ప్రకృతి వైపరీత్యాలనుంచి ప్రజల ప్రాణ,ఆస్తిరక్షణ కొరకు చర్యలు చేపట్టాలి…
అత్యవసర సమయంలో అధికారుల సమన్వయం అత్యంత కీలకము…
విపత్తు సమయంలో వేగంగా స్పందించాలి…
అప్రమత్తతతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి…
అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్…
నేటి ధాత్రి-మహబూబాబాద్:-
ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల ప్రాణ,ఆస్తి రక్షణ కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో స్థానిక సంస్థలు, మరియు రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్ లతో కలిసి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్ డిఆర్ఎఫ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సరైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు, సంసిద్ధత, ప్రతిస్పందన, మరియు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ డిఆర్ఎఫ్ బృందం త్వరలోనే జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 20 మందితో కూడిన సిబ్బంది నేటి నుండి ఆగస్టు 14వ తేదీ వరకు మునిసిపాలిటీలలో, గ్రామాలలో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో పాల్గొని విపత్తు సమయంలో తక్షణ సహాయం పై శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి, జెడ్పి సీఈవో పురుషోత్తం, డి ఆర్ డి ఓ మధుసూదన రాజు, ఎన్ డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్, ఏఎస్ఐ ప్రదీప్ కుమార్, నరేందర్ సింగ్, రెవెన్యూ,పోలీస్,అగ్నిమాపక, వైద్య ఆరోగ్య,పంచాయతీరాజ్, మునిసిపల్,విద్యుత్,రోడ్లు భవనాలు,తాగునీరు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.