యుఆర్ఎస్ పాఠశాల టీచర్లపై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్
ఘటనకు కారణమైన ఉపాధ్యాయులను అరెస్టు చేసి, కఠినమైన శిక్షలు విధించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యుఆర్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు యుఆర్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి అక్కడున్న సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. యుఆర్ఎస్ టీచర్లు ఐక్యత లేకపోవడం వల్లనే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా టీచర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కక్ష సాధింపు చర్య కోసమే తాగేది మంచినీళ్లలో విషపూరిత రసాయనాలు కలపడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధ్యుడిపై చట్టరీత్యా శిక్షించాలని కోరారు. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా యుఆర్ఎస్ పాఠశాల టీచర్లు అందరిని తొలగించాలని కోరారు.
అస్వస్థకు గురైన 11 మంది విద్యార్థులను కార్పొరేట్ వైద్యం అందించాలని కోరారు. యుఆర్ఎస్ పాఠశాలకు వారానికి ఒకసారి అధికారులు పర్యవేక్షించాలని విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. యుఆర్ఎస్ టీచర్లపై చర్యలు తీసుకోకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ హెచ్చరించారు
