ఆర్టీసీ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ‘అర్రైవ్-అలైవ్’ ర్యాలీ

ఆర్టీసీ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ‘అర్రైవ్-అలైవ్’ ర్యాలీ

అంబేద్కర్ జయంతి సందర్భంగా మహిళా స్వీపర్లకు చీరల పంపిణీ

నర్సంపేట, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా “అర్రైవ్–అలైవ్” నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ నాయకత్వంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుపై ఈ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సై అరుణ్, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.అనంతరం డిపోలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ నర్సంపేట డిపో ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిపోలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, సూపర్‌వైజర్లు, మెకానిక్లు, కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

నర్సంపేట డిపోలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నర్సంపేట డిపోలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

 

మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డిపో మేనేజర్ కె. ప్రసూనలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నర్సంపేట డిపో కమిటీ ఈ సంబరాలను నిర్వహించింది.ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్, డిపో కార్యదర్శి బొడిగె రాజు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా విస్తరణ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎస్‌టీఐ అప్ప కుమార్, ఎమ్‌ఎఫ్ దత్తం, మానస, హెడ్ గార్డ్ విరారెడ్డి, దేవేందర్, రాంబాబు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్..

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజల రవాణా ఇబ్బందులను రాకుండా చూడడమే ప్రభుత్వ ఒక్క బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు టేకుమట్ల మండల కేంద్రంలో టేకుమట్ల అంకుషాపూర్ సోమనపల్లి సుబ్బక్కపల్లి నవాబుపేట మొగుళ్లపల్లి పరకాల ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, రైతులు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను పడుతున్నారని నూతనంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు
ఈ కొత్త బస్సు సర్వీసు ద్వారా మారుమూల గ్రామాలకు పట్టణ ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుంది విద్యార్థులకు మేలు సకాలంలో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది ప్రజా సంక్షేమం ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ నాయకులు పాల్గొన్నారు

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మికి వినతిపత్రం సమర్పణ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ నూతన విలీన గ్రామం మహేశ్వరంలో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు హల్టింగ్ ఇవ్వాలని డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది ఉద్యోగం,విద్యా,వైద్య నిమిత్తం హన్మకొండ, హైదరాబాద్ కి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు ఆగడంలేదు ఇందువలన నర్సంపేటకి వచ్చి బస్సు ఎక్కడం అవుతుందని తెలిపారు. అలాగే రాత్రి సమయాల్లో హన్మకొండ నుండి నర్సంపేటకి వచ్చే బస్సులు మహేశ్వరం వద్ద ఆపటం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యకి పరిష్కారం చూపించి అన్ని బస్సులు ఆపే దిశగా చూస్తాఅని హామీ ఇచ్చారు. బస్సులు ఆపకుంటే అలాగే డిపో సమాచారం నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. వినతిపత్రం అందచేసిన వారిలో కౌన్సిలర్లు మాతృ రాథోడ్,భూస శిరీష-రాజు,గ్రామస్తులు చెన్న భాస్కర్,బేతం అఖిల్,చిదురాల చక్రపాణి ,మోర్తాల రాజు,బొల్ల శ్రీకాంత్, చెన్న గణేష్,చేరాల ప్రదీప్,భూక్య సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు
బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79 ప్రత్యేక బస్సులు ఏర్పాటు భక్తులకు మెరుగైన, సురక్షిత ఆర్టీసీ సేవలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణ, రవాణా సౌకర్యాలను మెరుగుపరచే ఉద్దేశంతో 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, ఆదివారం రోజున జాతర బస్సు సేవలను ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ వద్ద తగిన సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని, మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు.బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు నిరంతరంగా బస్సులు నడుస్తాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, ఏసిపి. రవికుమార్, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్,ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిల ను చెల్లించాలి…

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిల ను చెల్లించాలి

విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు వినతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి రిటైర్డు పొందిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ శనివారం నర్సంపేట ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మికి,సెక్యూరిటీ విజిలెన్స్ ప్రతినిధులకు వేరువేరుగా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర సారధ్య కమిటీ ఆదేశాల మేరకు అన్ని బస్ డిపోల వద్ద సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నర్సంపేట డిపో అర్పిఎస్ 2017 ఏరియర్స్, గ్రాజిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఫరెన్స్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.పిఎఫ్ పెన్షన్ విషయంలోనీ ఇబ్బందులను తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి పట్టాభి లక్ష్మయ్య, జిల్లా ప్రతినిధి రవీందర్ డిపో ప్రతినిధులు ఏవై స్వామి, ఎస్ వి చారి, ఏ సాంబయ్య,ఎ.కే స్వామి, దయానంద్, మోహనాచారి, జె. శ్రీనివాస్ రెడ్డి, సాదిక్ పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో

ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ పట్ల డెమో

నర్సంపేట,నేటిధాత్రి:

 

అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నర్సంపేట అగ్నిమాపాక కేంద్రం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపి వద్ద ఫైర్ సేఫ్టీ డెమో ప్రదర్శించారు.
ఆర్టీసీ డిపోలో గాని ఆయిల్ బంక్ వద్ద అలాగే ఎలక్ట్రీకల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిపో ఉద్యోగులకు డెమో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ,నర్సంపేట ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయూబ్,డిపో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ బస్టాండ్ లో పరకాలకు వెళ్లే నూతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి – పరకాల(వయా మొరంచపల్లి, ఎస్ యం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల, రేగొండ) సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుడిలా ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్.యం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్క తో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయకస్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాలక్ష్మీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ఉదయంబసు టైమింగ్స్
6:30 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి పరకాలకు 8 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయణంలో ఉదయం 8:15 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 10 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది.
బసు సాయంత్రం టైమింగ్స్
5:15 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 6:45 గంటలకు పరకాల చేరుకుంటుంది.
7:00 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 8:20 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version