ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ బస్టాండ్ లో పరకాలకు వెళ్లే నూతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి – పరకాల(వయా మొరంచపల్లి, ఎస్ యం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల, రేగొండ) సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుడిలా ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్.యం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్క తో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయకస్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాలక్ష్మీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ఉదయంబసు టైమింగ్స్
6:30 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి పరకాలకు 8 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయణంలో ఉదయం 8:15 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 10 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది.
బసు సాయంత్రం టైమింగ్స్
5:15 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 6:45 గంటలకు పరకాల చేరుకుంటుంది.
7:00 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 8:20 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు