ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రిన్సిపాల్ డా.బి.సంతోష్ డమార్

పరకాల నేటిధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే నాణ్యమని విద్యాబోదన అందుతుందని పరకాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సంతోష్ కుమార్ అన్నారు.అపార అనుభవం మరియు సెట్,నెట్,పిహెచ్డి పిడిఎఫ్ లాంటి విద్యా అర్హలు కలిగిన అజ్ఞ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే ఉంటారనే విషయాన్ని గమనించాలని చెప్పారు.దోస్త్ మొదటి ప్రక్రియ ఈ నెల 21 వతేదీతో ముగుస్తుండని ఇంటర్,డిప్లమ పూర్తి చేసిన విద్యార్థిని,విద్యార్థులు పరకాల మరియు పరిసర గ్రామలలోని వారు దోస్త్ కేంద్రంను సంప్రదించి అడ్మిషన్ పొందాలని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.వివరాలకు కళాశాల దోస్తీ కోఆర్డినేటక్ డా.మల్లయ్య చరిత్ర అధ్యాపకులు,పోస్తే టెక్నికల్ అసిస్టెంట్,కంప్యూటర్ అధ్యాపకులు డాక్టర్.దుప్పటి సంజయ్ కుమార్ లని సంప్రదించాలని తెలిపారు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు *పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పై సోమవారం సంబంధిత అధికారులతో మినీ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో మే, 22 నుంచి మే 29, 2025 వరకు ఇంటర్ తియరీ పరీక్షలు,జూన్ 03 నుండి 12 వరకు (ప్రాక్టికల్) ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని, మొదటి సం.2385 రొండవ సం.1478 మొత్తం 3863 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేయుటకు పోలిస్ స్టేషనలో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని,పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.

జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని, జిల్లాలోని రెవెన్యూ శాఖ నుండి పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని , 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరి అయిన విదంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చేపట్టాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.

అదనపు ఎస్పీ చంద్రయ్య ,ఆర్డీవోలు రాధాబాయి వెంకటేశ్వరావు,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , విద్యా, వైద్య,ఫైర్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు
ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నూతన తాసిల్దారుగా కృష్ణవేణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన సైదులు ఖమ్మం జిల్లా కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రైతుల భూముల కు సంబంధించిన విషయాలు మరియు రెవిన్యూ కు సంబంధించిన విషయాలు ఇతర సమస్యల గురించి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ భూములను కాపాడండి.

ప్రభుత్వ భూములను కాపాడండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం సమర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రి మండలం లో మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి పై అధికారులకు, వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటేశ్వర్లు..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే
బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ
యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి.

సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య గారి 40 వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ పుర ప్రముఖులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్ గా నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య,14 ఏళ్ల వయసులోనే గాంధీ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగిందన్నారు. 1913లో మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగిందన్నారు. 1952లో పార్లమెంట్ సభ్యుడిగా, 1956లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొంది అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య అని తెలిపారు. పార్లమెంటుకు ఒక సామాన్య కార్యకర్తగా సైకిల్ పై వెళ్ళిన ఘనత సుందరయ్యకె దక్కుతుందని అన్నారు. అటు రైతు సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పారా తోలడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి సుందరయ్య గారేనని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రా న్ని సుందరయ్య నగర్ గా నామకరణ చేసుకోవడం మాకు గర్వాంగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు దుబాల వెంకటేశం,బత్తుల రమేష్, సుంచు ప్రకాష్. రాపెల్లి రమేష్,గాలిపెళ్లి సురేష్, కట్ల సతీష్, బొజ్జ శ్రీనివాస్,లింగంపల్లి దేవయ్య,మార్గం లక్ష్మణ్,సూరం వినయ్,ఆడెపు సత్తయ్య,
ఆడెపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు

ఆదర్శ నేతపుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి.

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి

 

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు

 

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..

 

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు.

పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం దగ్గర సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.

కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు.

సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారని అన్నారు.

సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.

స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.

సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు.

తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుందరయ్య ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడన్నారు.

నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం.

ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లులో ముఖ్యులు సుందరయ్య అని ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడని అన్నారు.

భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమనేత అని చెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.

పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.

పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారని, పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు.

ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు.

చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కంది కొండ రాజు బేంబెలి మలహల్ రావు, కలకోట అనిల్, ఎండీ ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,రుద్రరపు లక్ష్మి నాయకులు జగన్నాధం కార్తీక్, గణిపాక ఇంద్ర,యాక లక్ష్మి, ఎల్లయ్య, సంతోష్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ గాజుల బాలకిష్టయ్య మనవరాలు లక్ష్మి (రమ్యశ్రీ )-భగత్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాలోన్నారు.

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

విజయవంతమైన 19వ వార్షిక మహాసభ..

10 వ సారి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం 19 వార్షిక మహాసభ సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. 2024 జనవరి నుండి 2025 మార్చి నెల వరకు సంఘంలో జరిగిన లావాదేవీలు,ఆస్తుల వివరాల పట్ల నివేదిక రూపంలో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టారు. పొదుపు సంఘంలో నిర్వహిస్తున్న వివిధ ఖాతాల పట్ల మహాసభలో చర్చించి సంఘం అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలతో చర్చించుకున్నారు.

cooperation

2025 మార్చి నెల వరకు 410 మంది సభ్యులతో రూ. 60 లక్షల 76 వేల 567 నిధులు ఉన్నట్లు గణకుడు ఏడెల్లి మహేందర్ రెడ్డి తెలియజేశారు.ముఖ్య అతిథులుగా హాజరైన సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ సంఘం సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సభ్యుల ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల కుమారస్వామి పేర్కొన్నారు. ఉత్తమ సంఘ సభ్యునిగా ఎన్నికైన వరంగంటి ప్రవీణ్ రెడ్డి, ఉత్తమ పాలకవర్గ సభ్యులు భాషబోయిన రాజు, ఉప్పుల రాజు, బానోతు రమేష్,కందుల శ్రీనివాస్ గౌడ్ లకు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

2025 – 26 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం ఎన్నికల నిర్వహించగా సంఘం అధ్యక్షులుగా కందుల శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా వడ్డేపల్లి మృత్యుంజయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ప్రకటించారు.

cooperation

అధ్యక్షుడిగా 10వ సారి ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

చంద్రయ్యపల్లి గ్రామంలో సహకార వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్ర పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులుగా వరుసగా పదవసారి ఎన్నికయ్యారు. తన ఎన్నిక పట్ల మరింత బాధ్యత పెరిగిందని అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, భాషబోయిన రాజు, పాక రాజయ్య, సలపాల ప్రభాకర్, భాషబోయిన చరణ్ రాజ్,మామిడి ఐలయ్య,ఉప్పుల రాజు,బానోతు సాంబయ్య,అజ్మీర జితేందర్, సయ్యద్ బషీర్ తోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం కాంగ్రెస్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి తెలిపారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి* నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు చిట్యాల మండల కేంద్రం కార్యకర్తలు నాయకులు జిల్లా, మండల నాయకత్వం సమావేశంలోచిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్* ఏకగ్రీవంగా రెండోసారి జరిగింది. ఈ సందర్భంగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా ఎన్నిక కుసహకరించిన ఎమ్మెల్యేకు జిల్లా నాయకులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల టౌన్ ఎంపీటీసీ లా పరిధి ఇంచార్జ్ లు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు జయశంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలకల రాయకుమురు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు చిలుములరాజమౌళి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తిరెడ్డి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని బిజెపి నాయకులు సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూత న వధూవరులను ఆశీర్వదిం చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందు పట్ల కీర్తి రెడ్డి నూతన దంపతు లను అక్షింతలు వేసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు చదువు రామచంద్రా రెడ్డి మండల అధ్యక్షులు నర హరి శెట్టి రామకృష్ణ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ కానుగుల నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు సుధాకర్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ బిల్లా రాజ్ కుమార్ దేశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం పరామర్శ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘము సంయుక్త కార్యదర్శి బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన జువ్వెంతుల లక్ష్మారెడ్డి ఈరోజు గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి జిల్లా రెడ్డి సంఘము తరపున దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితో పాటుగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంత రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి రామన్నపేట మాజీ సర్పంచ్ కమటం అంజిరెడ్డి,రెడ్డి సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏమి రెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. nimz జి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఝరసంగం మండలంలోని కేంద్రీయ విద్యాలయం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆల్గల్ రోడ్డు, బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఆదివారం రోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ దీర్ఘకాలకు సెలవు పై వెళ్లడం వలన మునిసిపల్ జరుగు అభివృద్ధి కార్యక్రమాలు పాలనపరమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు ఏర్పడుతుంది. కేవలం కొద్దిరోజుల వరకే కమిషనర్ లీవ్ లో వెళితే బాగుండేది కానీ దీర్ఘకాలం సెలవు పై వెళ్లడం వలన 39 వార్డులతో ఉన్న సిరిసిల్ల పట్టణం చాలా పెద్ద మున్సిపల్ గా ఉన్న వ్యవహారాలలో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నవి. మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన ఎదురు కావడం పాలకవర్గం లేకపోవడంతో ఎవరు కూడా దీని మీద శ్రద్ధ కనబడుచుక పోవడం ఒకింత బాధ కలిగించి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో కమిషనర్ నియమించాలి కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేసి పూర్తి కలెక్టర్ నియమించాలి పాలన పాలనమైన వివారాలల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కమిషనర్ నియమించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యం కార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చీకోట అనిల్ సహాయ కార్యదర్శి, కుసుమ గణేష్ కోశాధికారి చెప్ప దేవదాస్ సభ్యులు, నల్ల మురళి మేము ప్రజల పక్షాన కమిషనర్ నియమించాలని కోరుతున్నాము.

బసవేశ్వరుడు ఆదర్శనీయుడు..!

బసవేశ్వరుడు ఆదర్శనీయుడు..!

◆ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: జగద్గురు మహాత్మా బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఆదివా రం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని బర్దిపూర్, మల్లన్న గట్టు, ధనశ్రీ పీఠాధిపతులు సిద్దేశ్వర స్వామి, బసవలింగ, వీరేశ్వర శివాచార్య లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించేందుకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ నాయకులు పరమేశ్వర్ పాటిల్, సంగమేశ్వర్, వినీల నరేష్, చంద్రయ్యతో పాటు వివిధ గ్రామా భక్తులు పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన కార్యక్రమం జరగనుంది.

◆ – ఈ చారిత్రాత్మక నిరసన సమావేశానికి మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షత వహిస్తారు,మౌలానా అబూ తాలిబ్ రెహమానీ మరియు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారం కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖైమి, వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉద్యమం సమాచారం ప్రకారం, వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారంలో భాగంగా, తహాఫుజ్ దస్తూర్ మరియు అవుకాఫ్ సమావేశం అనే ఆల్ పార్టీ గ్రాండ్ చారిత్రాత్మక నిరసన సమావేశం సంగారెడ్డి జిల్లా స్థాయిలో మే 24, 2025 శనివారం, అస్ర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది, దీనిలో ప్రత్యేక అతిథులుగా ఖతీబ్ షోలా బయాన్ హజ్రత్ మౌలానా అబూ తాలిబ్ రెహ్మానీ, హజ్రత్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, అమీర్ జామియా నిజామియా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, సభ్యుడు పార్లమెంట్ హైదరాబాద్, మిస్టర్ అక్బర్ నిజామీ, హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్, జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు, హజ్రత్ మౌలానా హుసాముద్దీన్ జాఫర్ పాషా.హజ్రత్ మౌలానా గియాస్ అహ్మద్ రషాది సాహిబ్ హజ్రత్ మౌలానా షఫీక్ ఆలం జామి జమియత్ అహ్లే హదీస్ తెలంగాణ ప్రతినిధి ఖలీద్ ముబాషిర్-ఉల్-జాఫర్ అమీర్ జమాత్-ఇ-ఇస్లామి తెలంగాణ జియావుద్దీన్ నాయర్ అధ్యక్షుడు తమీర్-ఎ-మిల్లత్ శ్రీ అబ్దుల్ అజీజ్ MPI సయ్యద్ మతీనుద్దీన్: ఖాద్రీ సయ్యద్ మసూద్ హుస్సేన్ ముజ్తహిద్ అధ్యక్షుడు అంజుమాన్ మహద్వియ్య ముహమ్మద్ అలీ షబ్బీర్ సలహాదారుడు తెలంగాణ సురేష్ కుమార్ షస్కర్ పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ కె. మాణిక్ రావు అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ నియోజకవర్గం డాక్టర్ చంద్రశేఖర్ ఇన్-చార్జ్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తన్వీర్ మాజీ చైర్మన్ తంగానా అజ్మతుల్లా హుస్సేని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలంగాణ అఫ్జల్ హుస్సేన్ ఖుస్రో పాషా చైర్మన్ హజ్ కమిటీ తెలంగాణ అతి ముఖ్యమైన ప్రసంగాలు చేస్తారు. అదనంగా, ఇతర మతాల నాయకులు ప్రసంగాలు ఇస్తారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మౌలానా అతీక్ అహ్మద్ ఖాస్మీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, నజీముద్దీన్ ఘోరీ, అయూబ్, జమాతే ఇస్లామీ, అతిక్ హక్కానీ, అహ్లే హదీత్, అహ్లే హదీథ్, మిస్టర్, యూసుఫ్, ఆప్షన్ కమిటీ సభ్యుడు. బాష్మ్, దావత్ తబ్లీగ్ – హఫీజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్, జమియాత్ ఉలేమా, మిస్టర్ మౌల్వీ ఖాజీ జియావుద్దీన్, మిస్టర్ ఫర్హాన్ ఖాద్రీ, అహ్లే సున్నత్ వాల్ జమాత్, అబ్దుల్ మజీద్, సఫా బైతుల్ మాల్,జమీల్ అర్షద్
కాంగ్రెస్ పార్టీ, మొహియుద్దీన్ షేక్ ఫరీద్ టిఆర్ఎస్ పార్టీ. అథర్ సాహిబ్ అజ్మత్ సాహిబ్ వైస్ చైర్మన్ ఎంఐఎం ముఫ్తీ అబ్దుల్ బాసిత్ సాహిబ్ కోహీర్ మండల్, అబ్దుల్ మజీద్ సాహిబ్ హుజ్రా సంగం మండల్, బషీర్ అహ్మద్ సాహిబ్ హఫీజ్ ఖలీల్ మక్దం పాలి మండల్, ముఫ్తీ జమీర్ నియా లకల్ మండల్ మాట్లాడుతూ, ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత మరియు పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఇస్లాం సోదరులందరూ నిర్ణీత సమయంలో నిరసన సమావేశంలో పాల్గొని, తమ జాతీయ ఐక్యత మరియు మతపరమైన మద్దతును ప్రదర్శించి, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసుకోవాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్ గిరిధర్ రెడ్డి.

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన డా౹౹శేషు బాబు గారీ కుమారుల పుట్టు పంచేల కార్యక్రమంలో పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం,మంకాల్ బాంకేట్ హాల్ లో జరిగిన ధనసిరి రవీందర్ రెడ్డి బావమరిది రిసెప్షన్ వేడుకల్లో మరియు ఈద్గా ప్రెసిడెంట్ మజీద్ సోదరుని కూతురి వివాహం మరియు డా౹౹మహమ్మద్.సలావోద్దిన్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని వారికి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి నల్లా,బిలాల్ పూర్ సోసైటి చైర్మన్ రియాజ్,కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ నరేష్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజమియా,మాజీ కౌన్సిలర్లు రంగా అరుణ్,మోతిరాం నాయక్,జహీంగీర్,రాములు నేత,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గౌని శివకుమార్,ఇమామ్ పటేల్,మరియు తదితరులు పాల్గొన్నారు.

హజ్ యాత్రకు షేక్ ఫరీదుద్దీన్ ఘనంగా వీడ్కోలు.!

హజ్ యాత్రకు షేక్ ఫరీదుద్దీన్ ఘనంగా వీడ్కోలు పలికిన ముస్లింలు సోదరులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు షేక్ ఫరీదుద్దీన్ హజ్ యాత్రకు బయలుదేరిన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అధ్యక్షుడు ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు.శాలువాలు, పువ్వులు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్తున్న యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు దేశ ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు! ఉద్యోగులు వేధించుకు తింటున్నారు!!

-మిల్లర్లను వేదించొద్దన మంత్రి, కమీషనర్‌ ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు ఆగమౌతున్నారు.

-పై స్థాయి అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు.

 

-ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసుపాలు చేస్తున్నారు.

-మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహలకు కారకులౌతున్నారు.

-ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.

-సన్న బియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలకు ఉద్యోగులే తెర తీస్తున్నారు.

-చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలాడుతున్నారు.

-మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి, ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతున్నారు.

-లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు.

-అడిగినంత ఇవ్వలేని చిన్న మిల్లర్లకు ఉద్యోగులు నరకం చూపిస్తున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు నష్టాల బారిన పడి అప్పుల పాలౌతున్నారు.

-అధికారులకు లంచాలివ్వలేక మిల్లర్లు నలిగిపోతున్నారు.

-కొత్తగా ఎవరైనా మిల్లులు ఏర్పాటు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.

-ఇండస్ట్రీస్‌ను కాపాడాల్సిన అధికారులు చిన్న మిల్లర్లను చంపేస్తున్నారు.

-డిటి స్థాయి ఉద్యోగులు కూడా మిల్లర్లను అల్లాడిస్తున్నారు.

-ఒక రకంగా ఏడిపించుకు తింటున్నారు.

-కోట్ల రూపాయల అప్పులు చేసి మిల్లులు పెట్టుకుంటే వడ్లు కేటాయిండం లేదు.

-నెలనెల మిల్లర్లు లక్షల రూపాయలు అప్పులు చేసి బ్యాంకుల వడ్డీలు చెల్లించుకుంటున్నారు.

-ప్రభుత్వ ఆదేశాలను డిటి స్థాయి ఉద్యోగి కూడా లెక్క చేయడం లేదు.

-డిఎం, డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడ్డారు.

-అన్యాయాలకు తెగబడుతున్నారు.

-మిల్లర్లకంటే మించిన ఆస్థులు సంపాదించుకుంటున్నారు.

-దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ ఫర్లు లేకుండా తిష్ట వేసుకుని కూర్చున్నారు.

-ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే సివిల్‌ సప్లయ్‌ ఉద్యోగుల బండారం మొత్తం బైటపడుతుంది.

-అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిరచే వారి పీడ పోతుంది.

-జిల్లాల వారిగా డిఎం, డిఎస్‌ఓ, డిటిల అక్రమాలు, ఆస్తులపై త్వరలో వరుస కథనాలు మీ ‘‘నేటిధాత్రి’’ లో..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడం లేదన్నట్లు వుంది సివిల్‌ సప్లైశాఖలోని జిల్లా స్దాయి ఉద్యోగుల సంగతి. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఎంత చెప్పినా జిల్లా స్ధాయి ఉద్యోగులు పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. వారి ఆగడాలు ఆపడం లేదు. వారి దోపిడీ ఆడగం లేదు. ఆ శాఖ కమీషనర్‌ ఆదేశాలు కూడా జిల్లాల అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పొరపాటున రైస్‌ మిల్లర్లు కమీషనర్‌ ఇచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావిస్తే ఏకంగా ఆయన్నే వచ్చి వడ్లు కొనుగోలు చేసుకొమ్మని చెప్పమని బిరుసు సమాదానాలిస్తున్నారట. వడ్లు ఆయననే కేటాయించమని అడగండి అంటూ మిల్లర్లను హేళనగా మాట్లాడుతున్నారట. అంత బలుపు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు ఎదురు చెప్పలేక, వారి చెప్పిందానికల్లా తలూపలేక, అడినంత సొమ్ము ముట్ట చెప్పలేక రైస్‌ మిల్లర్లు విలవిలలాడిపోతున్నారు. అటు మిల్లులు నడవక, ఇటు ఉద్యోగులు అడిగినంత ముట్ట జెప్పలేక మిల్లులు మూసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని మధనపడుతున్నారు. జిల్లాల్లో డిటి నుంచి మొదలు, డిఎం వరకు వున్న ఉద్యోగుల మూలంగా చిన్న రైస్‌ మిల్లర్లు చితికిపోతున్నారు. వేదించుకు తింటున్న ఉద్యోగులను తట్టుకోలేకపోతున్నారు. లక్షలకు లక్షలు డిమాండ్‌ చేస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఐదు లారీల వడ్లు కేటాయించడం కోసం రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదు లారీల వడ్లను బియ్యంగా మార్చి అమ్మితే వచ్చే లాభమే లక్ష అయితే, ఉద్యోగులకు రూ.5లక్షలు ఎలా చెల్లించలేక మిల్లులు మూసుకుంటున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఉద్యోగులు పాల్పడుతున్నా పై స్ధాయి అదికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలు కమీషనర్‌ వరకు చేరకపోతున్నాయి. కొంత మంది మిల్లర్ల అసోసియేషన్‌ ముఖ్యలు కూడా చిన్న మిల్లర్లను ఇబ్బందులు పెట్టాలనే చూస్తున్నారు. ఉద్యోగుల చేత వారిని మిల్లర్‌ సంఘాల ముఖ్యులు కూడా ఉద్యోగులకు సహకరిస్తున్నారు. నిజానికి మిల్లర్లకు సమస్యలొస్తే సహకరించాల్సిన మిల్లర్ల అసోసియేషన్‌ ఉద్యోగులతో లోపాయి కారి ఒప్పందాలతో చిన్న మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సన్న బియ్యం పధకం అమలు చేస్తోంది. దాని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వం కొంత ఉదారమైన విధానాలు అవలంబించాలని చూస్తోంది. పైగా సన్న బియ్యం పధకం దిగ్విజయంగా సాగాలన్న లక్ష్యంత కమీషనర్‌ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న మిర్లర్లు కోటి ఆపైన వున్న బకాయిలపై ఉద్యోగులు ఒత్తిడి చేయొద్దని, వారికి వడ్లు కేటాయించడంలో సమస్యలు సృష్టించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్దాయి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లలో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినా జిల్లా స్ధాయి ఉద్యోగులు అటు ప్రభుత్వం, ఇటు కమీషనర్‌ మాట కూడా లెక్క చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లు ఆగమైపోతున్నారు. రాష్ట్ర స్దాయి అదికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సివిల్‌ సప్లై శాఖ జిల్లా స్దాయి అదికారులు అబాసు పాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా కొన్ని జిల్లాల సివిల్‌ సప్లై ఉద్యోగులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అనేకం వెల్లువెత్తుతున్నాయి. చిన్న మిల్లర్లను ఎట్టి పరిస్దితుల్లో ఇబ్బందులకు గురి చేయొద్దని ఇప్పటికే కమీషనర్‌ పలు మార్లు హెచ్చరించారు. మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిలు వుండడమే కాదు, ప్రభుత్వం కూడా మిల్లర్లకు బకాయిలు వున్న మాట వాస్తవం. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో కోటిన్నర వరకు బకాయిలు వున్న ఏ మిల్లర్‌ను సమస్యలు సృష్టించొద్దని సూచించారు. అంతే కాకుండా ఆపై కూడా బకాయిలు వున్న మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అండర్‌ టేకింగ్‌ లెటర్లు తీసుకొనైనా వడ్లు కేటాయించాలని చెప్పినా ఉద్యోగులు వినడం లేదు. వాళ్ల వద్ద అలాంటివేమీ అవసరం లేదు. మాకెంతిస్తావన్న బేరాలు తప్ప ప్రభుత్వ ఆదేశాలను ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. మిల్లర్లకువేధింపులు ఆపడం లేదు. మిల్లర్లకు సహరించి, ప్రబుత్వ లక్ష్యాలిను నెరవేర్చాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగులు తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ ఒక సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం వుంది. వరంగల్‌ జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా ఒక మిల్లులను ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు 12 కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణం తెచ్చుకొని 9 నెలల క్రితం మిల్లు నిర్మాణం, మిషన్‌ ఏర్పాటు అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. ఇక మిల్లు నడిచేందుకు అవసరమైన వడ్ల పర్మిషన్‌ కోసం సివిల్‌సప్లై శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం పెట్టిన ధరఖాస్తు ఇంత వరకు ఆన్‌ లైన్‌ లో కూడా నమోదుచేయలేదు. ఆ ఫైల్‌ డిటి నుంచి పై అధికారి వరకు వెళ్లలేదు. తొమ్మిది నెలలుగా ఆ మిల్లర్‌ను తిప్పించుకుంటున్నారు. అతన్ని పిండాల్సినంత పిండేశారు. కాని ఫైల్‌ను పక్క టేబుల్‌కు కూడా కదల్చలేదు. అప్పటి నుంచి ఫైల్‌ గురించి డిటిని అడిగితే డిఎస్‌ఓ వద్ద వుందంటారు. డిఎస్‌ఓను అడిగే డిఎం.దగ్గరుందంటారు. డిఎంని అడిగితే కమీషనర్‌ కార్యాలయానికి చేరిందంటారు. ఇదిగో అదిగో అంటూ మిల్లర్‌ వద్ద నుంచి నొక్కేసేది నొక్కేస్తూనే వున్నారు. కాని ఆయన పని మాత్రం చేయలేదు. నెలకు రూ.9లక్షల రూపాయలు బ్యాంకు వడ్డీలు చెల్లిస్తూ, శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా తెలిసిందేమిటంటే అసలు ఆఫైల్‌ డిటీ టేబుల్‌ నుంచి కదల్లెదు. కనీసం ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదు. అంటే ఉద్యోగుల నిర్లక్ష్యం, అలసత్వం ఎలా వున్నాయో అర్ధం కావడం లేదు. ఈ విషయాన్ని ఆ మిల్లర్‌ పై స్ధాయి అదికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఫోన్‌ చేయిస్తే సదరు వ్యక్తి మీద కక్ష కట్టినంత పనిచేస్తున్నారు. పై స్దాయి అదికారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినా కిందిస్దాయి డిటీ, డిఎస్‌ఓలు కనీసం భయపడడం లేదంటే ఎలా తయారయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తిన్నది కాదని, మళ్లీ ఎంతిస్తావంటూ లెక్కలు చెబుతున్నారంటే ఉద్యోగులు అవినీతి ఏ స్ధాయికి చేరుకున్నదో తెలిసిపోతోంది. అంతే కాదు పై స్ధాయి నుంచి ఫోన్‌ రాగానే ఆన్‌లైన్‌ చేయాలా..మరో పది రోజులు తిప్పించుకుందాంలే..అంటూ ఆ వ్యక్తి ముందే ఉద్యోగులు మాట్లాడుకోవడం అంటే ఉద్యోగం పోతుందన్న భయం కించిత్‌ కూడా లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ ఉద్యోగులు ఎలాంటి ట్రాన్స్‌ఫర్లు లేకుండా పాతుకుపోయారు. మిల్లర్ల ఇచ్చే లక్షలకు బాగా అలవాటు పడ్డారు. మిల్లర్లను బెదిరించి వసూలు చేసే ఆదాయం కోట్లలో పేరుకుపోయింది. ఉద్యోగమంటే లెక్కలేకపోతోందని అంటున్నారు. ఉద్యోగులు తిరుపతి వెళ్లాలన్నా, అక్కడ వసతులు ఏర్పాటుకు అయ్యే ఖర్చులన్నీ మిల్లర్లే భరించాలి. ఇక ఎంజాయ్‌ మెంటు కోసం గోవా లాంటి విహర యాత్రలు ఉద్యోగులు చేయాలంటే కూడా మిల్లర్లు ఆ ఖర్చు భరించాల్సిందే అన్నంత దోపిడీ జరుగుతోంది. ఇదంతా భహిరంగ రహస్యమే అయినా మిల్లర్లను వేదించకుండా వుండలేదు. పెద్ద పెద్ద మిలర్లు, యూనియన్‌ ప్రతినిధులకు వడ్లు కేటాయించడం కోసం చిన్న చిన్న మిల్లర్లను లేకుండా చేయడం కోసం ఉద్యోగులు పని గట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. మిల్లర్‌ ఇండస్ట్రీ మరింత పెరిగేందుకు కృషి చేయాల్సిన ఉద్యోగులు ఆ వ్యవస్ధలో పెద్దల కోసం చిన్న చిన్న మిల్లులే లేకుండా చేయడం అంటే ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. పెద్ద మిల్లర్ల కోసం చిన్న మిల్లర్లను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు మిల్లర్లను మించిన సంపాదన పరులుగా మారిపోయారు. దశాబ్ధాల తరబడి ఒకే కార్యాలయంలో పనిచేస్తుండడంతో మిల్లర్లను వేధించడం ఎంతో సులువైపోతోంది. డిఎం స్ధాయి నుంచి డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడిపోయారు. కోట్లుకు కోట్లు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిపై ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే వారి బండారం మొత్తం బైట పడుతుంది. అలా అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిస్తున్న ఉద్యోగులపై జిల్లాల వారిగా వరుస కధనాలు త్వరలో …మీ నేటిధాత్రిలో వరుసగా…

గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.

చిట్యాల నేటిధాత్రి:

జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్*
ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు*
వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి
ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య*
సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు*
కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,*
ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*

error: Content is protected !!
Exit mobile version