రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.