గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..
ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికి ఎన్నో కలలకు ఉంటాయి. అలాంటి వాటిల్లో సొంత ఇల్లు ఉండాలనే కల ఒకటి. అందుకే కొందరు రేయింబవళ్లు కష్టపడి ఈ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. మరోవైపు ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్(Home Loans) పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్డ్), ఫ్లోటింగ్ (Fixed vs Floating Interest Rate)అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఫిక్స్డ్ వడ్డీ రేటు:
ఇందులో మనం తీసుకున్న హోం లోన్(Home Loans) కు ఈఎంఐ(EMI Plans) ప్రతి నెలా ఒకే విధంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనం కట్టే ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఇది సామాన్యుల బడ్జెట్ను సులభతరం చేస్తుంది. దీని వలన నెలవారీ బడ్జెట్ ప్రణాళిక ఈజీ అవుతుంది. ఫిక్స్డ్ (Fixed Interest Rate)వడ్డీరేటు ఫ్లోటింగ్ రేటు కంటే 1 నుంచి 1.5 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. ఫిక్స్డ్ వడ్డీ రేటు వల్ల ఆ బెనిఫిట్స్ దక్కవు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జలమయమైంది.
పాఠశాల ముందు ఉన్న నాళాపై అక్రమ డబ్బాలు వెలువడంతో గ్రామంలోని పలు వీధుల్లో నుండి వచ్చే వర్షపు నీరు మొత్తం పాఠశాల ప్రంగంలోకి వెళ్లి చెరువును తలపించే విధంగా మారింది.ఈ నేపథ్యంలో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వారి వారి ఇండ్లలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.పాఠశాల ముందు ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న నాళపై కొన్ని అక్రమ డబ్బాలు వెలువడంతో గ్రామం నుండి వచ్చే వరద నీరు మొత్తం పాఠశాల ప్రాంగణం మొత్తం నిండిపోయిందని పలువురు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయితీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమ కట్టడాలు వెలువడుతున్నాయని,అలాగే గ్రామ దేవత బొడ్రాయి వద్ద గల ఇటీవల నిర్మించిన ఒక వ్యాపార సముదాయం నాళ ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి మాట్లాడుతూ బుదవారం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీరు విద్యార్థులు బయటికి పోయేందుకు దారి లేకుండా అయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. దారి వెంట డబ్బాలు ఏర్పాటు చేయడంతో వర్షం నీరు మొత్తం పాఠశాల ప్రాంగణంలో నిలిచి విద్యార్థులు నడవకుండా అసౌకర్యాన్ని కలిగించిందని అన్నారు.కాగా తప్పని పరిస్థితుల్లో భారీగా చేరిన వరద నీటినుండి భయాందోళనలకు మధ్య విద్యార్థులు బయటకు వచ్చారని పేరొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం టాయిలెట్లకు వెళ్లకుండా నీరు నిలవడం వల్ల ఇబ్బందిపడ్డారని హెచ్ ఎం పేర్కొన్నారు.కాగా పాఠశాల యందు గ్రావెల్ తో లెవెల్ చేయడం ఎంతగానో అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రహరీ గోడ పక్కన ఏర్పాటు చేసినటువంటి షాపులను తొలగిస్తే వర్షంనీరు బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని గ్రామస్తుల అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఎస్ఏ వన్ ఎగ్జామ్ నిర్వహణ ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం పరీక్షా అనంతరం మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించి పరీక్షా వాయిదా వేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు
– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు
– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్
– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు
– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం
– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు
– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల, నేటిధాత్రి:
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.
Karimnagar Collectorate
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి
నేటి ధాత్రి, పఠాన్ చేరు :
జిన్నారం సీఐగా ఇటీవల బదిలీపై వచ్చిన రమణారెడ్డి బుధవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిన్నారం సర్కిల్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని సూచించారు.
ముదిగుంట గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ గ్రామసభ ఎంపీవో శ్రీపతి బాబురావు బుధవారం నిర్వహించారు. అలాగే గ్రామపంచాయతీ లో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే ఉపాధి హామీ పనుల వివరాలు తెలిపారు.ఈజీఎస్ లో చేపట్టవలసిన పనులు పశువుల పాక,కోళ్ల షెడ్డు, అజోల్లా,నాడెపు కంపోస్ట్ పిట్, మట్టి రోడ్డు నిర్మాణం,చిన్న ఊట కుంటలు,ఫారం ఫండ్, మామిడి తోటల పెంపకం, ఫారెస్ట్ కందకాలు,కొబ్బరి తోటల పెంపకం చేపట్టాలని సూచించారు.అనంతరం మొబైల్ యాప్ తనిఖీ నిర్వహించి సానిటేషన్ పనులు చేపట్టి,100% ఇంటి పన్నులు త్వరగా పూర్తి చేయాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన- జిల్లా గ్రంథాలయ చైర్మన్
మహదేవపూర్, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మెట్ పల్లి గ్రామంలో వివాహానికి హాజరై నూతన వధూవరులను బుధవారం రోజున జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ఆశీర్వదించారు. మండలంలోని మెట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ముల్కల శోభ రవీందర్ యొక్క అన్న కూతురు వివాహానికి హాజరై నూతన వధూ వరులైన ప్రవళిక రెడ్డి విష్ణువర్ధన్ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోట సమ్మయ్య తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.
#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.
#డిఎం హెచ్ ఓ సాంబశివ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.
ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ
నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.
ఎవరు కూడా బయటికి రావద్దు
భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.
మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ వ్యవస్థలో ఆటంకాలు తొలగించండి..
సింగూర్ డ్యాం మరమ్మత్తు సమయంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక..
త్వరలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతన అభివృద్ధి పనులకు ప్రణాళిక..
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పఠాన్ చేరు, నేటి ధాత్రి :
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి మురుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పైప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించాలని జిహెచ్ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు. పటాన్చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని రావాలని.. ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి అందించడం అంతకంటే ప్రాధాన్యత అంశమని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంచినీటి పంపిణీ అంశంలో అలసత్వం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. వచ్చేనెల 10వ తేదీ లోపు పంపిణీ అంశంలో గల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.
Mission Bhagiratha
డిసెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, క్యాసారం, నందిగామ, గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం, కానుకుంట, కొత్తపల్లి, మంబాపూర్, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, రామిరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, తదితర గ్రామాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను సంబంధిత ఎంపీడీవోలు, కార్యదర్శులతో చర్చించారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిధులు కొరత మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత కార్యదర్శులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని కోరారు. గుమ్మడిదల నుండి కానుకుంట మీదుగా నూతనకల్ వరకు రహదారి నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు, ఘనాపూర్, వెలిమెల, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ పరిధిలో 6 కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో లసత్వం వహించవద్దని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, పటాన్చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రేవతి, సింగాలగుంట వాసులు..
తిరుపతి,నేటిధాత్రి:
సింగా లగుంట 38 వా వార్డు నందు పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడ వాళ్లతో వసతుల గురించి చర్చించి వారికి బెస్షీట్లు మరియు బ్రెడ్లు ఏపీజీ&బిసి చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, తిరుపతి మాజీ మ్మెల్యే మన్నూరు సుగుణమ్మ , 38వ వార్డు ముఖ్య నాయకురాలు సింగాలగుంట రేవతి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోసంతోష్ ,విశ్వనాధం , ఆముదాల తులసి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
#అధికారులు,కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే నాయిని విజ్ఞప్తి..
#మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా హనుమకొండ నగరంలో వరద పరిస్థితి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
హన్మకొండ, నేటిధాత్రి:
నగరంలో చాలా చోట్ల వరద ప్రవాహం కన్పిస్తుంది.. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడూ సమాచారం ఇవ్వండి.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు… సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ : 1800 4251115 18004251980
డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ డిగ్రీ కళాశాలలో పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ… కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు నేటితో ముగియడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు.బడుగు, బలహీన,వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు జి.అంజి,అసిఫ్, విజయ్,జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.
కల్వకుర్తి, నేటిధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.
మనీషా ఇండియన్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని ఆయా గ్రామాల లోని గ్యాస్కనెక్షన్ లేని వినియెగదారులు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ప్రభుత్వం అందిస్తుంది అని అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం సభ్యులు చెల్మెడ అనిల్ కుమార్ అని అన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు రేషన్ కార్డు పై గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అర్హులని మనీషా ఇండియన్ గ్యాస్ యాజమాన్యం తెలపడం జరిగిందన్నారు .ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ చేసుకోవలసిన అర్హత వివరాలు రేషన్ కార్డు లో ఉన్న మహిళ అభ్యర్థుల పేరు పై అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు. కావలసిన పత్రాలు (డాక్యుమెంట్)వివరాలు ముందుగా రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల అందరివి ఆధార్ కార్డ్ జీరాక్స్, బ్యాంకు అకౌంట్ జీరాక్స్, అప్లికేషన్ కలిగిన వారి ఒక ఫోటో ఇవ్వగలరని తెలియజేయడం జరిగింది.ఇంతకు ముందు రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల ఏ ఒక్కరికి పై కూడా ఎక్కడ కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు అని అప్లికేషన్ ఫారం తో అన్ని పత్రాలు జత చేసి కోహీర్ మనీషా ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో ఇవ్వగలరు అని తెలిపారు.
ఆయిల్ ఫామ్ విత్తన సాగు ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారులు..
నిజాంపేట, నేటిధాత్రి:
ఆయిల్ ఫామ్ రిసోర్సెస్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగు నర్సరీ ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపడం ఆనందకరంగ ఉందన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అధిక ఆదాయన్నీ పొందవచ్చని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలను ఈ పంట ఇస్తుందన్నారు. జిల్లాలో పంట విస్తరణకు కావాల్సిన నాణ్యమైన మొక్కలను స్థానిక స్థాయిలో పెంచడమే ఈ నర్సరీ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. చల్మెడ గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ ద్వారా మెదక్ జిల్లాకు నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మొదటి విడత లక్ష విత్తనాలు నాటుటకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రైతుల పొలాల్లో నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వినయ్ విన్సెంట్, రాజ్ నారాయణ, ఏఈఓ లు శ్రీలత, మౌనిక, రమ్య, రైతులు ఉన్నారు.
*వెంటనే సమస్య పరిష్కారం కావాడమే గాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
*పంచాయతీ ప్రజలు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి..
పలమనేరు(నేటిధాత్రి)అక్టోబర్ 29:
గంగవరం మండలంలోని ఒక ప్రైవేటు డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి.ఆ డైరీ నుంచి వెలువడే రసాయనలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరడంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు, అధికారులతో కలసి పరిశీలించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గెట్ డైరీ వ్యర్థాల కారణంగా వనపకుంట, తూము గుంట, కమ్మ వాళ్ళ కుంట చెరువులలో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారుల అలసత్వంపై తీవ్ర అగ్రహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులలో కలుషితమైన నీటిని ప్రజలు వినియోగించకుండా చూడాలని అదేవిధంగా పశువులు ఇతర జంతువులు నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అదే విధంగా చెరువులలో నీరు కలుషితం కావడానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్, ఫిషరీస్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రాబట్టాలని అధికారులకు తెలిపారు. భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో వైపు చెరువు కట్టలు, సప్లై ఛానల్ కు సంబంధించి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను అధికారులు త్వరగా పరిష్కరిస్తారని అంతవరకు పంచాయతీ వాసులు కలుషితమైన నీటిని వాడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసిల్దార్ రేఖా రెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్లా నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, సర్వేయర్ రవి,అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్ పయనిలతో పాటు గంగవరం మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్,ప్రతాప్ రెడ్డి,ప్రసాద్ నాయుడు, భాస్కర్ రెడ్డి,గిరిధర్ గోపాల్, సోము, శేఖర్,రెడ్డప్ప, శీన, హేమగిరి తదితరులున్నారు.
మండలంలోని నర్సక్కపల్లె గ్రామానికి చెందిన కేశిరెడ్డి సాంబరెడ్డి సరిత దంపతుల కుమార్తె నిధిరెడ్డి చిరంజీవి ఓం ప్రకాష్ రెడ్డి వారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వీరి వెంట ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు నాగుర్ల సంతోష్ రావు,బొంపల్లి నేతాజీ మోహన్ రావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షాలకు చేతికి వచ్చిన పత్తి పంట తీవ్రంగా దెబ్బతిని రైతులకు విపరీత మైన నష్టం వాటిల్లిందని ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామ బి. ఆర్.. ఎస్. సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి అన్నారు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ముప్పై వేల నష్ట పరిహారం అందించాలని అలాగే యాసంగి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఋణ మాఫీ కాక మిగిలిన రైతులకు వెంటనే ఋణ మాఫీ చేయాలని కోరారు లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని హెచ్చరించారు,
ఉప్పల్ -జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య భీంపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాల ప్రక్కన సిమెంట్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు బహుశా ఎదో రైలు బండి నుండీ క్రింద పడగ చనిపోయి ఉంటాడు. మృతుడు నవీ బ్లూ ఫుల్ టీ షర్ట్, నవీ బ్లూ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు మృతుని వద్ద ఏపీఎస్ ఆర్టిసి బస్సు టికెట్ గుడివాడ నుండి విజయవాడ కలదు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీ లో భద్రపర్చానైనది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోదన చేయుచున్నాను ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి సమాచారం ఇవ్వగలరని కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.