నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025.

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించబడుతున్న నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (NSPC)-2025 పోస్టర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా lAS సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకుపర్యావరణ పరిరక్షణ లో భాగంగా నీటి సంరక్షణ, చెట్లు నాటడం, మరియు తడి పొడిచెత్త వేరుచేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలని మరియు క్విజ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య DYSO రాందాస్ పాల్గొన్నారు.
“HARIT – The Way of Life” అనే నినాదంతో ఈ పోటీ July 1 నుంచి August 21, 2025 వరకు దేశవ్యాప్తంగా జరుగనుంది. August 30న ఫలితాలు ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనవచ్చని వారు సూచించారు.
ఈ పోటీని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు.
పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీకి సంబంధించిన నమోదుకు, క్విజ్ పోటీకి సంబంధిత లింకులు కూడా విడుదల చేశారు.పోటీ గమ్యం: విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన లింక్ పోటీ
https://ecomitram.app/nspc/
వెబ్సైట్లో విద్యార్థులు చూడవలసిందిగా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version