ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం.

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం–ఉదయం ఫౌండేషన్

రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:

మండలం అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ టాబ్లెట్స్ తీసుకుంటుంది.భర్త రాజేశం 6 సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్ లో ఉంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుండి బీడీలు మానేసి మంచం పట్టి , హాస్పిటల్ కి వెళ్ళదామంటే డబ్బులు లేక ఉదయం ఫౌండేషన్ సంప్రదించాగా ఈ రోజు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు.ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ లు పాల్గొన్నారు.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల మండల న్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిసేటి రాహుల్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఆక్సిజన్ యంత్రాన్ని కొనివ్వడం జరిగింది. రాహుల్ గౌడ్ దాతృత్వానికి రాజమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. తన శక్తి మేరకు బాధితురాలికి వైద్య సహాయం అందజేశానని ప్రభుత్వపరంగా అవకాశాలుంటే రాజమ్మకు మెరుగైన వైద్య సహాయం అందజేయగలమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version