్రపోరు. చిన్న చిన్న మాటలకు కుంగిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటే ఓ కంట కనిపెట్టాలి. అలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలి.

సముదాయించి నచ్చజెప్పండి : 

 

 

 

 

ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు డా.సురేశ్‌ అల్లాడి తెలిపారు. ఆ ఆనందంలో లోకాన్ని మర్చిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

“ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆనందంలో లోకాన్ని మరచిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version