పొద్దు పొద్దున్నే పెన్షన్ పంపిణి..

*పొద్దు పొద్దున్నే పెన్షన్ పంపిణి..

*మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్..

*టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్..

తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్01:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 1 వ తేదీన పొద్దు పొద్దునే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటకు మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్, అధ్యక్షతన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు,
15,19, 30,31, వార్డు లలో ఆదయక్షల అధ్యక్షులు కార్యదర్సులు, సభ్యులు లతో కలసి వయోవృద్ధులకు, వికలాంగుల కు, వితంతువులకు, అందులకు,అనాధలకు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంను అందచేశారు.
ఈ కార్యక్రమం లో తిరుపతి తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ , కొండా రామారావు, వార్డు నాయకులు భారతమ్మ,, బాల,,మధు, అలాగే కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక…

తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక

◆:- కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు . శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు.

లాంచ్ చేసిన పథకాలు:

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹50,000 సాయం.రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ.లక్ష గ్రాంట్. రిజిస్ట్రేషన్ల వివరాలు:
ప్రారంభం : 19-09-2025 చివరి తేదీ :06-10-2025 ఆన్లైన్ : TGOBMMS 3 (tgobmms.cgg.gov.in)
ఆఫ్లైన్ దరఖాస్తులు చేసుకోగలరని కోరిన మాజీ ఉపసర్పంచ్ గోపాల్ అన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version