సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
నిజాంపేట, నేటి ధాత్రి మండల కేంద్రానికి చెందిన బీమ్ రావు పల్లి శ్రావణ్ కు 60వేల రూపాయలు ,చిన్నపైడి శోభారాణి కి 15వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వము అందజేయడం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పంజా మహేందర్, ఎండి…