వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.

ఝరాసంగం: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిధిలో గల ఝరాసంగం రోడ్డు పై జర్నలిస్ట్ కాలనీ సమీపంలో రాకపొకలు సాగించే చిన్న మధ్య తరహా వాహనాలను ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూ రెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల పోలీసు సిబ్బంది వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి

డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురైనటు వంటి సందర్భాల్లో ఎన్నో కలు గుతున్నాయి మీరు ఆరోగ్యా న్ని పరిరక్షించడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తుల సంఘం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలలో ఏర్పాటుచేసి ఆరోగ్య పరిరక్షణ కొరకై రైతులు ఆరోగ్య పరిరక్షణ కొరకై పాటు పడుతుందని అన్నారు.ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. బుధవారం రోజు మెడికవర్ శరత్ ఐ విజన్ సహకారంతో గ్రామంలో 135 మందికి పరీక్షించగా ఇందులో 35 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేయునట్లు తెలిపారు అదేవిధంగా ఈసీజీ ద్వారా 45 మంది పరీక్షించు కోవడం జరిగింది.ఇంతటి సహాయ సహకారాలు అందిం చిన మెడికవర్ హాస్పిటల్ శరత్ ఐవిజన్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు కర్ర ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కిరణ్ మెడి కవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఎండి సర్జన్ , డాక్టర్ షఫీ, జనరల్ సర్జన్ డాక్టర్ జిన్నత్ రెడ్డి ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమంత్ ,పియు మేనేజర్ గుడమాల మానస చౌదరి, గ్రామ క్షేత్ర కార్యకర్తలు రవిచంద్ర, పోతు సునీల్,వంశీ , ప్రశాంత్  పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి : 

తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి, క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డి.ఈ. లలిత, ఏసిపి లు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version