ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సఫియా సుల్తానా గారు ఎంపిక అయ్యారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )

ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి. వెంకటేశ్వర్లు గారి నుండి.సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version