మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న మెండి లతామంగేశ్వరి 8 సంవత్సరాలుగా ఓదెల ఏపిఎం గా బాధ్యతలు చేపట్టి ఈ రోజు బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఏపీఏంగా బదిలీపై వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు గ్రామ సంఘం అసిస్టెంట్లు మరియు సిబ్బంది అందరూ ఏపియం ని శాలువాలతో సన్మానించి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ రాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్ ,పవన్, భవాని, రమేష్, రాము మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి , పి.అనూష, జెఅనూష మరియు విఓ అధ్యక్షురాల్లు, వివోఏ లు పాల్గొనడం జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T152642.831.wav?_=1

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కవి, రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కవులు పుష్పాంజలి ఘటించడం జరిగినది. సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి మాట్లాడుతూ హనుమాజీ పేటలో జన్మించి, సాహిత్యపూల తోటలో విరబూసి ఆలిండియా కే గర్వకారణం తెచ్చిన సిరిసిల్ల ముద్దుబిడ్డ సినారే జ్ఞానపీఠం పురస్కారం తెచ్చిన మహాకవి అని తెలిపారు. అలాగే రచయితల సంఘం ఉపాధ్యక్షులు బూర దేవానందం సి.నారాయణ రెడ్డి పై కవిత గానం చేశారు. ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో రాబోయే నూతన కవులకు ఒక దిక్సూచి అని తెలిపారు. అంతేకాకుండా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో జన్మించడం మా సిరిసిల్ల కే గర్వకారణమని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు ఎలాగొండ రవి, బుర దేవానందం, వెంగళ లక్ష్మణ్,చిటికెన కిరణ్ కుమార్ ఆడేపు లక్ష్మణ్,అంకారపు రవి, గుండెల్ని వంశీ, అల్లే రమేష్ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో..

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T141432.971.wav?_=2


నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ. 1.30 కోట్లు మంజూరు. చేసిందని, భూమి పూజ చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. మోడల్ స్కూల్,కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాల కు ఈ. దారిలో వెళ్లే విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంబించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్,ఎగ్యారపు జలందర్, గడ్డం జీవన్ రెడ్డి,ప్రసాద్,కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులుపాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ..

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-80.wav?_=3

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం పురపాలక సంఘం ఆవరణంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భారతీయ మజ్దూర్ సంఘం ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి మునుగంటి సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీను గౌడ్, అదేవిధంగా బిఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు రాము, రాఘవేందర్, పురుషోత్తం ప్రవీణ్ మరియు బిఎమ్ఎస్ సభ్యులు నాగారం పురపాలక సంఘ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కచ్చితంగా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా సురేష్, మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48 గంటలు పని చేయాలి అంతకుమించి ఎక్కువ పని చేసినట్లయితే వారికి ఓటి ఇవ్వాలి మరియు వారికి ఆదివారం రోజు కచ్చితంగా సెలవుదినంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం

పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంధు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-78-1.wav?_=4

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించాలని విద్యార్ధి సంఘాలు చేప్పట్టిన బందు పరకాల పట్టణంలో ప్రశాంతంగా కొనసాగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బందుకు మద్దతు తెలిపారని అన్నారు.ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ,డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి,పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిదులు,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహలకు స్వంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలని బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని బందుకు పిలుపునిచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,మహేష్,రంజిత్,కృష్ణ,సురేష్,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోనీ ఈరోజు సిరిసిల్ల సాహితి సమితి అధ్యక్షులు జానపాల శంకరయ్య, మరియు కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లేష్ చక్రాల కోనరావుపేటకు చెందిన రచయిత (ధర్పణం)కవిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.అధ్యక్షులు జానపాల శంకరయ్య మాట్లాడుతు..ధర్పణం పుస్తకం నేటి సమాజంలో
నేటి యువతకు ఎంతగానో తొడపడుతున్నది.
సాహిత్యంతో నేటి యువత సద్వినియోగం చేసు కొని సమాజం లో ఉన్న అసమానతలు తొలిగించాలి అని తెలిపారు. అలాగే బాల సాహిత్య వేత్త వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు పుస్తక రచయిత తన అక్షరాలను పూల మల్లికాల కుర్చీ
సమాజానికి తెలియజేస్తుంది అని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంధర్ మాట్లాడుతు ధర్పణం ఒక అద్భుతం పుస్తకం అని
అంతేకాకుండా సమాజంలో జరిగే పరిమానాలు
తెలియజేసే విధంగా ఉన్నది అని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల మానేరు కవులు, రచయతలకు ఒక పుట్టిన్నీళ్లు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కోడం నారాయణ, బూర దేవానందం, ఏనుగుల ఎల్లయ్య,గడ్డం పర్శరాములు,గాయకుడు సుల్తానా మల్లేష్,
అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.

సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఐ టి ఓ ఇండియన్.

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
మెట్ పల్లి వినాయక్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఐ టి ఓ ఇండియన్ టాలెంటెడ్ ఒలంపియాడ్ 2024-25 సంవత్సరానికి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు ముంబాయి వారిచే వి బి మహర్షి స్వీకరించిన సందర్భంగా వినాయక నగర్ సొసైటీ అధ్యక్ష కార్యవర్గం సభ్యులు నిఖిల్ భరత్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ వి బి మహర్షి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తోట ప్రవీణ్ ఉపాధ్యక్షులు సాంబారి శ్రీనివాస్. క్యాషియర్ గిరి. తోట ప్రసాద్ భోగ మురళి మారుతి పర్రి శంకర్ కోరే రమేష్ గంగారెడ్డి నారాయణ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకుఅవగాహన.

*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో
నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం
జమ్మికుంట నేటిధాత్రి:

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారు జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరు నెలల నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి 10 30 నిమిషాల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంలో 210 మందికి డ్రాప్స్ వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వికాస్ తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ వచ్చు వీర లింగం ముక్క శివకుమార్ దేవాలయం ప్రధాన చార్యులు లింగరి హరికృష్ణ మాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తా ట్రెజరర్ అంతం రాజిరెడ్డి పుల్లూరు ప్రభాకర్ రావు మరియు కమిటీ సభ్యులు మహిళా వికాస్ తరంగణి సభ్యులు 50 మంది పాల్గొన్నారు

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు ,మరియు దోమతెరలు పంపిణీ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వాపురంపాడు వలస ఆదివాసి గ్రామము మరియు అనంతారం గ్రామము లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రాం అనంతరం యువతకు వాలీబాల్సు మరియు వారి కుటుంబాలకు దోమతెరలను (ఎన్జీవో సహకారంతో) అందించిన తర్వాత ఏడుల్లబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు సంబరాలకు రాష్ట్ర పార్టీ ఆదేశించగా మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, జెట్టి రామ్మూర్తి, జిల్లా మునీందర్, చిట్యాల ఉపేందర్ రెడ్డి బత్తిని మహేష్, తదితరులు పాల్గొన్నారు.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల్ వెల్దండ గ్రామపంచాయతీ జోగు రవి కుమార్ s/o యాదయ్య గారు,రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మాణం కోసం సిమెంట్ పంపించారు. మంగళవారం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా సిమెంట్, ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారుసిద్ధగొని రమేష్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి, జోగు రవి కుమార్, ప్రభాకర్ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్.!

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్

 

 

 

మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి

 

 

 

 

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్ పి డి జి అనంతుల శివప్రసాద్ , రీజనల్ చైర్మన్ గుంటుక సురేష్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగారావు పాల్గొన్నారు.

 

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వెల్మల శ్రీనివాసరావు
సెక్రెటరీగా సురకంటి జైపాల్ రెడ్డి ట్రెజరర్ గా వేములవాడ చంద్రశేఖర్
ఈ ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిచే ముఖ్యఅతిథిగా లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్స్ పి డి జి అనంతులశివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించి మెట్పల్లి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

అనంతరం లయన్స్ గుంటుక చంద్రప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలో ముందుంటుందని ప్రపంచంలో 210 దేశాలకు పైగా లయన్స్ క్లబ్ సేవలు చేస్తున్నారని ఇది పేదలకు ఉచిత కంటి శిబిరాలు వైద్య శిబిరాలు చేస్తూ ఉచిత సహాయాలు అందజేస్తుందని అన్నారు.

పి డి జి అనంతల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో సేవా భావంతో పనిచేసే సంస్థ మన లయన్స్ క్లబ్ ఇంట్రర్నేషనల్ అని మన తెలంగాణలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవ కార్యక్రమంలో ముందుంటుందని ఇది సంతోషకరమైనదని వారు చేస్తున్న సేవకు లయన్స్ క్లబ్ తరఫున నేను వారిని అభినందిస్తున్నానని అన్నారు.

నూతన అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని దీనికి ప్రభుత్వ పరంగా స్థలము కేటాయించాలని నర్సింగరావు కు వినతి పత్రం అందించామని దానికి వారు సానుకూల స్పందన తెలియజేశారని అన్నారు.

ముఖ్యఅతిథి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ నేను కోరుట్ల మెట్పల్లి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలు తిరగానని అందులో లయన్స్ క్లబ్ సేవలు బాగున్నాయని చాలామంది చెప్పారని వారి సేవలను పేద ప్రజలు మరవరని ఇటువంటి సేవ చేయడం లయన్స్ క్లబ్ వారికి చెందిందని ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి శిబిరాలు పేద విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ పేదలకు చలికాలంలో చద్దర్లు పంపిణీ హాస్టల్లో వారి సదుపాయ ఫ్యాన్లు గాని ఇతర సామగ్రిని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి నా సహాయం ఎప్పుడు కావాలన్నా అందిస్తానని అన్నారు .

ఈ కార్యక్రమంలో జెడ్ సి గడ్డం శంకర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్, క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, 2025-26 జోన్ చైర్మన్ లయన్ పోలీస్ శ్రీనివాస్,పాస్ట్ ప్రెసిడెంట్లు లయన్ డొంతుల ఆంజనేయులు,గంగుల మురళి,పోహార్ తుకారాం పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు.

జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
జమ్మికుంట నేటిధాత్రి:

 

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు

అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం:-

హాజరైన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, (లీగల్):-

 

 

 

 

శనివారం హనుమకొండ లోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా వలుస సుదీర్, కోశాధికారి గా సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులుగా యం.

మేఘనాథ్, పరకాల బార్ అసోసియేషన్ మహిళ కార్యదర్శిగా గజ్జెల సధారణి, జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ గెలుపొందిన తదితర న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.

ఇట్టి సందబంగా దుస్సా జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు.

Advocates

 

ఈ కార్యక్రమం లో పావ అధ్యక్షులు గంజి గణేష్, సీనియర్ న్యాయవాదులు మార్గం వీరస్వామి, దాసరి ప్రేంసాగర్, కొండబత్తుల రమేష్ బాబు, పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, బిల్లా ప్రభాకర్, మేరుగు సుభాష్, రవీందర్, పాము రమేష్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

కొత్తగూడ నేటిధాత్రి:

కొత్తగూడ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త గూడబిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి మురళి మాట్లాడుతూ .
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఆరవది ఏండ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం
నా తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మ స్వరాజ్ గారి వంటి ఎందరో మహానీయులు యోగ దనంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ మహానీయులు ఆశయాలతో ఆశయ సిద్ది కై అమరవీరుల ఆత్మ ఫలితంగా అవతరించిన నెల నా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు బోనాల ప్రవీణ్ కుమార్ చారి. వజ్జరవి . జిల్లా నాయకులు వాసంసారయ్య. మండల ఉపాధ్యక్షులు బూర్గసారంగపాణి. శ్రీనివాస్. రామయ్య పిన్నింటి రవీందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు…

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో.

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి నేటిధాత్రి :

 

 

 

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా అధ్యర్య ములో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ విలేకరులకు తెలిపారు
పోస్టర్ ను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఆవిష్కరించారని తెలిపారు
ఈ సందర్బంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ
, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా*
వనపర్తి సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్తంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి జిల్లా పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది సోమవారం
:ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
అభయాంజనేయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర,ఉంటుందని తెలిపారు వనపర్తి ప్రజలు, ఉచిత.కంటి వైద్య శిబిరం లో పాల్గొనాలని కోరాడు
పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ మార్కాట్ యార్డ్ చైర్మన్ లక్ష్మా రెడ్డి.మాణిక్యం కృష్ణయ్య రెడ్డి డేగ మహేశ్వర తిరుపతయ్య యాదవ్.ధర్మ నాయక్, సూర్యావంశం గిరి, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి, చిట్యాల రాము అలీం యుగేందర్ రెడ్డి సయ్యద్ జమీల్, జహంగీర్ కుమ్మరి సత్యంనాయక్, నరసింహ కరుణాకర్ బాలరాజు మునికుమార్, రామస్వామి నందిమల్ల సుబ్బు, సౌమ్య నాయక్ మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version