నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ దే

పరకాల నేటిధాత్రి
పట్టణంలో గురువారంరోజున పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 4నూతన ఆర్టీసీ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని,2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ,కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని,త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారని,రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాల ద్వారా ఆర్టీసీ కి 6వేల కోట్లు లాభం వచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాం ట్లు,క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుకేంద్రాలు, డెయిరీ యూనిట్‌,ఇతర స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతోమహిళా సంఘాలు బస్సులు కొనుగోలు ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధప్రజా రవాణాకు సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని,మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.త్వరలో పరకాల డిపోకు మరిన్ని బస్ లు రాబోతున్నాయని,పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని,ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్
రవిచందర్,నాయకులు,ఆర్టీసీ సిబ్బంది,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 3 వ. మహాసభలు సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సమక్షంలో 21 మందితో నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికల్లో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా – ముశం రమేష్,అధ్యక్షులుగా, శ్రీరాముల రమేష్ చంద్ర,
ప్రధాన కార్యదర్శిగా,సూరం పద్మ,కోశాధికారిగా – జిందం కమలాకర్,ఉపాధ్యక్షులుగా దాసరి రూప , కావేటి సత్యం,లక్ష్మణ్ కార్యదర్శిలుగాబెజుగం సురేష్ ,బోనాల లక్ష్మి , కీసరి పుష్పల,కమిటీ సభ్యులుగా మాడుగుల మల్లయ్య , గట్ల సప్న , లింగంపల్లి జ్యోతి,గురజాల మమత, సులోచన,
వాణి,మానస తదితరులను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ నూతన కమిటీగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసి రాబోయే కాలంలో జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ₹4,000 పెన్షన్ అమలు కొరకై అదేవిధంగా బీడీ కంపెనీ యజమాన్యం బీడీ కార్మికుల శ్రమను విపరీతంగా దోపిడీకి పాల్పడుతుందని కార్మికులు పనిచేసినటువంటి బీడీల నుండి 2500 బీడీల కూలీని దోచుకోవడమే కాకుండా దీనితో పాటు అనేక రకాల కోతల పేరుతో కార్మికుల వేతనాల నుండి నెలకు దాదాపు ₹1000 రూ!! ల వరకు కట్ చేయడం జరుగుతుందన్నారు.
బీడీ పరిశ్రమ మరియు కార్మికుల పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీడీ కంపెనీల యజమాన్యాలు చేస్తున్న దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి రాబోయే కాలంలో నూతన కమిటీ పనిచేస్తుందని అన్నారు.కార్మికులందరూ కంపెనీ యజమాలకు,టేకేదారులకు భయపడకుండా ఐక్యం కావాలని సంఘం కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.

కొత్త రోడ్డు సరే సరి, కనీసం ఉన్న రోడ్లను బాగు చేయండి మహా ప్రభో.

కొత్త రోడ్డు సరే సరి, కనీసం ఉన్న రోడ్లను బాగు చేయండి మహా ప్రభో.

కేసముద్రం లో బి ఆర్ ఎస్ ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

అభివృద్ధి పేరిట కొత్త రోడ్లు వేస్తున్నాం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు, కనీసం ఉన్న రోడ్డు ను కూడా మరమ్మత్తు చేయలేక పోతున్నారని బి ఆర్ ఎస్ నాయకులు సోమవారం కేసముద్రం పట్టణం లో ధర్నా చేపట్టారు. ఇటీవలే మున్సిపాలిటీ గా మారిన కేసముద్రం కు రోడ్డు వెడల్పు లో భాగంగా కోట్ల రూపాయలు తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రస్తుత పట్టణ రోడ్ల దుస్థితి కనబడటం లేదా అని మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మండల బి ఆర్ ఎస్ పార్టీ రోడ్ల దుస్థితి పై చేపట్టిన ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటల పై నిప్పులు చెరిగారు. కేసముధ్రం మున్సిపాలిటీ పరిధి లోని ఉప్పరపల్లి రోడ్, అంబేత్కర్ సెంటర్, గాంధీ సెంటర్, మార్కెట్ బజార్, పూలే సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, కేసముద్రం విలేజ్ మైన్ రోడ్, తో సహా మొత్తం పట్టణపు రోడ్లన్నీ గుంతలు పడి, నీరు నిలిచి, వాహన చోదకులకు ఎంతో కష్టం అవుతున్నదని, పలు ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ… మోసపు మాటలతో గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై, ప్రజల ఇబ్బందులపై కొద్దిగానైనా దృష్టి సారించాలి అని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నీలం సుహాసిని దుర్గేశ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వీరు నాయక్, బి ఆర్ ఎస్ నాయకులు కొండ్రీడ్డి రవీందర్ రెడ్డి, సట్ల వెంకన్న, ముత్యాల శివకుమార్, నల్లా కిరణ్, తొనుపునూరి సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన…

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన పైడిగుమ్మల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T121657.839.wav?_=1

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కు నూతనంగా ఎస్ ఐ గ బాధ్యతలు తీసుకున్న నరేష్ కు పైడిగుమ్మల్ యువ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు కోహీర్ మండల్ లోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్, మాజీ ఎంపీటీసీ జ్ఞనారత్నం నాయకులు దావీదు యేసయ్య రామయ్య లక్ష్మయ్య బాలయ్య నర్సిములు ఆనందం కాంగ్రెస్ యువ నాయకులు మధు శాంసన్ అశోక్ సంపత్ సుమన్ మహేందర్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బన్నీ రాకేష్ భాస్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మ‌రో వైపు కొత్త ఆర్కిటెక్ట…

ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మ‌రో వైపు కొత్త ఆర్కిటెక్ట

విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా బిగ్ మూవీ “కింగ్డమ్” ప్రమోషన్స్ జోరుగా ప్రారంభ‌మ‌య్యాయి.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ (Kingdom)చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్‌కు మ‌రో వారం మాత్రమే స‌మ‌యం ఉండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి (Gautam Tinnanuri), అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముగ్గురు కలిసి కింగ్డమ్ బాయ్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుతున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారని విజ‌య్ దేవ‌ర‌కొండ వ్రాసుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను రేపు (శ‌నివారం) తిరుప‌తి ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ ( Samrajya) పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు.భాగ్యశ్రీ బోర్సే కథానాయిక న‌టించ‌గా స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపంచ‌నున్నాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. సితార బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.

పడకేసిన పారిశుద్ధ్యం..

పడకేసిన పారిశుద్ధ్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-94.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: అసలే వర్షాకాలం.. కొత్త కొత్త రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో జహీరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆర్టీసీ కాలనీలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ వెనకాల మురుగునీరు ఇళ్ల మధ్యలో చేరి పందులు నివాసాల ముందు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటికి తోడు దోమలు మురికిపై వాలి తినే ఆహారపదార్థాలపై వాలితే ప్రజలు రోగాల బారినపడే అవకాశముంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఝరాసంగం నూతన ఎస్సైగా క్రాంతి కుమార్ పటేల్.

ఝరాసంగం నూతన ఎస్సైగా క్రాంతి కుమార్ పటేల్.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-89.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల నూతన ఎస్సైగా క్రాంతి కుమార్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న ఎస్ఐ నరేష్ కొహీర్ మండలానికి బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎస్పై మాట్లాడుతూ.ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సమన్వయం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తూ, మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని అన్నారు.మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్య కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలియజేశారు.

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి..

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జైపూర్,నేటి ధాత్రి:

కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి. అలాగే సింగరేణి సంస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం నిర్ణయం తీసుకున్నా ముందుగా ప్రకటించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటులో గతంలో ఏం చేశారు.ఎలా చేశారు. తెలుసుకొని లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.ఈ విషయాన్ని ఇది వరకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తానని వివరించారు.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన క్రాంతి గారికి సన్మానించిన నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-83.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం పీఎస్ నుండి కోహీర్ పీఎస్ కి బధిలిపై వెళ్లిన”సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్ సర్” మరియూ పుల్కల్ పిఎస్ నుండి ఝరాసంగం పీఎస్‌లో “సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన క్రాంతి గార్లకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానం చేసి వీడ్కోలు పలికి ఝరాసంగం మండల నాయకులు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్ రెడ్డి, సిద్ధు పాటిల్, డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి నాయకులు లక్ష్మారెడ్డి,షకిల్ సర్, వై నాగేష్, ఎం విష్ణు, అమృత్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఝరాసంగం మండల రాఘవేంద్ర,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం మండల చింతలగట్టు శివరాజ్,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాంపూర్ ప్రకాష్,గంగారం నర్సింలు తదితరులు పాల్గోని ఎస్ఐ నరేష్ , పటేల్ క్రాంతి గార్లకు వీడ్కోలు మరియు స్వాగతం పలికారు..

కోహిర్ నూతన ఎస్సైగా టి. నరేష్….!

కోహిర్ నూతన ఎస్సైగా టి. నరేష్….!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-69.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండల ఎస్సైగా టి. నరేష్ ను ఝరాసంగం మండల పోలిస్టేషన్ నుండి కోహిర్ పోలిస్టేషన్ కు బదిలీ చేస్తూ జిల్లా పోలీస్ ఉన్నతధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు ఝరా సంగం మండల పోలిస్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వర్తించిన టి. నరేష్ కోహిర్ ఎస్సైగా బదిలీపై వచ్చారు ఇదివరకు కోహిర్ లో ఎస్సైగా విధులు నిర్వర్తించిన గోపతి సతీష్ (మల్టిజోన్ ఎంజడ్ II) అటచ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు.

లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునికి గన సన్మానం.

లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునికి గన సన్మానం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిగుళ్ల పల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కల్మచర్ల గోపాల్ కోశాధికారి మిరియాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ద్వారా సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, కర్మచల రమేష్, గోవిందు శీను, జూలూరి రఘు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 21:

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్, ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా పలమనేరుకు చెందిన కత్తి శ్రీనివాసులు అధ్యక్షులు గా కే నాగరాజు విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా కె, శివ కుమార్ కార్యదర్శి వి రమేష్ ట్రెజరర్ శ్రీనివాసులు ఈసీ మెంబర్స్ ఏకనాథ్, పి రమేష్, గిరిబాబు,ఆర్ కృష్ణప్ప, సి మురగయ్య ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దళితుల హక్కుల పట్ల నిర్లక్ష్య వైఖరి పై పటిష్టమైన అవగాహన కలిగి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈ కమిటీలో ఎంపిక చేయడం జరిగిందని రాబోవు రోజుల్లో చిత్తూరు జిల్లా లో ఎక్కడ దళితులపై దాడులు జరిగిన వారి హక్కులను కలరాల్సిన తక్షణమే ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని తెలిపారు అధ్యక్షులుగా ఎన్నికైన కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ దళిత వివక్షతను అదేవిధంగా వారి హక్కులను భంగం కలిగించే ఎక్కడైనా సరే ఈ కమిటీ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు, అతి త్వరలో పలమనేరు లో భారీగా సభ ఏర్పాటు చేసి దళిత హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేస్తామని కూడా ఆయన తెలిపారు..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Collector Sandeep Kumar Jha

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Collector Sandeep Kumar Jha

కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-63.wav?_=6

హన్మకొండ, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ నగర పరిధి, మడికొండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య (సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్ లు సి.ఎన్.జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో నూతన బొగ్గు బాయిలు ఏర్పాటు చేయాలి..

సింగరేణిలో నూతన బొగ్గు బాయిలు ఏర్పాటు చేయాలి

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని బాతల రాజన్న భవన్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య
మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 21 అండర్ గ్రౌండ్ లో నడుస్తున్నాయి గత మూడు సంవత్సరాల కాలం నుండి సింగరేణి అధికారులు అండర్ గ్రౌండ్ గనులు లాస్ లో నడుస్తున్నాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు
ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను లాసు చూపించి భవిష్యత్తులో ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చే కుట్ర జరుగుతుందని కార్మిక వర్గం ఆందోళన గురవుతుంన్నారు
గత నాలుగు నెలల క్రితం బలరాం నాయక్ సింగరేణికి నూతనంగా సింగరేణి డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో పర్యటించిన సందర్భంగా అండర్ గ్రౌండ్ గనులు లాస్ లో నడుస్తున్నాయి అధిక బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలని కార్మికులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కార్మికులు క్లుప్తంగా డైరెక్టర్ కి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలుచెప్పడం జరిగింది
SDL,LHD, యంత్రాలు పాతబడిపోయినాయి కొత్త యంత్రాలను సప్లై చేయాలని యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ నాసిరకం సప్లై చేస్తున్నారు అండర్ గ్రౌండ్ గనులకు స్టవింగ్ కోసం ఇసుక సప్లై కావడంలేదని ట్రబ్బులు తక్కువగా ఉన్నాయని కొత్త ట్రబుల్ సప్లై చేయాలని
అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పనిముట్లు కూడ నాసిరకం సప్లై చేస్తున్నారని అనేక సమస్యలు డైరెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇట్టి సమస్యలు అన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పిన డైరెక్టర్ నాలుగు నెలల సమయం గడిచినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోకపోవడంలో అంతరాయం ఏమిటి ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల లాభాలు నస్తున్నయి అండర్ గ్రౌండ్ గనుల ను కంపెనీ ఎందుకు పట్టించుకోవడం లేదు
అంటే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ గనులు అన్నిటిని కూడా ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చే కుట్ర జరుగుతుందని ఇప్పటికే ఉత్తర తెలంగాణలో 9 ఓపెన్ కాస్ట్ గనుల తోటి బొందల గడ్డలుగా తయారైంది పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ గనులు బంద్ చేసి ఓపెన్ కాస్ట్ గనులు తవ్వితే భవిష్యత్తులో భావితరాలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఉత్తర తెలంగాణ ఎడారిగా మార్తదని రాష్ట్రప్రభుత్వం కంపెనీ ఇలాంటి ఆలోచనలను మానుకొని అండర్ గ్రౌండ్ గనులను పూర్తిస్థాయిలో నడపాలని భవిష్యత్తులో కూడా ఓపెన్ కాస్ట్ గనులు తీయకుండా నూతనంగా అండర్ గ్రౌండ్ గానులు తవ్వి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గట్టయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపెనీని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాదరెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
ఎండి సాజిత్
యుగేందర్
నరసింహారెడ్డికి
లక్ష్మీనారాయణ
రవి
తదితరులు పాల్గొన్నారు

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి..

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-45.wav?_=7

జయశంకర్ భూపాలపల్లి నూతనంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన కోట రాజబాబు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఉమ్మడి రేగొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

రద్దు ఆఘమేఘాలమీద.కొత్తవి డిఎస్ పెండింగ్.

రద్దు ఆఘమేఘాలమీద.కొత్తవి డిఎస్ పెండింగ్.

◆- నూతన రేషన్ కార్డుల పంపిణీపై లబ్ధిదారుల్లో అసంతృప్తి

◆- ప్రభుత్వం కావాలనే కార్డులు నిరాకరిస్తోందని ఆరోపణ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-38-1.wav?_=8

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం,మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించగానే అర్హులైన లబ్ధిదారులు తాము ఇప్పటివరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలగించించుకొని, కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా వివాహితులు మరియు స్వతంత్రంగా వేరుగా నివసిస్తున్న యువకులు పెద్ద సంఖ్యలో తమ పేర్లు పాత రేషన్ కార్డుల నుండి తొలగించించుకున్నారు.

అయితే, దరఖాస్తు చేసిన తర్వాత చాలామంది “DS Pending” స్థితిలోనే ఉండిపోతున్నారు. దీనివల్ల కొత్త కార్డులు జారీ కాకుండా గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వమే కావాలనే కార్డులను ఇవ్వకుండా కుట్ర పన్నిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఝరాసంగం మండలంలో ఒక్కో గ్రామానికి కేవలం 10 నుండి 12 మంది దరఖాస్తుదారులకే “DS Pending” స్థితి లేదని చూపిస్తున్నారు. మిగిలిన అర్హులు ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ యువనాయకులు పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ,

> “ప్రభుత్వం కావాలనే నూతన కార్డులను నిలిపివేసి, వేలాది మంది అర్హులైన లబ్ధిదారులను విస్మరిస్తోంది. ఇది ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న చర్య. నూతన కార్డులపై ఉన్న DS Pending సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం,” అన్నారు.

ఉపాధి’కి కొత్త హాజరు షురూ.

‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ

◆:-‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ

◆:-రెండు పూటలా కూలీల ఫొటోలు

◆:-ఒక ఫొటో అప్లోడ్ చేస్తే సగం కూలి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉపాధి హామీ పథకం హాజరులో కేంద్ర ప్రభుత్వం
కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకనుంచి ఉపాధి హామీలు పనిచేసే కూలీలను ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఈ విధంగా రెండుపూటలా కూలీల ఫొటోలు అప్లోడ్ చేస్తేనే పనిచేసిన వ్యక్తికి పూర్తిగా కూలి డబ్బులు అందనున్నాయి.

ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫొటోలు

Central government orders

ఉపాధి హామీ పథకంలో హాజరు విధానాన్ని ఆన్లైన్ ద్వారా చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ ద్వారా ప్రతీరోజు కూలీల ఫేస్ రికగ్నేషన్ చేసి హాజరు తీసుకుంటున్నారు. అయితే పనికి ఆలస్యంగా వచ్చిన కూలీలు కూడా ముందు వచ్చిన కూలీలతో సమానంగా కూలి తీసుకుంటూ ఈ హాజరు విధానాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఇటువంటి పనులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీలో కొత్తగా ప్రవేశపెట్టిన హాజరు విధానాన్ని గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తీసిన ఫొటోలను మండలస్థాయిలో అధికారుల ఆదేశాల మేరకు ఫొటోలను డీఆర్డీఏకు కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది.

హార్డ్ డిస్క్ కొనుగోలుకు ఆదేశాలు.

కూలీల హాజరు కోసం తీసే ఫొటోలు విధిగా భద్రపరిచేందుకు హార్డ్ డిస్క్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా చేపట్టే సోషల్ ఆడిట్ పూర్తయ్యేంతవరకు ఆ ఫొటోలను ఆ డిస్క్ నిక్షిప్తం చేసి ఉంచాలి.

Central government orders

వ్యతిరేకిస్తున్న కూలీలు సిబ్బంది..

ఉపాధి హామీ హాజరుకు సంబంధించి కూలీలను రెండు పూటలా ఫొటోలు తీయాలన్న నిబంధనను అటు కూలీలతోపాటు ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త హాజరు విధానం వల్ల ఉపాధి పనులకు హాజరయ్యే వారి శాతం తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Collector

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

Collector

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన..

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్

Collector Jitesh V Patil, District SP Rohit Raj

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం మారుమూల పూసుగుప్ప గ్రామంలో కోటిన్నర వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్‌ ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా అధికారులను గ్రామస్తులు అభినందించారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj

24 గంటలు వైద్య సదుపాయాలు మరియు వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ రాజ్ వర్మ తహసిల్దార్ శ్రీనివాసు ఎంపీడీవో యాదయ్య ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు  పాల్గొన్నారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version