జహీరాబాద్ టౌన్ / ఝారసంగం మండలం గుర్తు తెలియని మగ వ్యక్తి సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు అందాజు 30 నుండి 35 సంవత్సరాలు, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కుప్పానగర్ గ్రామ శివారులో ఒక పురాతన పాడుబడిన డాబా యందు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు ఇతని యొక్క వివరాలు తెలిసినచో క్రింది నంబరుకు ఎస్ ఐ 8712656771జహీరాబాద్ రూరల్ సిఐ 8712656732. సంప్రదించగలరని తెలిపారు,
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
న్యాల్ కల్ మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా న్యాల్ కల్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు గొల్ల నర్సింలు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జక్కుల హనుమంత్ సార్ హద్నూర్ గారు రావడం జరిగింది గోపికలు శ్రీకృష్ణ వేశాధారణ తో చిన్నారులతో కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్ర గురించి విశ్వాహిందు పరిషత్ మండలం అధ్యక్షులు రాంచందర్ పవార్ మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్గి మాజీ సర్పంచ్ జట్టుగొండ మారుతీ ఓంకార్ యాదవ్ మల్గి ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎస్. ఎం.సీ. చేర్మెన్ నర్సప్ప అశోక్ చల్కి దత్తు గొల్ల దిలీప్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ పెద్దగొల్లా శ్రీనివాస్ గొల్ల రాములు మారుతీ మహేష్ సిద్దు సునీల్ మొగుళప్ప రాకేష్ ఆకాష్ విట్టల్ గొల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు,
#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.
#మత్తడి దూకుతున్న పలు చెరువులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.
Flood water overflowing
అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సీనియర్ అసిస్టెంట్ స్వాతి
నేటిధాత్రి, హనుమకొండ
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న చింతం స్వాతి, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో ఉత్తమ ఉద్యోగిణిగా సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సిఎచ్ స్వాతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న స్వాతిని రెవెన్యూ అధికారులు, హనుమకొండ కలెక్టరేట్ సిబ్బంది, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు
జహీరాబాద్ నియోజకవర్గంలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలలుగా బీదర్ లో పని చేసుకుంటున్న లక్ష్మన్, కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.
చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.
ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నంది అవార్డు పురస్కారాల పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ,స్వచ్చంద సేవ సొసైటీ సంస్థ దసరా పండుగ పురస్కరించుకొని రాష్టం లోని కళాకారుల ప్రతిభని గుర్తించి,వారిని ప్రోత్సహించేందుకు విజయదశమి ఉత్తమ కళారత్న నంది అవార్డ్ పురస్కారాలు సెప్టెంబర్ 28 న మంచిర్యాలలో నిర్వహించబడుతుంది.గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు,జానపద కళాకారుల,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హన్మాండ్ల మధుకర్,మంచిర్యాల జిల్లా నృత్య కళ సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్,ఉపాధ్యక్షులు రామగిరి అర్జున్,డాన్స్ మాస్టర్స్ రిథమ్ సది,మాస్టర్ రమేష్ బాబు, డైరెక్టర్ కె.తిరుపతి వర్మ ,రవీందర్ వర్మ ,స్టాలిన్,తిరుపతి,కార్య నిర్వాహకులు దుర్గం విజయ్,కొప్పర్తి సురేందర్,బెల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాల (మోడల్ స్కూల్లో )డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిక్ అండ్ ఎంపవర్మెంట్ ఆదేశానుసారము * నషా ముక్తి భారత్ అభియాన్* కార్యక్రమంలో భాగంగా పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ* కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల పిల్లల తోటి వెంకటేశ్వర్లు నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా చూస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినీ అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్యలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాడ్
పరకాల నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలమరియు పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు.ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక మరియు వర్షం వస్తే కనీసం నడవలేని పరిస్థితి ఉందన్నారు.
అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ నూతన బిల్డింగ్ నిర్మించాలని,మల్లారెడ్డి ప్రైమరీ స్కూల్లో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వర్షం వస్తే కనీసం కూర్చొని చదువుకుందాం అంటే పై రేకులకు హోల్స్పడి వర్షం నీరు క్లాస్ రూములో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు చదువుకుందాం అంటే ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పట్టణంలో ఉన్న విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్దఎత్తున పట్టణంలో మరియు జిల్లా పరంగా ఉద్యమం చెప్పడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్,బొజ్జ హేమంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,కార్యదర్శి కోగీల సాయి తేజ ల్,ప్రభుత్వ కాలేజ్ ప్రెసిడెంట్ ప్రభాస్,ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షుడు రోహిత్,సహాయ కార్యదర్శి అవినాష్,బన్నీ,రాహుల్,విజయ్ సూర్య,అరవింద్ పాల్గొన్నారు.
`గతం నుంచి రాహుల్ చెబుతున్న మాటలన్నీ నిజమౌతున్న సందర్భం.
హైదరాబాద్,నేటిధాత్రి: ఇప్పుడు దేశమంతా రాగా కాలం నడుస్తోంది. అంటే ఒక రకంగా రాహుల్ గాంధీ కాలమన్నమాట. ఈ మాట ఇతర పార్టీలకు నచ్చకోవచ్చు. కాని ప్రజల ఆలోచనలను ఒక నాయకుడు ప్రభావితం చేసినప్పుడు వచ్చే మార్పులో భాగమే ఇది. 2014 ఎన్నికలు ముందుకు దేశమంతా నమో మంత్రాన్ని జపించింది. ఫలితంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. వరసగా మూడు సార్లు ప్రధానిగా మోడీ ఎన్నియ్యారు. రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రజలు ప్రతిపక్ష పాత్రను కూడా ఇవ్వలేదు. ఇందుకు కారణాలేమిటో ఇప్పుడిప్పుడే దేశానికి అర్దమౌతోంది. అందుకు కారణాలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ వెలుగులోకి తెస్తున్నారు. రెండుసార్లు కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఆనాటి నుంచి చెప్పుకునే అవకాశం పూర్తి స్దాయిలో లేకపోయింది. కనీసం ప్రతిఫక్ష హోదా వున్నా ఎంతోకొంత బాగుండేది. కాని ఆయనుకు ఆ అవకాశం లేకుండాపోయింది. రెండోసారి బిజేపి పార్టీ కేంద్రంలోకి వస్తుందన్న నమ్మకం చాలా మందికి లేదు. ఎందుకంటే అప్పటికే పెరిగిన ధరలు, నోట్ల రద్దులాంటివి ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. డిజీల్, పెట్రోల్ చార్జీలు, జిఎస్టీల మోతతో ప్రజలు ఎంతో విసిగిపోయి వున్నట్లు కూడా చర్చించుకునేవారు. కాని అనూహ్యంగా రెండోసారి 2019 ఎన్నికల్లో బిజేపి మరిన్ని సీట్లను పెంచుకుంటూ ఏకంగా 302 సీట్లు గెల్చుకున్నది. ఇక అప్పుడు కూడా ప్రతిపక్షానికి నోరు లేకుండాపోయింది. కాని ఈసారి కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించి, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. ఇక అప్పటి నుంచి రాహుల్ గాందీ తన ప్రతాపం చూపుతూ వస్తున్నాడు. రాజకీయంగా తన బ్యాటింగ్ ఎలా వుంటుందో బిజేపికి రుచి చూపిస్తూ వస్తున్నాడు. ఇక తాజగా ఆయన ఈసిపై చేస్తున్న యుద్దం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఎప్పుడైతే పహల్గావ్ ఘటన తర్వాత చెప్పాలంటే బిజేపిపై ప్రజలకు వున్న నమ్మకం చాలా వరకు సడలింందనే చెప్పాలి. ఈ సమయంలో బిజేపి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా నమ్మే పరిసి ్ధతుల్లో ప్రజలు లేకుండాపోయారు. అదే సమయంలో రాహుల్ గాందీ అటు క్షేత్ర స్దాయిలో, ఇటు పార్లమెంటులో అధికార బిజేపిని ఒక ఆట ఆడుకుంటూ వస్తున్నారు. ఎన్నికల విషయానికి వస్తే ఏకంగా ఈసిపై తీవ్రమైన కామెంట్లు చూస్తూ వస్తున్నారు. వాటిని నిరూపించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. దాంతో మిగతా ప్రతిపక్షాలు 25 కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సాగుతున్నాయి. సోమవారం రాహుల్ గాందీ సుమారు 300 మంది ఎంపిలతో కలిసి పార్లమెంటు నుంచి నేరుగా ఎలక్షన్ కమీషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన రాష్ట్రాలలో, తర్వాత జరిగిన రాష్ట్రాలలోనూ ఎన్నికల కమీషన్, బిజేపికి సపోర్టుగా నిలిచిందని అందుకే బిజేపి వరసుగా గెలుస్తూ వస్తుందని కొన్ని కీలకమైన విషయాలు బైట పెట్టారు. మహారాష్ట్ర, డిల్లీ, హర్యాన, కర్నాకట రాష్ట్రాలలతోపాటు, ఏపికి చెందిన ఎన్నికలపై ఆయన చూపించిన లెక్కలు అందర్నీ దిగ్రాంతికి గురిచేస్తున్నాయి. అందుకే దేశ వ్యాప్తంగా బిజేపిపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా ఎంతో పెరిగిపోయింది. ఇక దేశంలో కాంగ్రెస్ తారాజువ్వలా పుంజుకుంటోంది. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీకి విపతీరీతంగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో రాహుల్ గాందీ మీద క్రేజ్ పెరుగుతోంది. 2014కు ముందు ప్రదాని మోడీకి వచ్చినట్లే ఇప్పుడు రాహుల్‌కు కూడా జనం నీరాజనం పడుతున్నారు. బలమైన ప్రతిపక్షం వుంటే తప్ప రాజకీయాల్లో మార్పులు రావు. 2014,2019లలో ప్రజలు ప్రతిపక్షం లేదు. బలమైన కేంద్ర ప్రభుత్వం బిజేపి రూపంలో ఏర్పాటైంది. ఏక పార్టీ పాలన విదానంలో ఒంటెద్దు పోకడలు కనిపించాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు లేకుండాపోయారు. ప్రతిపక్షాల వాదనలు పత్రికలు కూడా రాయలేకపోయాయి. ప్రధాని మోడీ చెప్పిందే నిజమని నమ్మారు. బిజేపి ఆలోచనలే దేశానికి శ్రీరామరక్ష అనుకున్నారు. మొన్నటి దాకా బిజేపి నాయకులు రాహుల్ గాందీని పప్పు అంటూ నిందించారు. రాహుల్ ది ఏ కులమంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని కల్పిత కథలన్నీ చెప్పారు. జనాన్ని నమ్మించాంచారు. డామిట్ కథ అడ్డం తిరుగుతోంది. రాహుల్ నాయకత్వం, సమర్ధత మీద చర్చ మొదలైంది. దేనికైనా సరే సమయం రావాలి. కావాలి అంటారు. ఇప్పుడు అదే నిజమౌతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్రతిహాతంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూశారు. బిజేపిని బలపర్చారు. కాంగ్రెస్‌కు సమాంతరంగా గెలిపిస్తూ వచ్చారు. ఆఖరుకు కాంగ్రెస్‌కు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు. ప్రజలు ఎంతైనా విజ్ఞులు. తాము కోరుకున్నట్లు పాలన సాగాలనుకోవడం ప్రజల నిర్ణయం. ప్రజా నిర్ణయమే అంతిమ తీర్పు. అందుకే 2014 నుంచి బిజేపికి దేశ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రాలలో కూడా కాషాయజెండా ఎగురవేశారు. ఇప్పుడు బిజేపికి గడ్డు కాలం మొదలైంది. గత ఎన్నికల్లో అప్‌కీ బార్ బిజేపి సర్కార్ అనే నినాదాన్ని జనం సంపూర్ణంగా విశ్వసించలేదు. బిజేపికి మద్దతు తెలపలేదు. కాకపోతే బిజేపిని అధికారం దరిదాపుల్లోకి తెచ్చి వదిలిపెట్టారు. దాంతో మళ్లీ సంకీర్ణ సర్కారు కేంద్రంలో ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి బిజేపి అవస్దలు ఎదుర్కొంటోంది. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి బిజేపికి ప్రశ్న అనే పదమే వినిపించలేదు. బిజేపిదాకా ఆ పదమే చేరుకోలేదు. ఓసారి బిజేపికి అవకాశమిద్దామనుకున్న ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రశ్నలు వినిపించుకోలేదు. దానికి తోడు బిజేపి చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే అని నమ్మారు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటలను ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా కశ్మీర్ అంశంలో ఎప్పటి నుంచో సాగుతున్న, నానుతున్న సమస్యలన్నీ బిజేపి వల్లనే తీరుతాయని జనం నమ్మారు. అది ప్రధాని మోడీ నేతృత్వంలోనే సాధ్యమౌతుందనుకున్నారు. కాని ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఎప్పుడైతే పహల్గావ్ దాడి తర్వాత ప్రజల్లో బిజేపిపై వున్న నమ్మకం క్రమంగా సడలుతోంది. ఎనుకున్న ప్రజలే ప్రశ్నించొద్దనే రాజకీయ పార్టీని ప్రజలే మళ్లీ పక్కన పెడతారన్న విషయాన్ని పార్టీలు మర్చిపోతున్నాయి. అందుకే పహల్గావ్ దాడిపై ఎవరూ మాట్లాడకుండా ఎత్తులు వేశారు. కాని కేంద్రంలో ఈసారి బలమైన ప్రతిపక్షం వుండడంతో అసలు విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో బిజేపిపై ప్రజలు ఎంత కోపంతో వున్నారో కూడా కనిపిస్తోంది. పహల్గావ్ దాడి విషయంలో బిజేపి వేసిన విన్యాసాలు ప్రజలు నిషితంగా గమనిస్తూ వచ్చారు. బిజేపి చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎలాంటి పొంతన వుండడం లేదని గ్రహించారు. పైగా పాకిస్తాన్‌తో యుద్దం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీజ్ ఫైర్ ప్రకటన భారతీయులను ఆశ్చర్యాలకు గురి చేసింది. ఆపరేషన్ సింధూర్ అని పేరుతో రంగంలోకి దిగగానే దేశ ప్రజలంతా ఎంతో సంతోషించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెబుతారని ఊహించారు. కాని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్‌ను ప్రకటించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి బిజేపిపై ప్రజల్లో ఒక రకమైన భావన మొదలైంది. తాజాగా ఆపరేషన్ మహాదేవ్ జరిపి, ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెప్పినా జనంలో స్పందన కరువైంది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని చెప్పిన కేంద్రం, మళ్లీ ఆపరేషన్ మహదేవ్ ఎప్పుడు తెచ్చింది? అనే అనుమానంలోనే వున్నారు. ఇలా వరుస సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ గత పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఇందిరాగాంధీ చూపిన చొరవపై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆమె అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రీగన్‌తో నేరుగానే తమ దేశ రాజకీయ, సార్వభౌమత్వంలో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌ను రెండుగా చీల్చేసింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసింది. ఆ సమయంలో ప్రపంచమంతా ఇందిరాగాందీని కొనియాడిరది. బిజేపి నాయకుడు మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పాయ్ సైతం ఇందిరాగాందీని అపర కాళికా దేవి అంటూ కీర్తించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు గత పది సంవత్సరాలుగా ఎంత చప్పగా సాగాయో, ఇప్పుడు అంత హాట్‌గా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందిరాగాంధీ ధైర్యంలో కనీసం సగం వున్నా అమెరికా అద్యక్షుడు ట్రంప్ చెప్పింది అబద్దమని చెప్పంటూ ప్రతిపక్ష నేత రాహుల్ సవాలుతో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. ప్రతిపక్షాలు అదికార బిజేపిని చెడుగుడు ఆడుకుంటున్నాయి. అయితే రాహుల్ గాంధీ గత ఎన్నికల ముందు రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలోనే దేశమంతా ఆయనపై కొంత నమ్మకం మొదలైంది. తర్వాత ఆయన ప్రజలకు చేరువౌతున్న తీరు దేశమంతా గమనిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది. మన దేశంలో ఏం జరుగుతుందో ఆయన ఎంత చెప్పినా జనం వినడానికి సిద్దంగా వున్నా, ప్రచార సాధనాలు సహకరించలేదు. కాని ఇప్పుడు ఆయన ఏది చెబితే అది జనం వింటున్నారు. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? కోవిడ్ సమయంలో రాహుల్ ఏం చెప్పారు. అదే ఎలా నిజమైంది? రాజ్యాంగ స్పూరిని గురించి వివరించడం అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంగ్లీషు వల్ల లాభమేమిటి? హిందీని బలవంతంగా రుద్దితే ఏం జరుగుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపై రాహుల్ చెప్పే ప్రతి మాట జనానికి చేరుతోంది. పైగా ప్రతిపక్షాలు కూడా రాహుల్ బాటలోకి వచ్చేస్తున్నారు. దాంతో రాహుల్ ఇమేజ్ ఇటీవల కాలంలో అమాంతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ బలం దేశ వ్యాప్తంగా పెరుగుతోంది.
గణపురం బండారుపల్లి గిరిజన భవన్ లో గుండు లలిత రమేష్ దంపతుల కుమారుడు గుండు వినయ్ రవీన ల వివాహ వేడుకకు బాల్య మిత్రులుహాజరై నూతన మధు వరులను ఆశీర్వదించారు. తమ కుమారుడి వివాహ వేడుకకు బాల్య మిత్రులు హాజరై ఆశీర్వదించినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకలో అలువల పద్మ రాణి విజయ హైమ సునీత వి సునీత తోట భద్రయ్య రఘువీర్ రామన్న రమేష్ సంపత్ హరి ప్రసాద్ సునీల్ రవీందర్ రావు పాల్గొని ఏడవ తరగతి పూర్తి చేసుకుని 33 సంవత్సరాలు గడుస్తున్న మిత్రురాలి కుమారుడి పెళ్లిలో అందరూ కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండేది పిఆర్టీయూ
పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి
మరిపెడ నేటిధాత్రి.
పిఆర్టీయూలో సభ్యత్వమే ఒక మవరం అని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలుపెరుగని కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయె అని సంఘం మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అన్నారు.పిఆర్టీయూ సభ్యత్వ నమోదు పక్షోత్సవాలలో భాగంగా మరిపెడ, గుండెపుడి తానంచర్ల,బరహాన్ పురం తాళ్ళఊకల్,గిరిపురం,బావోజిగూడెం,రాంపురం పాఠశాలలో సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మాట్లాడుతూ పిఆర్టీయూ సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయ బదులు పదోన్నతుల విషయంలో చేసిన సంఘం పిఆర్టీయూ సంఘం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, రాష్ట్ర బాధ్యులు దోమల లింగయ్య, బాయగాని రాంమోహన్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్,సరోజ,గుర్రం వెంకన్న,సంఘ బాధ్యులు పొడిశెట్టి యాదగిరి,శ్రీను,క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం రోజా అనే యువతి కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ (Sexual Abuse Allegations) బాగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్ చర్చనీయాంశమైంది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ విషయంలో తనకంటే కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ఆమెపై తన సిబ్బంది సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘నేనేంటో తెలిసివాళ్లు ఈ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకూ తెలుసు. ఇవన్నీ నన్ను ఏ మాత్రం బాధించలేవు. కానీ ఇలాంటి వాటి వల్ల నా కుటుంబం, సన్నిహితులు ఎంతో బాధ పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి’. ఆమె ఫేమస్ కావడం కోసం, కాసేపు మీడియాలో పాపులర్ కావడం కోసం చేసే పనులివి. అలా ఆమెను కాసేపు ఎంజాయ్ చేయనీయండి’ అని నా సన్నిహితులతో చెప్పాను. మేము ఆమెపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. గత ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు దేనికీ భయపడలేదు. ఇలాంటివి నన్ను ఏమీ చేయలేవు’ అని విజయ్ సేతుపతి అన్నారు.గతంలో విజయ్‌పై రమ్య అనే మహిళ ఎక్స్‌లో చేసిన వాఖ్యలివి. ‘తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉంది. దీని నా స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడింది. విజయ్‌సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారు. ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైంది’ అని రమ్య ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాసేపటితో ఆమె ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై సేతుపతి అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు. ఆ తర్వాత ఆ మహిళ మరో పోస్‌ట్తఓ క్లారిటీ ఇచ్చింది. అది కోపంలో చేసిన పనని, అంతగా వైరల్ అవుతుందనుకోలేదని తెలిపింది.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి,ఆదేశాల మేరకు కోహీర్ మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹4,19,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-కోహిర్ కి చెందిన కైరున్నిసా బేగం ₹.45,000/-,సుజాత లగ్గేరి ₹.60,000/-కొత్తూరు పట్టి దిగ్వాల్ కి చెందిన గొల్ల ₹.42,000/-బిలాల్ పూర్ కి చెందిన ఈరప్ప ₹.45,000/-దిగ్వాల్ కి చెందిన తలారి చంద్రయ్య ₹.18,000/-, & ఎండీ ఫముద్దీన్ ₹.60,000/-పర్షపల్లి కి చెందిన జి. జగ్గయ్య ₹.26,000/-, గోడియర్పల్లి కి చెందిన నర్సింహ రెడ్డి మంచిరెడ్డి గారికి ₹.18,500/-,చింతల్ ఘాట్ కి చెందిన కోహీర్ హ్యాన్ దొరతి ₹.21,000/-, ఈ కార్యక్రమంలో కోహీర్ మాజి సర్పంచ్ కలీం, వజీద్,సందీప్,నిరంజన్ ,గోడియార్పల్లి పార్టీ అధ్యక్షులు నర్సింలు,మనియర్పల్లి పార్టీ అధ్యక్షులు నగేష్,చింతల్ ఘాట్ గ్రామ పార్టీ అధ్యక్షులు సొలొమోన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు
నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో వానర సైన్యం దాటికి వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలతో చంద్రుగొండ ప్రజలు కోతుల భయంతో గజ గజ వనక పోతున్నారు. వివరాల్లోకి వెళితే చంద్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న బక్కి లక్ష్మి(60) శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన వానర సైన్యం ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేయడంతో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మిని వెంటనే కుటుంబ సభ్యులు నెక్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన నిమిత్తం ఎం జి ఎం కు తరలించినట్టు లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం లక్ష్మీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చంద్రుగొండ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా కోతులు ఇండ్లలోకి దూరి విధ్వంసం సృష్టిస్తున్నాయని చంద్రుగొండ గ్రామంలో చాలామందిని కరిసాయని వెంటనే ఉన్నత అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.. దుల్కర్ సల్మాన్! ఎందుకంటే
దుల్కర్ సల్మాన్ ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ప్రముఖ మలయాళ, తెలుగు నటుడు, సీతారామం ఫేం దుల్కర్ సల్మాన్ (DulQuer Salmaan) ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy)ని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తె నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt), దసరా, ప్యారడైజ్ చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి (Cherukuri Sudhakar) ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ దుల్కర్కు శాలువా కప్పి సన్మానించారు. అయితే దుల్కర్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనక ప్రత్యేక కారణాలేవి బయటకు తెలియలేదు.
అయితే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards)లో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం (Sita Ramam), మహా నటి, లక్కీ భాస్కర్ (Lucky Baskhar ) మూడు చిత్రాలు అవార్డులు దక్కించుకోవడంతో పాటు దుల్కర్ సల్మాన్(DulQuer Salmaan)కు స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించడం విశేషం. కాగా అవార్డుల ప్రధానోత్సవ సమయంలో దుల్కర్ హజరు కానదున ఇప్పుడు ప్రత్యేకంగా సమయం తీసుకుని కలిసినట్లు తెలుస్తోంది.
ద్వారకపేట-సర్వపురం గౌడ సంఘ మాజీ అధ్యక్షులు విలాసారపు సుదర్శన్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,రాష్ట్ర నాయకులు శీలం వీరన్న గౌడ్,మద్దెల సాంబయ్యగౌడ్,గంధంసిరి సామ్రాజ్యంగం,బూరుగు సాయి గౌడ్,విలసారపు నరేందర్ గౌడ్, వేముల రవి గౌడ్, పులి తిరుపతి గౌడ్, బురుగు కట్టనగౌడ్, దొనికల వెంకన్న గౌడ్, మెరుగు కమలాకర్ గౌడ్, కుమారస్వామి గౌడ్,సృజన్ గౌడ్ పాల్గొన్నారు.
సొంత ఇల్లు లేక నిర్మించే పరిస్థితి లేక ఇన్నాళ్లు పూరిగుడిసెల జీవనం కొనసాగించిన పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక వరం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకున్నది ప్రియతమ నాయకురాలు ధనసరి సీతక్కప్రత్యేక చొరవతో కొత్తగూడ మండలంలోని ఇందిరమ్మ ఇల్లు అధికంగా మంజూరు కావడం జరిగింది . అందులో భాగంగా నేడు కొత్తగూడ మండల కేంద్రం లో గాంధీనగర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ.. మా పూర్తి జీవితాలలో కూడా సొంత ఇల్లు కట్టుకుంటామని ఆశ లేకుండా బతుకుతున్న మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు సీతక్క గారి దయతో మా సొంతింటి కల నెరవేరబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సొంత ఇంటి కలలు నిజం చేసిన స్థానిక మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఈ సందర్బంగా తెలిపారు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ముంజాల ఐలయ్య చిత్ర పటానికి శనివారం స్థానిక జర్నలిస్టులు నివాళులర్పించారు. భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలోని 22వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తాజా మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ తండ్రి అయిన ముంజాల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా దశదినకర్మ కు జర్నలిస్టులు తడక సుధాకర్, చంద్రమౌళి, శ్రీను, వర్తక సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.