సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు. ఈ యొక్క సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు సురేష్ బుద్ధిష్ట్ర సొసైటీ నాయకులు సుభాష్, నర్సింలు, అశోక్, రాజు, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు.

జులై 2న బుద్ధుని నాటక ప్రదర్శన.

జులై 2న బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ జూలై 2-7-2025 బుధవారం సాయంత్రం 6:30 గంటలకు జహీరాబాద్ బస్టాండ్ పక్కనగల షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు బుద్ధుని నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ యొక్క నాటక ప్రదర్శనకు దాదాపుగా లక్షకు పైగా ఖర్చు అవుతుంది కావున ఈ యొక్క నాటక ప్రదర్శన నిర్వహించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరిని పేరుపేరునా కోరుచున్నాము అని నిర్వాహకులు తెలిపారు. ఫోన్ పే చేయవలసిన నంబర్ 9989069468

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర.

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర

భారత సాయుధ దళాల పనితీరును చూస్తుంటే గర్వంగా ఉంది

-పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది

-నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ దేశం మొత్తం గర్విస్తుంది

-సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

 

 

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరుపుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడాన్ని చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర.!

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల

రామడుగు నేటిధాత్రి:

సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version