ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి…

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు…

నేటి ధాత్రి –

 

 

 

మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి లకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,కందునూరి శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కత్తి సత్యం గౌడ్, సంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే.

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే…

 

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

Anantapuram: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ex MLA Kethireddy Peddareddy) తాడిపత్రి (Tadipatri)కి రావడంతో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మీడియాతో మాట్లాడారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇళ్ళు రిజిస్ట్రేషన్ తప్పని.. ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట వచ్చిన ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో… వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. రేపటి (సోమవారం) నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర,, వైసీపీ కార్యకర్తలు వుంటే మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.చర్యకు ప్రతి చర్య ఉంటుంది.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే ఆయన ఆగడాలు సాగవని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా, ముండమోపి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారన్నారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని తన ఇంటికి కొలతలు వేయించారని, తాను మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని అన్నారు. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశానన్నారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.కాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని పోలీసులు పలుమార్లు సూచించారు. అయితే తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి నివాసానికి వెళ్లి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెబుతూ ఆయనను అనంతపురంకు తరలించారు.

 

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

నేటి ధాత్రి గార్ల:

 

సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల నేటి ధాత్రి:

మండలంలోని సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో కబ్జాకు గురైన చెరువు శిఖం భూములకు వెంటనే ట్రెంచ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మంగపతి రావు భవనంలో మల్లెల నాగమణి అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్, సత్యవతిలు మాట్లాడుతూ, మండలానికే అతిపెద్ద చెరువు గా ఉండి,అటు ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇటు రైతుల లెక్కల ప్రకారం సుమారుగా 18 వందల ఎకరాల వరి పంటల భూములకు సాగునీరు అందించే ఈ చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,ఐ.గోవింద్,ఎల్లయ్య, మౌనిక,ఉపేందర్ రెడ్డి, బి.లోకేశ్వరావు,కైబాబు,మౌలానా,సిహెచ్.మౌనిక,ఎ.రామకృష్ణ,కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version