వరంగల్ 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిభను కనబరిచిన విద్యార్థిని
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం బర్దీపూర్ విద్యార్థిని వరంగల్ లో జరిగిన 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిబాను కనబర్చింది. బర్దీపూర్ గ్రామం తండ్రి నర్సిములు (ఉల్లాష్ పెంటర్) కూతురు ఉదయ కుమారి రంజోలే వసతిగృహం చదువుతుంది. ఉదయకుమారికి కబడ్డీ లో ప్రతిభను కనపరచడంతో కళాశాల ప్రిన్సిపాల్ ,సిబ్బంది,గ్రామస్తులు అభినదించారు.
హజ్ శ్రీ ముహమ్మద్ షౌకత్ అలీ వేలాది మంది శోకసంద్రాల మధ్య అంత్యక్రియలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలనికి చెందిన ప్రముఖ వ్యక్తి, వీడ్కోలు తబ్లిఘ్, దగ్వాల్ నివాసి, జహీరాబాద్‌లోని A to Z స్టీల్ యజమాని, 50 ఏళ్ల హజ్ ముహమ్మద్ షౌకత్ అలీ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. మృతుడి కుమారుడు హఫీజ్ ముహమ్మద్ అబూ బకర్ బిలాలి ఇషా ప్రార్థన తర్వాత జామియా మసీదు దగ్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. దగ్వాల్ గ్రామంలోని పూర్వీకుల స్మశానవాటికలో ఖననం జరిగింది. అతని భార్యతో పాటు, వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పండితులతో పాటు, అన్ని మతాలకు చెందిన వేలాది మంది మృతుడి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నారు.
బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం
రాష్ట్రంలో బీసీలు ఉద్యమానికి బిఎస్యూ సంపూర్ణ మద్దతు
బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్
పరకాల నేటిధాత్రి
బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వళ్లనే హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఇచ్చారని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారని ఉన్నంత కులాల వారి మీద ఉన్న ప్రేమ బీసీల పట్ల బిజెపి పార్టీకి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుందని బీసీ ప్రధాని న నీ చెబుతూ మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్ని తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
చౌటపల్లి యువకుడి పాటకు గద్దర్ ఫౌండేషన్ గుర్తింపు పాలధార” పుస్తకంలో ప్రవీణ్ రచనకు స్థానం — గుమ్మడి సూర్యం చేతుల మీదుగా పుస్తకం అందజేత పర్వతగిరి (నేటిధాత్రి ):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువ కవి గౌరారపు ప్రవీణ్ రచించిన పాటకు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెలువడిన “పాలధార” పుస్తకంలో గౌరవప్రదమైన స్థానం లభించింది. ప్రజా యోధుడు, విప్లవ గాయకుడు గద్దరన్న యాదిలో రచించబడిన ఈ పాలధార సాహిత్య గ్రంథం, ప్రజా సాహిత్యాన్ని ప్రతిబింబించే కవిత్వాల సమాహారంగా నిలిచింది.ప్రవీణ్ రచనకు చోటు దక్కిన సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గద్దరన్న కుమారుడు గుమ్మడి సూర్యం గారు స్వయంగా ప్రవీణ్‌కు “పాలధార” పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సూర్యం గారు మాట్లాడుతూ, ప్రజా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త తరపు రచయితలు గద్దర్ ఆశయాలను కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ లాంటి యువ కవులు ప్రజా సాహిత్యానికి నూతన శక్తి అందిస్తున్నారు అని అభినందించారు.ఈ పుస్తకంలో ప్రముఖ కవులు వంటి ప్రసిద్ధ రచయితలతో పాటు ప్రవీణ్ రచన స్థానం పొందడం విశేషంగా నిలిచింది. గౌరవం పట్ల ప్రవీణ్ హర్షం వ్యక్తం చేస్తూ నా పాట ప్రజల మనసులో నాటుకుపోవడం, గద్దర్ అన్న పేరుతో వెలువడిన గ్రంథంలో చోటు దక్కడం నా జీవితంలో గొప్ప గౌరవం” అని తెలిపారు ప్రజల బాధలు సామాజిక అన్యాయాలు సమానత్వం కోసం పోరాడే కవిత్వం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు.
ప్రవీణ్ విజయంతో గ్రామ ప్రజలు యువత సాహిత్య అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు చౌటపల్లి గ్రామంలోని పెద్దలు స్నేహితులు అభిమానులు కలిసి ప్రవీణ్‌ను ఘనంగా అభినందించి . గ్రామస్థులు మాట్లాడుతూ మన ఊరి యువకుడు ఇంత పెద్ద వేదికపై గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం అన్నారు. పుస్తక సంపాదకులు కూడా ప్రవీణ్ పాటలోని ఆలోచనా లోతు భావన ప్రజా చైతన్యం పట్ల ప్రశంసలు తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇలాంటి కొత్త తరపు కవులు గద్దర్ ఆశయాలకు పునర్జీవం ఇస్తున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా సాహిత్య వర్గాలు మాట్లాడుతూ పాలధార పుస్తకం ద్వారా గ్రామీణ ప్రజా కవులకు గుర్తింపు లభించడం తెలుగు సాహిత్యానికి ఒక మంచి సంకేతం అని అభిప్రాయపడ్డాయి.
సీనియర్ జర్నలిస్టు నారాయణకు మెట్ పల్లి లోని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డు అందించిన మెట్ పల్లి ప్రెస్ క్లబ్( ఐజేయు) సభ్యులు
మెట్ పల్లి అక్టోబర్ 9 నేటి దాత్రి కోరుట్లలోని 6 వార్డు ఎకిన్ పూర్ చెందిన సీనియర్ జర్నలిస్టు గోరు మంతుల నారాయణకు. మెట్ పల్లి లోని కార్పొరేటర్ స్థాయి ఆసుపత్రిలో. బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డును. గురువారంటీయూడబ్ల్యూజే( ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా.అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నారాయణకు గత నెలలో ఆర్థిక సాయం అందించినట్లు. ఇప్పుడు ఆయనకు పట్టణంలోని ఓ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి చెందిన బిల్లులో రాయితీగల హెల్త్ కార్డును అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్, సహాయ కార్యదర్శి పింజారి శివ, ఈసీ మెంబర్ కుర్ర రాజేందర్ లు తదితరులున్నారు.
ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం
సోతుకు ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని , జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి
మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *
Vaibhavalaxmi Shopping Mall
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,
`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!
`కేసీఆర్ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!
`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!
`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.
`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.
`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.
`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!
`ఆనాడు ఎన్టీఆర్ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.
`వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.
`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.
`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!
`వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.
`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్ మండలికి హజరుకాలేదు.
`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!
`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.
`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!
`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.
`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.
`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?
హైదరాబాద్, నేటిధాత్రి: మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్ విఫ్ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్ నారాయణ్. ఆయన ఓ మాజీ ఐఎఎస్ అదికారి. కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా.. “ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది . మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది. గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది. కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా. ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు . కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు
జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.
అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.
నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్ జెపిఎన్ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి విజేత కాశీబుగ్గకు చెందిన జి రోషిణి, కూపన్ నంబర్ బి 373, గల వారికి ఒక కిలో వెండి బహుమతి గెలుచుకున్నారు.
రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జి ప్రియాంక కూపన్ నంబర్ జే 250 టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, దసరా పండుగ శుభ సందర్భంలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి మూలకారణమని అభినందనలు తెలిపారు.
విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు..
కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు, ప్రదీప్, హరీష్, రిషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.
మెట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంలో మెట్ పల్లి గాయత్రి బ్యాంకు వారి ఆధ్వర్యంలో గాయత్రి బ్యాంకు మెట్‌పల్లి ఖాతాదారులు అయిన పొట్ట రాజేష్ గ్రామం మెట్‌పల్లి కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది . గాయత్రి బ్యాంకు ప్రతి ఖాతాదారులకు గాయత్రి నిర్భయ సేవింగ్ ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నది . కావున అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు నామిని అయినా అమ్మ పొట్ట లలిత కు ఎమ్మార్వో యన్ నీతా గారిచే బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును ఇవ్వడం జరిగింది . ఎమ్మార్వో యన్ నీతా మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు నిర్భయ సేవింగ్ ఇన్సూరెన్స్ ఉండడం ప్రతీ ఖాతాదారులకు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు ఇది వర్తింపచేయడం చాలా మంచి పాలసీ కావున ఇటువంటి గాయత్రి బ్యాంకు సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన బ్యాంకు మేనేజర్ అధికారులను ఎమ్మార్వో యన్ నీతా అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కేశ శివకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మధు, రేవంత్. తదితరులు పాల్గొన్నారు.
శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో
మాజీ కౌన్సిలర్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉంగ్లంతిరుమల్ నాయుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చన నిర్వహించామని తిరిమల్ చెప్పారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గo అభివృద్ధి చేసిన నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలిగి దేవుడి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు పూజలో సీనియర్ జర్నలిస్ట్ మధుగౌడ్ ,శ్రీను 33వార్డు ప్రజలు ఉన్నారని తెలిపారు
*టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్..
తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్01:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 1 వ తేదీన పొద్దు పొద్దునే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటకు మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్, అధ్యక్షతన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, 15,19, 30,31, వార్డు లలో ఆదయక్షల అధ్యక్షులు కార్యదర్సులు, సభ్యులు లతో కలసి వయోవృద్ధులకు, వికలాంగుల కు, వితంతువులకు, అందులకు,అనాధలకు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంను అందచేశారు. ఈ కార్యక్రమం లో తిరుపతి తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ , కొండా రామారావు, వార్డు నాయకులు భారతమ్మ,, బాల,,మధు, అలాగే కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.
పొట్ పల్లి గ్రామానికి మొగలయ్య మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పొట్ పల్లి గ్రామానికి చెందిన మొగలయ్య పాముగా కాటుకు గురై చికిత్స కొరకు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి లో చేరారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆసుపత్రి కి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, అండగా ఉంటాం అని కుటుంబసభ్యులకు మనోధైర్యన్ని కలుగజెసారు ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,కోహీర్ మండల మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గ్రామ నాయకులు సిద్దన్న పటేల్, శాంత్ కుమార్, బసప్ప,మాణిక్యప్ప,రామన్న తదితరులు ఉన్నారు.
విజయదశమి శుభాకాంక్షలు తెలిపినబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు మొగుళ్ళపల్లి నేటి దాత్రి
మొగుళ్ళపల్లి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు మొగుళ్లపల్లి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు దసరా పండగను కుటుంబ సభ్యుల తో కలసి సంతోషంగా జరుపుకోవాలని విజయ దుర్గా దేవిని కోరుకుంటున్నాను అని అన్నారు మొగుళ్లపల్లి మండల ప్రజలకు స్థానిక ఎలక్షన్ రావడం జరిగింది ప్రజలందరూ వారి గ్రామాఅందరిపైలలో సర్పంచ్లను ఎంపీటీసీలను గెలిపించాలని కోరారు దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తెలంగాణలో ఎన్నికలు జరిగినా తమ పార్టీ విజయం సాధిస్తుందని మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు దీమ వ్యక్తిగతం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆ మోసాన్ని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.