అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

 

Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Pawan Kalyan congratulates Kamal Haasan: కెరీర్‌లో లెక్కకు మిక్కిలి వైవిధ్యమైన పాత్రలు ధరించి సినీ అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీరంగంలో దశాబ్దాల కృషి అనంతరం ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా ఆయనకు ఆహ్వానం లభించింది. పదుల కొద్దీ రాష్ట్ర, జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కమల్‌కు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డు-2025 కమిటీ సభ్యుడిగా పద్మభూషణ్ కమలహాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. ఆరు దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనా జీవితాన్ని గడిపిన కమల్ హాసన్ గారు కేవలం నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటుడిగా చిత్రనిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన అసాధారణమైన పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజమైన కళాత్మక నిపుణుడు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాకు ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను.’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

కల్వకుర్తి నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ & 33/11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , AICC/CWC చల్లా వంశీ చంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి స్వాగతం పలుకుతున్న సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పుల లక్పతి నాయక్ శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి నాయబ్ తహశీల్దారుగా.!

మొగుడంపల్లి నాయబ్ తహశీల్దారుగా మొహమ్మద్ జుబేర్ అహ్మద్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మొగుడంపల్లి మండల నూతన నాయబ్ తహశీల్దారుగా మొహమ్మద్ జుబేర్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇక్కడ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన పవన్ కుమార్ నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీ అయ్యారు. అతని స్థానంలో ఇంతవరకు నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కంప్టీ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన మొహమ్మద్ జుబేర్ అహ్మద్ ఇక్కడి మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీపై వచ్చి, బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నేటి ధాత్రి ‘ తో మాట్లాడుతూ తమ పరిధిలోని బాధ్యతలను సమర్ధవంతంగా నేరవేర్చడంలో తన వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటూ, ప్రభుత్వ పథకాల అమలుకు చర్యలు తీసు కుంటామని ఆయన చెప్పారు. తమ తహశీల్దారు వారి అనుమతితో ప్రధానంగా సన్నబియ్యం పథకం (ప్రజాపంపిణీ రేషన్ బియ్యం) అమలుతో పాటు భూ భారతి చట్టం అమలుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది సహకారంతో స్థానిక రెవిన్యూ సమస్యలను వెనువెంటనే ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ ఓఆర్ చట్టంపై రెవిన్యూ సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించడానికి ఈనెల 21వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రైతులు, అన్ని రాజకీయపక్షాల నాయకులు, అధికారులు, అనధికారులు విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.

స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..

*కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20:

నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version