ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.
ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు. ఈ యొక్క సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు సురేష్ బుద్ధిష్ట్ర సొసైటీ నాయకులు సుభాష్, నర్సింలు, అశోక్, రాజు, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి టి. హరిశ్ రావు ని సోమవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, యం. జైపాల్, మల్లేశం, లు ఉన్నారు.
పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.
ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.
తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.
ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?
వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?
ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.
కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.
ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.
5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.
హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?
గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.
30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.
మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.
నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.
కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.
గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.
వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.
ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.
సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.
చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.
నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించబడుతున్న నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (NSPC)-2025 పోస్టర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా lAS సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకుపర్యావరణ పరిరక్షణ లో భాగంగా నీటి సంరక్షణ, చెట్లు నాటడం, మరియు తడి పొడిచెత్త వేరుచేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలని మరియు క్విజ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య DYSO రాందాస్ పాల్గొన్నారు. “HARIT – The Way of Life” అనే నినాదంతో ఈ పోటీ July 1 నుంచి August 21, 2025 వరకు దేశవ్యాప్తంగా జరుగనుంది. August 30న ఫలితాలు ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనవచ్చని వారు సూచించారు. ఈ పోటీని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు. పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీకి సంబంధించిన నమోదుకు, క్విజ్ పోటీకి సంబంధిత లింకులు కూడా విడుదల చేశారు.పోటీ గమ్యం: విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన లింక్ పోటీ https://ecomitram.app/nspc/ వెబ్సైట్లో విద్యార్థులు చూడవలసిందిగా కోరారు.
వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.
గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._
నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలంలో ఆకాశంలో వర్షపు మబ్బులు కనబడితే మన ఆమనగలులో కరెంటు కష్టాలు…. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి గాలిలో వచ్చినయ్ కానీ రెప్పపాటు లో కూడా కరెంటు పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కరెంటు ఎందుకు పోతుంది అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పత్య నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది BRS ప్రభుత్వం లొ కరెంటు పోతే వార్త ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు వస్తే వార్తా అవుతుంది ఇప్పటికైనా మేల్కొని రైతులకు న్యాయమైన 24 గంటల వ్యాపారస్తులకు మరియు గృహస్థులకు మీ డిపార్ట్మెంటు ఏ విధంగా కరెంటు బిల్లు వసూలు చేస్తుందో అదేవిధంగా తమరు కూడా వినియోగదారులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ఆగ్రహాన్ని రాబోయే రోజులలో తమరు చూడాల్సి వస్తుందనిBRS పార్టీ సీనియర్ నాయకులు పత్య నాయక్ ప్రభుత్వనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ సోనా శ్రీనునాయక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, మాజీ కౌన్సిలర్ రాధమ్మ, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, సైదుల్ గౌడ్, మల్యా నాయక్, కృష్ణవేణి నాయక్, శ్రీకాంత్ నాయక్, భాస్కర్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ మీడియా అని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని,
అన్ని పత్రికలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే ఆశ్రయిస్తున్నాయని వరంగల్ డిజిటల్ మీడియా ఎడిటర్లు అన్నారు.
సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్ల సమావేశం వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా డిజిటల్ పేపర్లకు రాజకీయంగా, ప్రభుత్వ అధికారుల నుంచి రావాల్సిన గుర్తింపుపై చర్చించారు.
మనం ఉన్నది ఆశించే స్థాయిలోకాదని, శాసించే స్థాయిలో ఉన్నామన్నారు.
అన్ని పత్రికల్లా మనం కూడా ప్రభుత్వ, రాజకీయ, ప్రజల సమస్యలపై కథనాలు ఇస్తున్నామని చెప్పారు.
రానున్న రోజుల్లో అన్ని పేపర్లు డిజిటల్ వైపే చూస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్ సంఘానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం సలహదారులుగా “నేటిధాత్రి” ఎడిటర్ కట్ట రాఘవేందర్ రావు , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును ఎన్నుకున్నారు.
సంఘం అధ్యక్షుడిగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, ఉపాధ్యక్షులుగా స్పాట్ వాయిస్ ఎడిటర్ చేలిక రాజేంద్రప్రసాద్, అక్షరశక్తి ఎడిటర్ పల్లె రవివంశీమోహన్, ఘంటారావం ఎడిటర్ బొల్లెపల్లి.
కిషన్, ప్రధాన కార్యదర్శిగా అక్షరదర్భార్ ఎడిటర్ వేముల రాజేశ్వర్ రావు, సహాయ కార్యదర్శులుగా జననిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, మన కలం ఎడిటర్ సుంకరనేని నర్సయ్య, అక్షర సవాల్ ఎడిటర్ బాదవత్ బాలాజీ నాయక్, సంస్కృతిక కార్యదర్శిగా ఎడిటర్ యాంసాని శ్రీనివాస్, ట్రెజరరీగా కౌడగాని మోహన్ రావు, మీడియా ఇన్ చార్జ్ గా స్పాట్ వాయిస్ నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా రావుల రాజేశం, లింగబత్తిని కృష్ణ, సంపతి ప్రభాకర్ రావు, దాసరి మధు సూదన్, వక్కల వెంకటస్వామి, చల్లా రాజిరెడ్డి, కోల జనార్దన్, కే. కిరణ్, పెంచాల రాజును ఎన్నుకున్నారు.
సీపీ సన్ ప్రీత్ సింగ్ ను కలిసిన వరంగల్ నూతన ఏఎస్పీ
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నాడు, వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ, పేద ప్రజలకు సత్వర న్యాయం అందించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా శాంతి భద్రతలు కాపాడాలని ఏఎస్పీకి సూచించారు.
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు బలబత్తుల రాజకుమార్ తెలిపారు. నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులు ఆధ్వర్యంలో ఉదయం మంగళవారం రోజున మన రామలింగేశ్వర స్వామి దేవతా మూర్తులకు పంచామృత అభిషేకం,అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ
*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
“పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు”
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని ప్రజా ప్రతినిధుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఆమెకు 966 సర్వే నెంబర్ లో.. ఆమెకు ఒక ఎకరా గైరాన్ పొలం ఆమె పేరా చేశారు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని నిలదీస్తే.. తమకు రూ.5 లక్షలు ఇస్తే తిరిగి పొలం ఇస్తామని.. చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధుల ఆధీనంలో ఉన్న తన పట్టా పొలాన్ని తనకు ఇప్పించాలని కలెక్టర్ కు వినతిపత్రంలో బాధితురాలు కోరింది.
పి హరి ప్రసాద్ బాబు. గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.
కాశిబుగ్గ నేటిధాత్రి.
గీసుగొండ మండలంలో 14,000 ఎకరాలకు పైగా సాగవుతున్న పత్తి పంటకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన 135 కిలోల యూరియా మోతాదును 4 భాగాలు చేసి వేసుకోవాలని,మొదటి 5 రోజుల్లో 25%,తర్వాత 20-25 రోజుల వ్యవధిలో,మూడు సార్లు సమాన మోతాదులో, మిగతా 75% యూరియా వేసుకోవాలి.అలాగే వరి పంటకైతే 96 కిలోలు మూడు భాగాలు చేసుకొని వేసుకోవాలి.వరి నాటు వేసిన 15 రోజులకు 30 కిలోలు,30 రోజులకు 35 కిలోలు,చిరు పొట్ట దశలో 31 కిలోలు వాడాలని తెలిపారు. పైన తెలిపిన యూరియాను గుళికల రూపంలో (45 కిలోల బ్యాగ్స్) వాడటం తగ్గించి, ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చిన నానో ప్లస్ ద్రవరూప యూరియాను ఒక అర లీటర్ ఒక ఎకరానికి నేరుగా స్ప్రేయర్/డ్రోన్ తో గాని పిచికారి చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఎందుకంటే నానో ప్లస్ ద్రవ రూప యూరియాను వాడటం వలన చాలా లాభాలు కలిగి ఉన్నాయి. ⏩సాధారణ యూరియా తో గ్రీన్ హౌస్ వాయువు(నైట్రస్ ఆక్సైడ్) విడుదలై భూమి వేడెక్కడమే కాక వర్షపు నీటితో కలిసి జల కాలుష్యం కు కూడా జరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది.అదే నానో యూరియా వాడితే 40% వరకు వాతావరణ,నీటి కాలుష్యం తగ్గించవచ్చు. ⏩ వరి ఆకుల పైన ఈ ద్రవరూప యూరియా వెంటనే పూర్తిగా వ్యాప్తి అయ్యి, అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న నత్రజని వేగంగా గ్రహించబడి,వినియోగ సామర్థ్యం (80-90%) అత్యధికంగా ఉండి,మొక్క ఆరోగ్యవంతముగా పెరుగుదల ఉండి,సరియైన నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయని తెలిపారు.(అదే 45kg ల యూరియా బ్యాగ్ వేస్తే 40% మాత్రమే మొక్కకు వేర్ల ద్వారా చేరుతుందని ఇక్కడ రైతులు గమనించాలని కోరారు). ⏩నానో ప్లస్ ద్రవరూప యూరియా వాడడం వల్ల నేల స్వభావం,రసాయన-జీవ వాతావరణం,మిత్ర కీటకాలు వృద్ధి చెందడం పై ఏవిధమైన చెడు ప్రభావం ఉండదు. ⏩నత్రజని మొక్క వేళ్ళకు అందకుండా నేల లోపలికి ఇంకిపోయే నష్టం ఉండదు. ⏩ఇట్టి నానో ప్లస్ ద్రవరూప యూరియాను పై రెండు పంటలేకాక మొక్కజొన్న , ఎండుమిరప, పప్పు దినుసులు & ఇతర అన్ని పంటల పైన పిచికారి చేసుకొనవచ్చు అని అన్నారు.
కాబట్టి, పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు అవసరం మేరకే యూరియాను మరియు ఇతర రసాయన ఎరువులను వేసుకోవాలి. పర్యావరణాన్ని, జలాశయాలను విషపూరితము చేస్తున్న గుళికల రూపంలోని యూరియా వాడకం తగ్గించి నానో సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన యూరియాను విరివిగా వాడాలని కోరారు. శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు పైన చేప్పిన సూచనలను రైతుసోదరులు గమనించి,అర్థం చేసుకొని, సహకరించి పాటించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
పి.హరి ప్రసాద్ బాబు. గీసుగొండ మండల వ్యవసాయ అధికారి
సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి
నేటిధాత్రి:
లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచిందని దీనితో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఎలాగైనా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కలెక్టర్ గాని చొరవ తీసుకొని వారికి బిల్లులు వచ్చే విధంగా చొరవ తీసుకొని వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకున్నారు కలెక్టర్కు ఇచ్చిన ప్రజావాణి . సంబంధిత అధికారులకు పత్రంలో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల మండల న్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిసేటి రాహుల్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఆక్సిజన్ యంత్రాన్ని కొనివ్వడం జరిగింది. రాహుల్ గౌడ్ దాతృత్వానికి రాజమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. తన శక్తి మేరకు బాధితురాలికి వైద్య సహాయం అందజేశానని ప్రభుత్వపరంగా అవకాశాలుంటే రాజమ్మకు మెరుగైన వైద్య సహాయం అందజేయగలమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి…
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు…
నేటి ధాత్రి –
మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి లకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,కందునూరి శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి.సక్రు, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కత్తి సత్యం గౌడ్, సంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
⏩ 16వ డివిజన్ అభివృద్ధి పై ఎమ్మెల్యే రేవూరి దృష్టి సారించాలి.
⏩ ఓట్లు వేయలేదని కారణంతో అభివృద్ధి పనులను నిలిపివేసిన స్థానిక ఎమ్మెల్యే.
⏩ ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలి.
16వ డివిజన్ కార్పొరేటర్. సుంకరి మనీషా శివకుమార్
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ లోని కీర్తినగర్ లో కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో కీర్తినగర్ కాలని అభివృధి కొరకు ఒక కోటి యాభై లక్షలు మరియు గరీబ్ నగర్ అభివృధి కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించి,పనులు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
దాంతో టెండర్లు అయి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న రోడ్లను కేవలం ఈ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారనే కారణంగా కక్ష పూరిత వైఖరితో కాంట్రాక్టరు ను ఇబ్బందికి గురిచేస్తూ పనులు ప్రారంభించకుండా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు.
పక్షపాత ధోరణి వీడి త్వరగా పనులు ప్రారంభించాలని,గత ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులను తిరిగి మళ్లీ శంకుస్థాపన చేస్తానని,ప్రస్తుత ఎమ్మెల్యే అనుకుంటే అందుకు కూడా సహకరిస్తామని,కేవలం ఎన్నిలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, ఇప్పుడు మాత్రం 16వ డివిజన్ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కు హితవు పలికారు.
మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన స్టేడియం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపివేయడం జరిగిందని సందర్భంగా తెలిపారు.
ఆ పనులను కూడా వెంటనే తిరిగి ప్రారంభించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కోరడం జరిగింది.ఇలాంటి కక్ష సాధింపు చర్యలు వీడి అభివృద్ధి పై దృష్టి సారించాలని కోరారు.
పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేని సొంత పార్టీకి చెందిన తూర్పు నాయకుడు విమర్శిస్తే ఖండించలేని నాయకులు,మేము డివిజన్ అభివృధి మీద విలేకరుల సమావేశం పెడితే సంబంధం లేకుండా కాంగ్రెస్ వాళ్లు కూడా విలేకరుల సమావేశాలు పెడుతున్నారు.
దీంతో నే అర్ధం అవుతుంది,ఎమ్మెల్యే మీద మీకున్న ప్రేమ,డివిజన్ అభివృధి మీద మీకున్న చిత్త శుద్ధి అని ఎద్దేవ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షులు పోగుల సంజీవ, గ్రామపార్టీ అధ్యక్షుడు గోరుకంటి లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి మెండు కమలాకర్, మండల మహిళా అధ్యక్షరాలు కొండా రాధ,విజయ లక్ష్మీ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు,బాబు రావు,సుబోధచారి,చంద్ర శేఖర్,బొజ్జం తిరుపతి,వజినపల్లి.శ్రీను,చల్లా.కుమార్,సతీష్,కొత్తపల్లి.
రాజు,దిలీప్,అశోక్,రామకృష్ణ,బొంత.రవి,ప్రశాంత్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు. మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.