మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T171900.110.wav?_=1

 

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని
అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రామకృష్ణగౌడ్ జాతీయ అవార్డు పొందారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T141659.465-1.wav?_=2

జాతీయ అవార్డుకు అందుకున్న రామకృష్ణగౌడ్

అభినందించిన మండల ప్రజలు

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల
మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ళ రామకృష్ణగౌడ్ రాష్ట్రీయ సేవ పురష్కర్ జాతీయ ఆవార్డు 2025 ను హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఆకుల రమేష్ రామకృష్ణగౌడ్ తండ్రి నేరేళ్ల చేరాలు గౌడ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు
గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కులాలను ఏకం చేయడంతో పాటు, ఆయన చేసిన వివిద సామాజిక కార్యక్రమాలను గుర్తించడంతో పాటు, నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గ పాల్గోని రాష్ట్ర సాదనలో తనదైన ప్రతిభ కనపర్చడం, నేడు బీఆర్ఎస్ కార్మిక శాఖ తరుపు కార్మికులను ఏకతాటిపైకి తేవడంతో పాటు వారిని చైతన్యం పరచడంతో పాటు, వారి హక్కుల కోసం పోరాడం చేయడాన్నీ గుర్తించి ఉత్తమ జాతీయ ఆవార్డును అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలిపారు. మారుమూల గ్రామమైన బూర్నపల్లి గ్రామం నుండి జాతీయ స్థాయి ఆవార్డును అందుకోవడం పట్ల మండల ప్రజలు రామకృష్ణగౌడ్ కి శుభకాంక్షలు తెలిపి అభినందిస్తున్నారు.

గణపతికి 2000 దీపాల అంకితం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T124309.891-1.wav?_=3

2 వేల దీపాలతో గణపతికి అలంకరణ

భూపాలపల్లి నేటిధాత్రి

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మహిళలు ఆరవ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీలోని 200 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 2000 దీపాలతో అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర..

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కటి సంజీవరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మొగిలి కోమల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కర్కపల్లి గ్రామానికి చెందిన తాంపు నరసింగం గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్,ఐలోని రామచంద్ర రెడ్డి,నాయకులు రవీందర్ రెడ్డి, కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, రాజిరెడ్డి,మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, యాకయ్య, రఘు, తదితరులు ఉన్నారు.

భూపాలపల్లిలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా…

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐ డి ఓ సి మీటింగ్ హాల్ నందు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఎమ్మెల్యే మేజర్ ధ్యాన్చంద్ ఫోటో ఫ్రేమ్ కి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత జాతీయ క్రీడ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గత సంవత్సరం సీఎం కప్ 2024 లో రాష్ట్రస్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ పి అశోక్ కుమార్ ఎల్ విజయలక్ష్మి చేతుల మీదుగా మెంటోస్ నీ బహూకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎం రాజేందర్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ డి ఆర్ డి ఓ జి ఎం ఇండస్ట్రీస్ , జిల్లా స్థాయి అధికారులు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎల్ జైపాల్ క్రీడాకారులు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ లు, పాత్రికేయులు, కే లో ఇండియా కోచ్ శ్రీనివాస్ , విధ్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కుంకుమ పూజ చేసిన మహిళలు….

కుంకుమ పూజ చేసిన మహిళలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని రెడ్డి కాలనీలో గణనాథుడి మండపంలో శుక్రవారం కుంకుమ పూజలో ఇంటింటి నుండి మహిళలు భారీగా పూజకు బయలుదేరి ఘనంగా గణనాధుని ముందు కూర్చొని తమ ఇంటి యొక్క ఆరోగ్యాల గురించి తమ భర్త యొక్క ఆరోగ్యాల గురించి తన పిల్లల చదువు గణనాథుడి ముందు గట్టిగా పూజలు చేసినారు తమ యొక్క మొక్కులను సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ మహిళలు పురుషులు మారం కొమురయ్య మంజునాథ్ శ్రీను దయ్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ బస్టాండ్ లో పరకాలకు వెళ్లే నూతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి – పరకాల(వయా మొరంచపల్లి, ఎస్ యం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల, రేగొండ) సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుడిలా ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్.యం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్క తో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయకస్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాలక్ష్మీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ఉదయంబసు టైమింగ్స్
6:30 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి పరకాలకు 8 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయణంలో ఉదయం 8:15 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 10 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది.
బసు సాయంత్రం టైమింగ్స్
5:15 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 6:45 గంటలకు పరకాల చేరుకుంటుంది.
7:00 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 8:20 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు…

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు

క్రీడల జిల్లా అధికారి రఘు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 2025 ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ రఘు ఆద్వర్యంలో ఈ నెల 29న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీ మీటింగ్ హల్ నందు ఉదయం 11.30 గంటలకి నిర్వహించబడును.
జిల్లాలో నీ క్రీడా సంఘాల సభ్యులు, క్రీడా కారులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు

టేకుమట్ల అంకుషాపురం మధ్య వంతెన నిర్మాణం చెయ్యాలి…

టేకుమట్ల అంకుషాపురం మధ్య వంతెన నిర్మాణం చెయ్యాలి

సుబ్బక్కపల్లె సోమనపల్లి మధ్యలో అంకుశాపూర్ టేకుమట్ల మధ్యలో రోడ్డుపై వరద

మారేపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండలంలోని సుబ్బక్క పల్లె సోమనపల్లి అంకుశ పూర్ టేకుమట్ల మధ్యలో ఉన్న కల్వర్టుల ద్వారా ప్రజలు ప్రతి వానకాల సీజన్లో టేకుమట్లకు రావాలంటే కల్వర్టుల ద్వారా ప్రవహిస్తున్న వరద నీటిని దాటుకుంటూ రావాల్సిందే టూ వీలర్ వెహికల్స్ గాని ఫోర్ వీలర్స్ వెహికల్స్ గాని దాటాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్కూలుకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే స్థానిక తాసిల్దార్ ఎంపీడీవో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రజలకు వర్షాకాల ఇబ్బందుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న దీని మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు ఇప్పటికైనా స్పందించి దృష్టి పెట్టి సకాలంలో పనులు మొదలుపెట్టే విధంగా చూడాలని లేకుంటే ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను

ఝరాసంగం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-96-1.wav?_=4

పారిశుధ్య లోపం.. ప్రజలకు శాపం

◆:- కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు

◆:- పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రజల అవస్థలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో
ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.

అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.

దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.

Suffer Due to Poor Sanitation

కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T113446.773.wav?_=5

 

54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం.. కళ్లకు గంతలు కట్టుకుని గణపతి తయారీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో మట్టితో మూడు అడుగుల గణనాథుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని ఆయన హైదరాబాద్ కుషాయిగూడ చక్రిపురం ప్రాంతంలోని తన శిల్పకళ వర్క్షాప్లో రూపొందించారు.కళ అనేది కేవలం చేతి వృత్తి మాత్రమే కాదు, అది భక్తి, మంచి భావాలు, మనసును హత్తుకునే అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. నేటి యువత, పెద్దలు, పిల్లలు – తమ వృత్తుల్లో ఒత్తిడికి గురయ్యే వారందరూ కళను అభ్యసించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చని శిల్పి అన్నారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. “పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అందరూ మట్టి గణపతులను ఉపయోగించాలని” శిల్పి హోతి బస్వరాజ్ పిలుపునిచ్చారు.

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T111949.266.wav?_=6

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు

మైనారిటీ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-94.wav?_=7

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-86-1.wav?_=8

 

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

– మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులను రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
– వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే
– 187 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు

గణపురం నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సోమవారం రెవెన్యూ, ఇండస్ట్రీయల్, పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీఎస్సార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. మైలారం రెవెన్యూ శివారులోని 204/1 ,205/1 సర్వే నెంబర్ లలో మొత్తం 187 ఎకరాలు భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు స్థలం కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇండస్ట్రీస్ పార్క్ కొరకు 60 ఎకరాల్లో 197 ఫ్లాట్లు కేటాంచడం జరిగిందన్నారు. స్క్వేర్ ఫీట్ రూ.1600 లకు టెండర్ కూడా త్వరలోనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కు 40 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయంకు 10 ఎకరాలు, సైనిక్ స్కూల్ కు 20 ఎకరాలు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు 15 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే రోడ్డు పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని మరో రూ.15 కోట్ల నిధులు సమకూర్చుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డిమాండ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-93-1.wav?_=9

నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం

.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్

యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు

గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-88-1.wav?_=10

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154921.524.wav?_=11

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.

25వ వార్డు సమస్యలపై సిపిఐ ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-86.wav?_=12

25 వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా

క్యాతరాజు సతీష్
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇంచార్జ్ సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో మంచినీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచాలని పరిశుభ్రమైన నీరును విడుదల చేయాలని, కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని, 6 ఇంక్లైన్ గని గోడకు సింగరేణి స్కూల్ గోడకు మధ్యలో ఉన్న రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడం మూలాన ఆ రహదారి మొత్తం డంపింగ్ యార్డ్ ల తయారైన పరిస్థితి కనపడుతుందన్నారు దీని మూలాన కార్మికులు స్కూలుకు పోయే పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ అధికారులు తక్షణమే ఆ రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని, కోరారు అంతేకాకుండా వార్డులో వీధి దీపాలు వెలగడం లేదని అడిగితే టెండర్ అయిపోయిందని సమాధానం గత రెండు నెలలుగా చెబుతున్నారని ఇకనైనా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా వార్డులో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు సమస్యలతో సతమతమవుతున్న కాలనీ ప్రజలను మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్, డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య, 25 వ వార్డు మహిళా నాయకురాలు పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, క్యాత రాజు అనూష, పోతుగంటి స్వప్న, గుండేటి శివకుమార్, బిల్ సింగ్, మట్టి కృష్ణ, తోపాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యుఆర్ఎస్ పాఠశాల టీచర్లపై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్…

యుఆర్ఎస్ పాఠశాల టీచర్లపై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్

ఘటనకు కారణమైన ఉపాధ్యాయులను అరెస్టు చేసి, కఠినమైన శిక్షలు విధించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యుఆర్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు యుఆర్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి అక్కడున్న సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. యుఆర్ఎస్ టీచర్లు ఐక్యత లేకపోవడం వల్లనే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా టీచర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కక్ష సాధింపు చర్య కోసమే తాగేది మంచినీళ్లలో విషపూరిత రసాయనాలు కలపడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధ్యుడిపై చట్టరీత్యా శిక్షించాలని కోరారు. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా యుఆర్ఎస్ పాఠశాల టీచర్లు అందరిని తొలగించాలని కోరారు.

 

 

అస్వస్థకు గురైన 11 మంది విద్యార్థులను కార్పొరేట్ వైద్యం అందించాలని కోరారు. యుఆర్ఎస్ పాఠశాలకు వారానికి ఒకసారి అధికారులు పర్యవేక్షించాలని విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. యుఆర్ఎస్ టీచర్లపై చర్యలు తీసుకోకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version