మండల పరిధిలోని నందిగామ గ్రామంలో సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో కుల వివక్షత చూపరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతిని వీడని ఆడాలని సూచించారు. కులం పేరుతో దూషించినట్లయితే 100 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి గ్రామస్తులు ఉన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్
చేర్యాల నేటిదాత్రి
బిజెపి రాష్ట్రాల అధ్యక్షులు నియామకంపై లేక విడుదల చేసింది అధిష్టానం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు సూచించింది హైదరాబాద్ వారి నివాసం దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ శాలువాతో సత్కరించి తన అభిమానం చాటుకున్నారు సీనియర్ నాయకుడు అయిన రామచంద్ర రావు అధిష్టానం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజులలో తెలంగాణలో అధికారం తేవడానికి మేమంతా కలిసి కాషాయపు జెండా ఎగురవేసి సత్తా చాటుతామని అన్నారు
ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు తోచని స్థితిలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సరైన విద్య ప్రమాణాలు లేవని మరియు భోజనం వసతి సౌకర్యాలు అంతంతే నని, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద సీటు రావడంతో అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని మొదట మురిపించిందని ఇలా పాఠశాల యజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు మానసిక అందోలోనాలతో కృంగిపోతున్నారని వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు.
గట్లకానిపర్తిలో నూతన జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గట్లకా నిపర్తి గ్రామంలో ఎమ్మెస్ పి మండల ఇన్చార్జ్ మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో నూతన జెండా గద్దె నిర్మాణం సమావే శం జరిగింది.ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ ,ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ , ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగలు హాజరై మాట్లాడి అనంతరం ఎమ్మార్పీ ఎస్ నూతన జెండా గద్దె నిర్మా ణం పనులను ప్రారంభించా రు.ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ, ఎంఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎర్ర రాము మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు,బొమ్మకంటి రవీంద్ర మాదిగ ,ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి , మామిడి విజయ్ మాదిగ ఏం వైయస్ మండల అధ్యక్షు లు మామిడి తిరుపతి మాదిగ ,బొమ్మకంటి కుమార స్వామి మాదిగ ,బొమ్మకంటి సాంబయ్య మాదిగ ,చింతం రాజేందర్ మాదిగ ,బొమ్మకంటి కుమారస్వామి మాదిగ ,చిలుక కిరణ్ మాదిగ,బొమ్మకంటి భద్రయ్య మాదిగ ,బొమ్మకంటి సుధాకర్ మాదిగ ,బొమ్మకట్టి సదానందం మాదిగ, బొమ్మకం టి కుమార్ మాదిగ ,బొమ్మకం టి సాంబయ్య మాదిగ ,బొమ్మ కంటి ఆనందం మాదిగ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మంచిర్యాల జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం రోజున తపస్ సంఘ కార్యాలయం, మంచిర్యాల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ పాల్గొన్నారు.
కంచే చేను వేసిన చందంగా సిపిఎస్ కు గత 13 నెలలుగా ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం శోచనీయమని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తనిఖీలకు ఉపాధ్యాయులు వెళ్తే పాఠాలు ఎవరు బోధిస్తారని, సంబంధిత ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ప్రతి 20 మందికి ఒక టీచర్ ను ఇవ్వాలని, 100 మంది విద్యార్థులు ఉంటే 5 ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని, బదిలీలు చేపట్టి, వందలాదిగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని, పాఠశాలల్లో ఉన్న వివిధ ఖాళీలను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని, ఎన్ ఈ పి ని తెలంగాణలో వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల బిల్లులను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన మేరకు వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ప్రతినెల 1వ తారీఖున చెల్లించాలని, కేజీబీవీ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, రవికుమార్ లు డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సమావేశంలో జిల్లా నాయకులు నీలేశ్ కచ్వాల్, భారతీ అశోక్, గోపాలరావు, మండల నాయకులు శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
ముస్తాల ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ గా సేవలందించిన కాసుల రమేష్ పదవి విరమణ సభను చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు పనిచేసిన ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మరియు బంధు మిత్రులు అతని చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అతని సేవలను కొనియాడారు సమాజంలో వైద్య వృత్తి కి ప్రత్యేక స్థానం అలాంటి వృత్తిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేర్యాల పరిసర ప్రాంతాల్లో కరీంనగర్ మారుమూల కాలేశ్వరం పరిసర ప్రాంతాలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించి మంచి వైద్యాధికారిగా పేరు తెచ్చుకున్న కాసుల రమేష్ ను పలువురు అభినందించారు మరియు విశ్వకర్మ సంఘాలు స్వర్ణకార సంఘాలు నాయకులు వారిని శాలువాతో సత్కరించి కొనియాడారు ఈ సందర్భంగా కాసుల రమేష్ మాట్లాడుతూ నా ఉన్నతికి కారణం నా తల్లిదండ్రులు మరియు నా సహోదరుడు కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అన్నారు మరియు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా అర్ధాంగిని శ్రీలత సేవలను కొనియాడారు మరియు వారి కొడుకులు కోడళ్లను అయినా ,విక్రాంత్, నిహారిక, సుమంత్, చందన నా ఉన్నతికి అదృష్టం అన్నారు సుదీర్ఘ నా జీవిత ప్రయాణంలో నాతో కలిసి వచ్చిన బంధుమిత్రులు మరియు ఆత్మీయులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలు రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మహిళలకు ఉ చిత బస్సు సౌకర్యం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా బీసీ కమిషనర్ ఏర్పాటు కులగణన రైతు కమీషన్ ఏర్పాటు విద్య కమీషన్ ఏర్పాటు విద్యా కమిషన్ ఏర్పాటు వైశ్య కార్పొరేషన్ రైతు కూలీలకు రైతు భరోసా సన్న వడ్లకు 500 బోనస్ ఇలాంటి అనేక పథకాలు చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు.
జహీరాబాద్/ఝరాసంగం: ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి.. సర్కార్ బడులల్లో సదువుతున్న మీ పిల్లలకు సౌలతులు ఎట్లున్నాయో అరా తీయుర్రి.. రాష్ట్ర సంపాదనలో సగం వాట మీరు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములే..ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి..నాయకులు, ఓట్లేసిన జనాలకు జీతగాళ్లు.ఇంకా నాయకులు ముందు సంకల చేతులు కట్టుకోని నిలబడడం బంద్ చెయ్యాలి.. బజాప్తాగా సర్కార్ స్కూళ్ళను సందర్శించి,మధ్యాహ్న భోజనాన్నిరుచిచూడండి..విద్యార్థులకు సరిపోయే టీచర్లు ఉన్నారో, లేరో తెలుసుకోవాల్సిన ఉంది,ఆడపిల్లలకు సరిపోయేన్ని టాయిలెట్లు,మరుగుదొడ్లు ఉన్నాయో లేవో అడిగితేల్సుకోండి,రేపు మాపో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలకు నాయకులు వస్తే,మీ ఊరి గవర్నమెంట్ బడులల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికక్కడ నిలదీయండి..పేద పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని, పేదోళ్లకు సదువు అందియకుండా, అగ్రవర్ణాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులను సంకల పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు..పొమ్మనలేక పొగబెట్టినట్టు సర్కార్ స్కూళ్ళను సర్వనాశనం చేస్తున్న పలుకుబడి నాయకులు. జర జాగ్రత్త వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఓట్లు డిగే వారిని ప్రశ్నించలని. మనకు ఎవరు అందుబాటులో ఉండి పనిచేస్తారో ఆ నాయకుని దృష్టిలో పెట్టుకుని లేక మనకు వెనుకుండి కత్తి పోర్చు పొడిచే నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్లను రాబోయే స్థానిక ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా యువత ఐక్యమత్యంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి యువత గెలిచేల పనిచేస్తామని,గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధికి దోహదపడుతుందని,గ్రామఅభివృద్ధి యువతతోనే సాధ్యమని రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను తప్పకుండా యువత గెలుస్తుందని మండల పరిపాలన మొత్తం యువత చేతుల్లో ఉంటుందని అన్నారు.
గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ.19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం పెట్టిన ముద్దు పేరు హేతుబద్దీకరణ. అందరికి అందుబాటులోకి విద్యను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలల విస్తరణ చేపట్టి “పల్లె పల్లెకో పాఠశాల” నినాధంతో గత ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలను ఏర్పాటు చేసి పక్కా భవనాలను నిర్మించింది. రెండు దశాబ్దాల తర్వాత వెనకకు తిరిగి చూస్తే ఆశించిన ఫలితాలు రాకపోగా విద్యా నాణ్యత ప్రమాణాలు మరింతగా దిగజారి పోయాయి. ఆ కాలంలో ప్రారంభించిన పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కారణంగా అప్పుడు ప్రభుత్వంలో వున్న పార్టీ నాయకులను కాంట్రాక్టర్లుగా తయ్యారు చేయడానికి, వారి జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడింది. పాఠశాలల ఏర్పాటులో చూపిన శ్రద్ధను మౌళిక వసతులు కల్పించడంలోను, నాణ్యమైన విద్యను అందించడంలోను ప్రభుత్వం చూపలేదు.మారిన పరిస్థితుల కారణంగా విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేరు. ఇద్దరు ఉన్నచోట మౌళిక వసతులు లేవు. ఈ పాఠశాలల నిర్వహణను ప్రభుత్వాలు తలకు మించిన భారంగానే భావిస్తున్నాయి. మరోప్రక్క ప్రైవేట్-కార్పోరేట్ విద్యా సంస్థలు విస్తరించిన కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు లేరన్న కారణంతో కొన్ని పాఠశాలలను శాశ్వతంగా మూసివేసి అక్కడి విద్యార్ధులను, ఉపాధ్యాయులను దగ్గరలోని వేరొక పాఠశాలలో సర్దుబాటు చేయడం ద్వారా మెరుగైన విద్యను అందించవచ్చు, ఖర్చును తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ తీరును ఉపాధ్యాయ-విద్యార్ధి సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హేతుబద్దీకరణతో పాఠశాల విద్యావ్యస్థ బాగు పడుతుందనుకోవడం కూడా ఒక భ్రమ మాత్రమే.ముందు చూపులేని ప్రభుత్వాలు-ఉన్నతాధికారులు “లేడికి లేచిందె పరుగు” అన్నట్లు ఒకప్పుడు పాఠశాలల విస్తరణను చేపట్టి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అంతే వేగంతో హేతుబద్దీకరణకు పూనుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం అన్వేషించడం లేదు. చర్చా-విశ్లేషణ, సంవాదం – సమన్వయం లేకుండా చేపట్టే ఏ కార్యాక్రమాలైన/పథకాలైన ఇలాగే కొనసాగి ఆచరణలో విఫలం అవుతాయి. విస్తరణ లేదా హేతుబద్దీకరణ ముఖ్యం కాదు. అందరికి సమానమైన, నాణ్యమైన విద్యా అందుతుందా లేదా అనేది ముఖ్యం. విస్తరణ, హేతుబద్దీకరణ రెండు ఆనాలోచిత అసంబద్ధమైన విధాన నిర్ణయాలే. పుండోకటైతే మందొకటి వేసినట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది.విస్తరణ, హేతుబద్ధీకరణతో విద్యావ్యస్థలో ఏండ్ల తరబడి ఉన్న మౌలిక సమస్యలు తీరవు.పాఠశాలల విస్తరణ పేరుతో 30 ఏండ్లు కాలం గడిపిన ప్రభుత్వాలు, హేతుబద్ధీకరణ పేరుతో మరో 30 ఏండ్లు కాలం వెల్లబుచ్చాలని ప్రయత్నిస్తున్నాయి. క్రమ క్రమంగా పాఠశాలల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం ద్వారా ప్రభుత్వాలు ఖర్చును తగించుకోవాలని, బాధ్యతల నుండి తప్పకోవాలని చూస్తున్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయోనన్న భయంతో విద్యార్థులు-వారి తల్లిదండ్రులు అయోమయ (సంకట) స్థితిలో నలిగిపోతూ, నష్టపోతున్నారు. వివిధ వర్గాల ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు తాత్కాలికంగా వెనక్కు తగ్గినప్పటికి చాప కింద నీరు లాగ హేతుబద్దీకరణ అమలుకు పూనుకుంటుంది.విద్యా వ్యవస్థలో నెలకొన్న మౌళిక సమస్యలను, అనుబంధ సమస్యలను చర్చించి, పరిష్కరించకుండా “మాయల గారడి చేతిలో మంత్రదండం” లాగా హేతు బద్దీకరణను చూపడం, హేతుబద్ధీకరణ ఒక్కటే విద్యా వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా చూపడం ప్రభుత్వాల అవివేకానికి, అసమర్ధతకు నిదర్శనం. ఒక పాఠశాలను తీసి మరో పాఠశాలలో కలిపితే, వచ్చే ఫలితం సన్యాసి సన్యాసి రుద్దుకుంటే బూడిద రాలినట్లు గా ఉంటుంది. మొత్తం విద్యా వ్యవస్థలోనే అంతరాలు, అసమానతలు బలంగా ఉన్నప్పుడు ఒక పాఠశాలను మరోక పాఠశాలలో కలపడంలో ఉపయోగం ఏమి ఉండదు. లోప బూయిష్టమైన వ్యవస్థను మార్చకుండా పాఠశాలల విలీనంతో ప్రయోజనం శూన్యం. పాఠశాలల విస్తరణతో విద్యా వ్యవస్థ ఏమాత్రం మెరుగు పడలేదు. ఫలితాలు, ప్రమాణమాలు మరింతగా దిగజారిపోయాయి. విలీనంతో ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశించడం కూడా పొరపాటే. విలీనంతో విద్యా వ్యస్థలో దిగజారుతున్న ఫలితాల పరిణామ క్రమం తగ్గకపోగా, పెరిగిపోయే ప్రమాదం ఉంది. విస్తరణ-విలీనం (హేతుబద్దీకరణ) ను ప్రక్కన పెట్టి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఆలోచించాలి. సామాజిక, విద్యావేత్తల, మేధావుల, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించాలి. విద్యా వ్యవస్థలో ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని మౌలిక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. సమాజ నిర్మాణంలో ప్రధాన రంగాలైన విద్యా – వైద్య రంగాలను జాతీయం చెయడమే ఏకైక పరిష్కారం.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ పాత్రికేయుడు మునీర్ యాదిలో ఆయన పేరిట రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసిఓఏ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. కరీంనగర్ లోని ప్రముఖ రేని హాస్పిటల్, మంచిర్యాల మేడి లైఫ్, శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షలో సమస్యలు ఉన్న వారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు అధిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య శ్రీ కార్డు, లేదా ఇన్సూరెన్స్ ఉన్నవారు తమ యొక్క ఆసుపత్రి యాజమాన్యం వారికి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రత్యేక వైద్య నిపుణులు సూచించారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, 2డిఈకో, కంటి పరీక్షలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లతో పాటు పుర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్దెరాగడి లోని భీమ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో నూతన కమిటీని, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి అలుగుల సత్తయ్య, కోశాధికారి గా మేకల సురేందర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, ముఖ్య సలహాదారుగా పల్లె రాజు, ఉపాధ్యక్షులుగా సుధాకర్, మహేందర్, సత్తయ్య, సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తామని, సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే సంబంధిత బాధ్యులకు తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు.
ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన యుగంధర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ Academy of Motion Picture Arts and Sciences (AMPAS) లో 2025 క్లాస్‌లో సభ్యుడిగా చేరడంతో అంతర్జాతీయ స్థాయిలోఆయన గుర్తింపును సాధించారు. ఇప్పటివరకు 125కి పైగా చిత్రాలకు పని చేసిన ఆయన తన అద్భుత ప్రతిభతో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
1999లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన యుగంధర్ నాటి నుంచి తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగాన్ని కొంత పంతలు తొక్కించాడు.
ఆ రంగంలో నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. రంగస్థలం చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా తీర్చిదిద్దిన విజువల్స్, అల వైకుంఠపురము, దేవరలో యాక్షన్ సన్నివేశాల విజువల్స్ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక, దేశ వ్యాప్తంగా యుగంధర్‌కు మంచి పేరును తీసుకు వచ్చాయి.ఇదిలాఉంటే..
‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్ నుంచి కమల్ హాసన్ (Kamal Haasan)తో పాటు నటుడు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు ఉన్నారు.
పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో వీరు పాలు పంచుకోనున్నారు. దీంతో అకాడెమీ 2025 కమిటీలో యుంధర్ ఎంపికతో తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వీఎఫ్ఎక్స్ రంగానికి గర్వకారణమని, మరో సారి భారతీయుడి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయనను కొనియాడుతున్నారు.
అన్ని ఇండస్ట్రీల నుంచి ఆయనకు ప్రశంసల వెళ్లువెత్తుతున్నాయి.ఇకపై మన సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు.
కన్నప్ప అద్భుతం.. సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు
ఆదివారం ముగ్గురు తెలంగాణ మంత్రులు గచ్చిబౌలి ఏఎంబీ మల్టీప్లెక్స్ లో మోహన్ బాబు, విష్ణులతో కలిసి కన్నప్ప సినిమా వీక్షించారు.
మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప (Kannappa) చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది మిశ్రమ రివ్యూస్ ఇచ్చినా, ఇస్తున్నా కలెక్షన్ల పరంగా మాత్రం స్టేబుల్‌గానే ఉంది.
అయితే సినిమా ఫస్టాఫ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ సెకండాఫ్ మరో లెవల్‌లో ఉండి ప్రేక్షకకులను భక్తి ప్రపంచంలో తేల్చిందంటూ అనేక మంది తమ తమ సోషల్ మీడియాల ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో ఫ్యామిలీలు థియేటర్ల బాట పడుతున్నాయి.
సినిమా విజయంపై.. ఇప్పటికే మంచు విష్ణు సక్సెస్ మీట్ సైతం నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా ఆదివారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ ముగ్గురు గచ్చిబౌలి ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) లో మోహన్ బాబు, విష్ణులతో కలిసి కన్నప్ప సినిమా వీక్షించారు.
అనంతరం మంత్రి భట్టి మాట్లాడుతూ మోహన్ బాబు, విష్ణులకు అభినందనలు తెలిపారు.
సినిమా ఊహలకందని విధంగా ఉందని విష్ణు నటన, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అన్నారు.
ఆపై మత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..
తెలుగు చిత్ర సీమలో చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా వచ్చిందని అన్నారు.
మోహన్ లాల్, అక్షయ్ కుమా,ప్రభాస్ వంటి పెద్ద నటులను తీసుకువచ్చి మోహన్ బాబు, విష్ణులు మంచి చిత్రం అందించారని, ఈ సినిమా కేవలం శివ భక్తులే కాదు అందరూ పరవశించి పోయేలా చిత్రం ఉందని అన్నారు..
మున్మందు టాలీవుడ్ దర్శకులు కూడా ఇలాంటి సినిమాలు తీయాలని, తద్వారా మన సంస్కృతి, పురాణాల గురించి నేటి తరానికి తెలిసే అవకాశం ఉంటుందని తెలుపుతూ చివరకు కన్నప్ప టీంకు అభినందనలు తెలిపారు.
అల్లరి నరేశ్ తాజాగా మరో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కామెడీ హీరో నుంచి క్రమక్రమంగా విలక్షణ నటుడిగా, అల్ రౌండర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తోన్న అల్లరి నరేశ్ (Allari Naresh) తాజాగా మరో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా గతంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా (Family Drama) అనే డిఫరెంట్ సినిమా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న
ఈరోజు (సోమవారం) అల్లరి నరేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నరేశ్ సరసన బోల్డ్ భామ రుహానీ శర్మ (Ruhani Sharma) కథానాయికగా నటిస్తోండగా గిబ్రాన్ (Ghibran Vaibodha) సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు ఆల్కహాల్ (Alcohol) అనే పేరు ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ టైటిల్‌పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రరటించనున్నట్లు మేకర్స్ వెళ్లడించారు
శింబు, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో నాలుగేండ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం మానాడు.
హీరో శింబు (Simbu), వెంకట్ ప్రభు (Venkat Prabhu)కాంబినేషన్‌లో నాలుగేండ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం మానాడు (Maanaadu).
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో తరహా టైమ్ లూప్ కథ నేపథ్యంలో తెరకెక్కిన
ఈ మూవీ కరోనా తమిళ ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది.
ఆపై తెలుగులోనూ ఓటీటీ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది..
ఈ చిత్రం వచ్చి నాలుగేండ్లు పూర్తైనా ఇప్పటికీ
ఈ సినిమాలోని ఎస్జే సూర్య (S. J. Suryah) చెప్పే వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ డైలాగ్ చాలా ప్రాంతాలలో విరివిగా వినిపిస్తూ ఉంటుందంటే ఈ సినిమా జనాలలోకి ఎంతలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీయడానికి మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం హీరో శింబు, దర్శకుడు వెంకట్ ప్రభు మరోసారి జత కట్టబోతున్నారు.
ఈ సినిమాకు దసుమారు దశాబ్దంకి పైగా హిట్ లేక కెరీర్ ఎండ్ కార్డ్ పడుతున్న సమయంలో హీరో శింబు(Simbu) కు ఈ చిత్రం ఓ అమృతంలా ఆదుకోవడమే కాక అప్పటి వరకు శింబుకు ఉన్న స్టేటస్‌ను రెండింతలు రెట్టింపు చేసి అగ్ర స్థానంలో నిలిపింది.
దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అంచనాలు క్రమంగా ప్రారంభమయ్యాయి.
అయితే.. ప్రస్తుతం శింబు (Simbu), వెంకట్ ప్రభు ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ చిత్రాలు పూర్తి చేసిన అనంతరం తిరిగి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
తొలిభాగం నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి (Suresh kamatchi)
ఈ సీక్వెల్‌ను సైతం నిర్మించనుండగా మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెళ్లడించనున్నారు.
ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ మానాడు (Maanaadu) మొదటి చిత్రం తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇటీవల వచ్చిన కుబేర, కన్నప్ప చిత్రాలు మూడు గంటలకు పైగా నిడివి ఉన్నవే.
వాటిని ట్రిమ్ చేసే క్రమంలో ఒక్కో పాటను తొలగించారు. అయితే మూడు గంటల పాటు ఈ సినిమాలు ఉండటం విశేషం.
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కుబేర’ (Kubera). ఇది జూన్ 20వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. వీకెండ్ కల్లా ఈ మూవీ రూ.
వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నటీనటుల అభినయపటిమ గురించి అందరూ ఆహో… ఓహో అన్నారు. సినిమా థీమ్ కూడా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోందని కొందరంటే…
కమ్యూనిజాన్ని అండర్ కరెంట్ గా ప్రచారం చేసే ప్రయత్నం మేకర్స్ చేశారని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
సినిమా థియేటర్‌లు.
చిత్రం ఏమంటే… ఈ పాన్ ఇండియా మూవీ సెన్సార్ కు వెళ్ళినప్పుడు మూడు గంటల పదిహేను నిమిషాల పైనే ఉందట. అయితే… సెన్సార్ పరంగా కేవలం కొన్ని సంభాషణలను మ్యూట్ చేయమని, ఒకటి రెండు సన్నివేశాలను డెలిట్ చేయమని మాత్రం వారు చెప్పారట.
కానీ సెన్సార్ అయిన తర్వాత ఫైనల్ కాపీ ఇచ్చేప్పుడు మేకర్స్ వాళ్ళంతట వాళ్ళే ఇందులోని ఓ పాటను, కొన్ని సన్నివేశాలను తొలగించారట. రశ్మిక మందణ్ణ పై చిత్రీకరించిన ‘పి…పి… ప్పీ డుమ్ డుమ్ డుమ్’ అనే పాట మూడున్నర నిమిషాల నిడివి ఉంటుంది.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో హీరోయిన్ ను ఆటపట్టించినప్పుడు వచ్చే పాట ఇది. సినిమా నిడివిని తగ్గించే క్రమంలో ఈ పాటను మేకర్స్ తీసేశారు. అలా 3 గంటల 2 నిమిషాలతో ఫైనల్ వర్షన్ ను లాక్ చేశారు.
కుబేర’కు వారం తర్వాత వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా విషయంలోనూ ఇదే జరిగిందట. ‘కన్నప్ప’ సినిమా నిడివి కూడా సెన్సార్ కు వెళ్ళినప్పుడు మూడు గంటల పదిహేను నిమిషాల పైనే ఉందట.
కానీ థియేట్రికల్ వర్షన్ మూడు గంటల మూడు నిమిషాలే ఉంది.
ఈ చిత్రానికి కూడా సెన్సార్ వారు
కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని సంభాషణలను మ్యూట్ చేయమని, విలన్ తలను హీరో నరికే సీన్ ను కొన్ని సెకన్ల పాటు డెలిట్ చేయమని చెప్పారట. అయితే ఇది డివోషనల్ సబ్జెక్ట్ కావడం, విడుదలకు ముందే వివాదాలకు తెర తీయడంతో ఎందుకైనా మంచిదని ఆర్. సి.కి రిఫర్ చేసినట్టు తెలిసింది.
ఇక ఈ సినిమాలోని కొండ జాతుల గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న పాటను చివరి నిమిషంలో మేకర్స్ వాలెంటరీగా డెలీట్ చేశారట. అలానే ప్రధమార్థంలోనే కొన్ని యాక్షన్స్ సీన్స్ నిడివిని కూడా వారే తగ్గించారట.
దాంతో ఇటు ‘కుబేర’లోనూ, అటు ‘కన్నప్ప’లోనూ దాదాపు పదిహేను నిమిషాల నిడివి తగ్గిపోయింది.
రేపు ఈ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేప్పుడు పూర్తి సినిమాను వీక్షకులకు చూపించే ఆస్కారం లేకపోలేదు.
అయితే ఇంత భారీగా పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమాలను చివరి నిమిషంలో ఎడిటింగ్ చేసి, ట్రిమ్ చేయడం అంటే… సినిమా మేకింగ్ పట్ల మేకర్స్ కు సరైన స్పష్టత లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఓ పాట చిత్రీకరణకు లక్షల రూపాయలు, కొన్ని సార్లు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అలాంటిది సినిమా నిడివి పెరిగిందనో, మూవీ ఫ్లో కు అడ్డం వస్తుందనో పాటను తీసేయడం అంటే… స్క్రిప్ట్ మీద పట్టు లేకపోవడమే కదా! అని వారు అంటున్నారు.
ప్రీ ప్రొడక్షన్ లోనే పర్ ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాసుకుని, బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా తీసి ఉంటే… ఇలా వేస్టేజ్ జరిగి ఉండేది కాదని హితవు పలుకుతున్నారు.
‘క’, దిల్ రూబా వంటి చిత్రాల తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న నూతన చిత్రం కే ర్యాంప్.
‘క’, దిల్ రూబా వంటి చిత్రాల తర్వాత హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న నూతన చిత్రం కే ర్యాంప్ (K Ramp). ‘సామజవరగమన2, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాల తర్వాత హాస్య మూవీస్ సంస్థ (Hasya Movies) అధినేత రాజేశ్ దండా (Rajesh Danda) ఈ సినిమా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని (jains nani) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐదు నెలల క్రితమే ఈ చిత్రం స్టార్ట్ అవడమే గాక షూటింగ్ శరవేగంగా జరిగిపోతుంది.
సినిమా థియేటర్‌లు
కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా (Yukti Thareja) నటిస్తుండగా చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి కిరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్‌లో లవ్ సింబల్ మంటల్లో ఉండగా దాని ఎదుట హీరో లుంగీలో నవ్వుతూ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. కాగా పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో కమల్ హాసన్ ఆస్కార్ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే…
హీరో కమల్ హాసన్ ఆస్కార్ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే విషయమని ప్రశంసించారు. ‘‘ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా పద్మభూషణ్ కమల్ హాసన్ ఎంపికవ్వడం భారతీయ సినీరంగం గర్వించదగ్గ విషయం. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన నటుడిగా, దర్శకుడిగా, కథకుడిగా భారతీయ, ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేశారు. సినిమా మేకింగ్ విషయంలో ఆయనకు ఉన్న పట్టు స్ఫూర్తిదాయకం. ప్రపంచ సినిమాకు ఆయన ఇలాగే మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్ నుంచి కమల్ హాసన్‌తో పాటు నటుడు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు ఉన్నారు. హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో వీరు పాలుపంచుకోనున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.