జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వర్ రావు మృతి…

జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వర్ రావు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నాగేశ్వరరావు మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం ఉదయం మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇది అనుకోకుండా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వారు ఈ విషయం గురించి తెలియజేశారు. అతని మరణం పట్ల చాలా మంది సంతాపం తెలిపారు.

గుండెపోటుతో ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి సీహెచ్ నారాయణ మృతి

గుండె పోటుతో సీహెచ్ నారాయణ (55) ఆకస్మిక మృతి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్ కల్ మండలం, చీకూర్తి గ్రామ, నివాసి జహీరాబాద్ నివాసి సిహెచ్. నారాయణ (ఇంటలిజెన్స్ పోలీస్ విభాగం) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం జహీరాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. వృత్తినే దైవంగా భావిస్తూ, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న నారాయణ మృతి చెందడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ. నియోజకవర్గ ప్రజలు,

కేసముద్రం కాంగ్రెస్ నేత గుండెపోటుతో మృతి

గుండెపోటుతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి…

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వగృహం వల్ల గుండె నొప్పి రావడంతో వెంటనే అకస్మాత్తుగా ప్రైవేట్ వాహనంలో మొహబత్ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు వెంటనే గుర్తించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు , భార్య ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. చిన్న కూతురు రమ్య కి వివాహము జరగలేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

“నిరుపేద రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి”

అకస్మాత్తుగా మరణించిన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆకారపు రాజయ్య నిన్నటి రోజు గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామానికి చెందిన రాజయ్య నిన్నటి రోజు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి నా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి రాములు. రాజయ్య జిల్లెల గ్రామంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికునుగా పనిచేస్తూ వడ్ల సీజన్లో అమాలిగా వడ్లు జోకుతూ ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని వారి పెండ్లిలకు గాను తనకున్న యావదాస్తి భూములు జాగాలు పొలం అమ్ముకొని ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంటున్నారని. అలాంటి నిరుపేద వారికి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో గాని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఇటువంటి నిరుపేదలు కనిపించడం లేదా. ఇలాంటి నిరుపేద కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వారి జీవితాలు మారడం లేదని వెంటనే ప్రభుత్వ o . గుర్తించి ఇలాంటి కుటుంబాల వారిని ఆదుకోవాలని కోరుతూ ఇటువంటి నిరుపేదలు ఉండడానికి ప్రభుత్వం కేటాయించే డబ్బులు బెడ్ రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూవారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. వారినీ ప్రభుత్వాo ఆదుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు. జిల్లా నాయకులు బాచుపల్లి శంకర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు

హజ్ శ్రీ ముహమ్మద్ షౌకత్ అలీ వేలాది మంది శోకసంద్రాల మధ్య అంత్యక్రియలు…

హజ్ శ్రీ ముహమ్మద్ షౌకత్ అలీ వేలాది మంది శోకసంద్రాల మధ్య అంత్యక్రియలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలనికి చెందిన ప్రముఖ వ్యక్తి, వీడ్కోలు తబ్లిఘ్, దగ్వాల్ నివాసి, జహీరాబాద్‌లోని A to Z స్టీల్ యజమాని, 50 ఏళ్ల హజ్ ముహమ్మద్ షౌకత్ అలీ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. మృతుడి కుమారుడు హఫీజ్ ముహమ్మద్ అబూ బకర్ బిలాలి ఇషా ప్రార్థన తర్వాత జామియా మసీదు దగ్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. దగ్వాల్ గ్రామంలోని పూర్వీకుల స్మశానవాటికలో ఖననం జరిగింది. అతని భార్యతో పాటు, వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పండితులతో పాటు, అన్ని మతాలకు చెందిన వేలాది మంది మృతుడి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నారు.

గుండెపోటుతో వ్యక్తి మృతి…

గుండెపోటుతో వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కమ్మరి మహేందర్ (45) గ్రామంలో కార్పెంటర్ (వడ్రంగి) కులవృత్తి పనిచేస్తుంటాడు. అయితే గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నిరంజన్ రెడ్డి.

మృతుడికుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

వనపర్తి నేటిధాత్రి .
పెద్ద గూడెం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి ఆకస్మికంగా మరణించారు ఈ విషయం తెలియడంతో మృతుని కుటుంబ సబ్యలను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు
మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాణిక్యం, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ కొండన్న, లక్ష్మీకాంతరెడ్డి, తిరుమలయ్య, శీను, చిరంజీవి, బి రాములు, బాలస్వామి, వంశీ, బాలకృష్ణ, వెంకటయ్య, ఏం రాములు, గ్రామ అధ్యక్షులు అశోక్, చోటు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version