ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి…

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు…

నేటి ధాత్రి –

 

 

 

మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి లకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,కందునూరి శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కత్తి సత్యం గౌడ్, సంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

నేటి ధాత్రి-గార్ల:-

 

 

 

 

సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

నేటి ధాత్రి -గార్ల :-3

 

 

 

భూస్వాములు,బడా రైతులు గార్ల పెద్ద చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారని, అక్రమంగా భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారుపెద్ద చెరువు భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ, చెరువు భూములు కబ్జా చేయడంతో చెరువు విస్తీరం తగ్గిపోవడం మూలంగా నీటి నీల్వ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.కబ్జాదారులు చెరువులో ఎక్కువ లోతులో బావులు, బోర్లు, కరెంటు స్థంబాలు ఏర్పాటు చేసుకొని అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలు పండే గార్ల చెరువు, రెండుసార్లు నిండి అలుగు పోసినప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పెద్ద చెరువు శిఖం భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, ఇప్పటికే తప్పుడు పత్రాలు సృష్టించే పట్టాలు చేయించుకున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జి. సక్రు, మాన్య, యాకయ్య, సైదులు, వెంకన్న, వీరన్న, సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version